ఆంగ్ల అక్షరం F మధ్యలో ఒక E ఉంది, అది ఎక్కడుందో ఐదు సెకన్లలో కనిపెడితే మీ మెదడు అద్భుతంగా పనిచేస్తుందని అర్థం-there is an e in the middle of the english letter f if you can find it in five seconds it means your brain is working ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఆంగ్ల అక్షరం F మధ్యలో ఒక E ఉంది, అది ఎక్కడుందో ఐదు సెకన్లలో కనిపెడితే మీ మెదడు అద్భుతంగా పనిచేస్తుందని అర్థం

ఆంగ్ల అక్షరం F మధ్యలో ఒక E ఉంది, అది ఎక్కడుందో ఐదు సెకన్లలో కనిపెడితే మీ మెదడు అద్భుతంగా పనిచేస్తుందని అర్థం

Haritha Chappa HT Telugu

ఆప్టికల్ ఇల్యుషన్లు మెదడుకు పరీక్ష పెట్టే సవాళ్లు. ఇక్కడ మేము మరొక ఆప్టికల్ ఇల్యూషన్ ఇచ్చాము. దీన్ని మీరు ఐదు సెకన్లలో చేధిస్తే మీరు చాలా తెలివైన వారని అర్థం చేసుకోవచ్చు.

ఆప్టికల్ ఇల్యూషన్

ఆప్టికల్ ఇల్యూషన్ మీ మెదడుకు సవాలు చేయడానికి వచ్చేసింది. మీ తెలివితేటలను పరీక్షించడానికి ఇది అద్భుతమైన పజిల్ అని చెప్పుకోవాలి. ఇది మీ కళ్ళను మోసం చేయవచ్చు... కానీ తెలివైన మీ మెదడును మాత్రం మోసం చేయలేదు. పరీక్షగా పరిశీలించి జవాబును కనిపెట్టండి.

ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యుషన్లు ఆంగ్ల అక్షరం F అన్నిచోట్లా ఉంది. కానీ ఒకచోట మాత్రం ఆంగ్ల అక్షరం E ఉంది. అది ఎక్కడ ఇరుక్కుని ఉందో ఐదు సెకన్లలోపే కనిపెట్టాలి. అలా కనిపెడితే మీరు మేధావి అని, మీ మెదడు అద్భుతంగా పనిచేస్తుందని అర్థం చేసుకోవచ్చు.

అన్ని అక్షరాలు ఒకేలా ఉన్నప్పుడు మీ మెదడు, మీ కంటి చూపు మిమ్మల్ని మోసం చేయవచ్చు. కానీ మీ లక్ష్యాన్ని గుర్తుచేసుకొని సమాధానాన్ని కనిపెట్టడమే మీ ముందున్న సవాలు. ఎక్కువ సమయం ఇస్తే ఈజీగా ఎవరైనా కనిపెట్టేయగలరు. కానీ ఇచ్చిన నిర్ణీత సమయంలోపే మీరు అక్కడున్న తేడా అక్షరాన్ని కనిపెట్టాలి. మీకు ఇస్తున్న టైం కేవలం ఐదు సెకన్లే. ఐదు సెకన్లలోనే ఆంగ్ల అక్షరం E ఎక్కడ ఉందో కనిపెడితే మీరు తెలివైన వారి జాబితాలో ఉంటారు.

జవాబు ఇదిగో

ఆప్టికల్ ఇల్యూషన్లు జవాబును కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. కేవలం 5 సెకన్లలోనే మీరు కనబడితే మీరు చాలా తెలివైన వారని అర్థం. మీరు సరైన పద్ధతిలో కృషి చేస్తే కచ్చితంగా అనుకున్నది సాధిస్తారు. మీ కంటిచూపు, మెదడు కూడా అద్భుతంగా పనిచేస్తుందని అర్థం. ఇక జవాబును కనిపెట్టలేని వారి కోసమే మేము ఇక్కడ గా చెబుతున్నాము. ఈ ఆప్టికల్ ఇల్యుషన్లో చివరి నుంచి రెండవ నిలువ వరసలో E అనే అక్షరం ఉంది.

ఆప్టికల్ భ్రమలు సులువుగా కనిపించిన మెదడుకు సవాలు విసురుతాయి. వీటిని ఛేదించడం వల్ల మీకు మానసికంగా ఎంతో మేలు జరుగుతుంది. మీలో పరిశీలనా నైపుణ్యాలు పెరుగుతాయి. అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారాలను ఆలోచించే దిశగా మీ మెదడు పనిచేస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఆప్టికల్ ఇల్యూషన్లను ఛేదించేందుకు ప్రయత్నించండి. ఇవి మీ మెదడును పదును పెట్టి మీ ఆలోచనా శక్తిని పెంచుతాయి. పిల్లలకు కూడా ఆప్టికల్ ఇల్ల్యూషన్లను అలవాటు చేయడం మంచిది. ఇది వారిలో ఆలోచనా శక్తిని పెంచి చదువును సులభతరం చేస్తుంది.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.