Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లు లేదా ఆప్టికల్ భ్రమలు చాలా భిన్నంగా ఉంటాయి. వీటిని చేధించాలంటే మెదడు చురుగ్గా పనిచేయాలి. కంటి చూపు పదునుగా ఉండాలి. మెదడు, కంటిచూపు కలిసి పనిచేస్తేనే ఈ ఆప్టికల్ ఇల్యూషన్లను త్వరగా చేధించగలరు. ఇక్కడ మేము ఇచ్చిన ఆప్టికల్ ఇల్ల్యూషన్లలో 9 అంకె అన్నిచోట్లా ఉంది. కానీ ఒకచోట మాత్రం 9 తిరగబడి ఆరుగా కనిపిస్తోంది. అది ఎక్కడుందో కనిపెట్టాలి. ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా కనిపెట్టేస్తారు. కేవలం 6 సెకండ్లలో ఆ అంకెను కనిపెట్టాలి. 6 సెకండ్లలోనే మీరు ఆరు అంకెను కనిపెడితే మీరు చాలా తెలివైన వారని, మీ మెదడు అద్భుతంగా పనిచేస్తుందని ఒప్పుకోవచ్చు.
ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. నిజానికి ఇది చాలా సింపుల్ ఆప్టికల్ ఇల్యూషన్. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన అంకెలు పెద్దవిగానే ఉన్నాయి. కాస్త పరిశీలనగా చూస్తే చాలు ఆరు అంకె సులువుగా దొరికిపోతుంది. కాబట్టే మీకు కనిపెట్టడానికి కేవలం 6 సెకండ్ల సమయమే ఇచ్చాము. మీరు ఆరు సెకండ్లలోనే కనిపెడితే మీ మెదడు, కంటిచూపు సమన్వయం బాగుందని అర్థం చేసుకోవచ్చు. ఆరు సెకన్ల తర్వాత జవాబును కనిపెట్టినా పెద్దగా మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద అంకెలే ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మంది ఇట్టే కనిపిస్తారు. ఇక జవాబు విషయానికి వస్తే చివరి అడ్డుపరసలోనే ఉంది ఆరు అనే అంకె.
ఈరోజుల్లో ఆప్టికల్ ఇల్యూషన్లను చూస్తున్నా వారి సంఖ్య అధికంగానే ఉంది. వీటికి డిమాండ్ పెరుగుతోందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆప్టికల్ ఇల్యూషన్లను... బ్రెయిన్ టీజర్లుగా పని చేస్తాయి. ఇవి బ్రెయిన్‌కి అని చెప్పి వాటి పనితీరును పెంచుతాయి. ఈ ఆప్టికల్ ఇల్లుషన్లు చాలా చిత్రమైనవి. ప్రశ్న, జవాబు రెండింటినీ తనలోనే దాచుకుంటాయి. కళ్ళముందే ప్రశ్నా, జవాబు రెండూ కనిపిస్తాయి. కానీ జవాబును వెతికి పట్టుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అందుకే ఆప్టికల్ ఇల్యూషన్లకు అంత క్రేజ్ వచ్చింది.
ఆప్టికల్ ఇల్యూషన్లను తరచూ సాల్వ్ చేసేవారు, చాలా తెలివైన వారిగా మారుతారు. వారికి ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. సవాళ్లను, సమస్యలను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. జీవితంలో ఏమైనా కష్టాలు, సమస్యలు ఎదురైతే బెదిరిపోకుండా వాటిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు.
ముఖ్యంగా పిల్లలకు ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లను చేధించడం అలవాటు చేయాలి. అవి పిల్లలను ఆలోచించేలా చేస్తాయి. వారి ఆలోచనా విధానాన్ని విస్తరిస్తాయి. వారి వ్యక్తిత్వాన్ని గొప్పగా మారుస్తాయి. చిన్న చిన్న సమస్యలకు భయపడడం,బెదిరిపోవడం వంటి వాటికి స్వస్తి చెపుతాయి. పిల్లల్లో ఆలోచనలనుపెంచి, ఏ సమస్యనైనా తట్టుకుని ఛేదించే శక్తిని ఇస్తాయి. కాబట్టి పిల్లలకు ఉదయం ఒక ఆప్టికల్ ఇల్యూషన్,సాయంత్రం ఒక ఆప్టికల్ ఇల్యూషన్ ఇచ్చి తక్కువ సమయంలోనే చేధించమని చెప్పండి.
టాపిక్