Bacteria on Pillow: మీ ఇంట్లో టాయిలెట్ సీట్ కంటే మీరు తలకింద పెట్టుకునే దిండు పైనే ఎక్కువ బ్యాక్టీరియా-there is more bacteria on the pillow you put under your head than on the toilet seat in your house ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bacteria On Pillow: మీ ఇంట్లో టాయిలెట్ సీట్ కంటే మీరు తలకింద పెట్టుకునే దిండు పైనే ఎక్కువ బ్యాక్టీరియా

Bacteria on Pillow: మీ ఇంట్లో టాయిలెట్ సీట్ కంటే మీరు తలకింద పెట్టుకునే దిండు పైనే ఎక్కువ బ్యాక్టీరియా

Haritha Chappa HT Telugu

Bacteria on Pillow: ఇంట్లో బాత్రూంలోనే అధికంగా బ్యాక్టీరియా ఉంటుందని అందరూ అనుకుంటారు నిజానికి ఎక్కువ బ్యాక్టీరియా ఉండేది మీరు వాడే దిండులో పైనే

తలగడ పై బ్యాక్టిరియా ఎంత ఉంటుందో తెలుసా? (Pixabay)

ఇంట్లో బ్యాక్టీరియా చేరిందంటే అనారోగ్యాలు రావడం మొదలవుతాయి. చాలామంది టాయిలెట్ లోనే అధికంగా బ్యాక్టీరియా ఉంటుంది అనుకుంటారు. స్లీప్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం మీ టాయిలెట్ సీటు మీద ఉన్న బ్యాక్టీరియా కంటే ఒక వారం రోజులు మీరు వాడిన దిండుపైనా ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది.

పరుపులు, బెడ్ షీట్లు, దిండ్లు అన్నింటినీ ప్రతి వారం మార్చుకోవాలి. వాటిని ప్రతి వారం ఉతుక్కోవాలి. లేకుంటే వాటిపై బ్యాక్టీరియా అధిక మొత్తంలో పేరుకుపోతుంది. నాలు వారాలపాటు ఆ దిండును ఉతక్కుండా ఉంచితే ప్రతి చదరపు అంగుళంలో బ్యాక్టీరియా కాలనీలే ఏర్పడుతాయి. వాటిని వాడడం చాలా ప్రమాదకరం.

ఎంత బ్యాక్టిరియా ఉంటుందంటే...

నివేదిక చెబుతున్న ప్రకారం మీ దిండును ఒక వారం రోజులు వాడిన తర్వాత దానిపై 17,000 కంటే ఎక్కువ బ్యాక్టీరియాల చేరుతాయి. దాన్ని అలా నెల రోజులు వదిలేస్తే ప్రతి చదరపు అంగుళానికి మూడు నుండి ఐదు మిలియన్ల బ్యాక్టీరియాలు ఏర్పడి కాలనీలోనే ఏర్పరుస్తాయి.

దిండు పైపే పేరుకుపోయే బ్యాక్టీరియాలలో గ్రామ్ నెగిటివ్ రాడ్, గ్రామ్ పాజిటివ్ రాడ్, బాసిల్లి, గ్రామ్ పాజిటివ్ కోకి... వంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలు మన శరీరంలో చేరితే చాలా ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. కొన్ని విపరీతమైన హానిని కలుగజేస్తే... మరికొన్ని తక్కువ హానికరమైనవి.

ఇలా మురికి పట్టిన దిండు కవర్లపై పడుకోవడం వల్ల ఆ బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలులు మీకు అలెర్జీని కలిగిస్తాయి. మొటిమలు, చర్మం, దురదలు పెట్టడం వంటి సమస్యలు ఏర్పడతాయి. అలాగే దిండు కవర్లు నూనె, చెమట, చర్మ కణాలతో నిండిపోతుంది.

అవన్నీ కూడా బ్యాక్టీరియాకు ఆహారంగా మారి వాటిని పెంచి పోషిస్తాయి. అలాంటి దిండులను వాడితే మీకు తామర, గజ్జి వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

ఇలాంటి దిండులను వాడడం వల్ల శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం పెరిగిపోతుంది. ఇది ఆస్తమాకు కారణం అవుతుంది. తుమ్ములు, ముక్కు నుంచి నీరు కారడం, శ్వాస ఆడక పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే బ్యాక్టీరియా ఉన్న దిండులను వాడడం వల్ల దీర్ఘకాలిక శ్వాస కోశ వ్యాధులు తీవ్రమైపోతాయి.

మొటిమలు ఉన్నవారికి

కొందరికి మొటిమలు తరచూ వస్తూ ఉంటాయి. ఆ మొటిమల నుంచి చర్మంలోకి ప్రవేశిస్తాయి. అలాంటి మొటిమలు ఉన్నవారు ఇలాంటి ఉతకని దిండులపై, బెడ్ షీట్లపై పడుకుంటే ఆ బాక్టీరియా చర్మంలోకి చొచ్చకుని వెళ్లి తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది. అలాగే బ్యాక్టీరియా వల్ల తలపై చుండ్రు ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి.

ఎక్కువ రోజులపాటు తలగడ కవర్లను, బెడ్ షీట్లను ఉతక్కపోతే నల్లులు వంటివి చేరే అవకాశం ఉంటుంది. ఇవి చాలా ప్రమాదకరమైనవి. ఇలాంటి ఉతకని దిండులను, బెడ్ షీట్లను వాడడం వల్ల నిద్రా కూడా సరిగా పట్టదు. పరిశుభ్రత లేని కారణంగా అనారోగ్య సమస్యలు అధికంగా వస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు దిండులను ఉతుక్కొని వాడడం చాలా ముఖ్యం.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం