Limestone Benifits: పాన్‌లో సున్నం తినడం చెడ్డ అలవాటు ఏం కాదు! పద్ధతిగా తింటే ఎన్నో రకాల ప్రయోజనాలను పొందచ్చు తెలుసా!
Limestone Benefits: సున్నం అంటే కేవలం పాన్ షాపుల్లో పాన్‌లో వేసే పదార్థం మాత్రమే అనుకుంటే మీరు పొరపడ్డట్టే! ఎందుకంటే మితంగా తినడం వల్ల సున్నం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందట. అయితే దాన్ని సరైన పద్థతిలో తినడం చాలా ముఖ్యం. ఎలా తింటే సున్నం ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసుకుందా రండి.
సున్నం(Limestone) తినం చెడ్డ అలావాటేం కాదా? దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందా? ఇదెక్కడి గోళరా బాబు అని మీకు అనిపించవచ్చు. వినడానికి ఇది కాస్త వింతగానూ, ఆశ్చర్యంగానూ అనిపించవచ్చు. ఎందుకంటే సున్నం అంటే కేవలం పాన్‌లో వేసే పదార్థం గానే మీరు భావిస్తున్నారు కనుక. కానీ నిజానికి సున్నం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల మేలు జరుగుతుందట. కాకపోతే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. సరైన పద్ధతిలో తింటేనే ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లేకపోతే ప్రయోజనాలకు బదులు నష్టం కలుగుతుంది.

నిజానికి సున్నం అనేది కాల్షియం, ఆక్సిజన్‌తో తయారైన రసాయనం. దీన్ని నీటిలో కలిపినప్పుడు, ఇది కాల్షియం హైడ్రాక్సైడ్‌గా మారుతుంది. దీన్ని వాడుక భాషలో లైమ్ వాటర్(Lime water) అంటారు. ఇప్పటి వరకూ పాన్, సుపారీతో పాటు పాన్ వ్యాపారుల దగ్గర దొరికే సున్నం చాలా మంది తింటారు. కానీ ఆయుర్వేదంలో చెప్పినట్టుగా తిని ఉండరు. ఆయుర్వేదం ప్రకారం.. సున్నం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, తినే పద్ధతి గురించి తెలుసుకుందాం రండి.
సున్నం తినే విధానం:
సున్నాన్ని పాన్ రూపంలో కాకుండా ఆరోగ్య ప్రయోజనాల కోసం తినే విధానం తెలుసుకోవడం ముఖ్యం. ప్రముఖ డైటీషియన్ శ్రేయా గోయల్ సున్నం తినే విధానాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆమె ప్రకారం ప్రతిరోజు గోధుమ గింజ పరిమాణంలో సున్నాన్ని తినచ్చు. ఇందులో 500 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇలా ఒక వారం పాటు వరుసగా తిన్న తర్వాత మరో వారం పాటు విరామం తీసుకోండి. ఇలా వారం వదిలి వారం నాలుగు వారాల పాటు ఇలా తినచ్చు. వరుసగా మాత్రం తినకూడదు. అలాగే నాలుగు వారాల పాటు తిన్నాక, మరో ఆరు నెలల పాటు సున్నం తినకుండా ఉండాలి. ఇలా పద్దతి ప్రకారం సున్నాన్ని తిన్నారంటే కింది ప్రయోజనాలన్నింటినీ పొందవచ్చు.
పద్ధతి ప్రకారం సున్నం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఎముకలు, దంతాలను బలపరుస్తుంది
సున్నంలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఎముకలను బలపరుస్తుంది. సున్నం వల్ల దంతాలు కూడా బలంగా తయారవుతాయి.
జీర్ణక్రియకు సహాయపడుతుంది
సున్నం తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అయి జీర్ణక్రియ మెరుగవుతుంది.
జాయింట్ నొప్పుల నుండి ఉపశమనం
కాల్షియం లోపం వల్ల జాయింట్ నొప్పులు వస్తున్నట్లయితే సున్నం మీకు చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
సున్నంలో అనేక ఖనిజాలు ఉంటాయి, ఇవి శరీరాన్ని అనేక రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.
పిల్లల ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది
పిల్లలకు గోధుమ ధాన్యం పరిమాణంలో సున్నాన్ని పెరుగు లేదా పప్పులో కలిపి ఇస్తే, పిల్లల ఎముకలు బలపడటమే కాకుండా, వారు ఎత్తు పెరగడానికి కూడా సహాయపడుతుంది.
హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది
సున్నం కాల్షియంతో పాటు విటమిన్- సికి కూడా మంచి మూలం. ఇది హై బ్లడ్ ప్రెషర్ ప్రభావాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. = హృదయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది
అధికంగా తినడం వల్ల బరువు పెరుగుతున్నట్లయితే, ఒక గ్లాసు నీటిలో గోధుమ ధాన్యం కంటే చిన్న మొత్తంలో సున్నం వేసుకుని త్రాగండి. ఇందులోని సిట్రిక్ ఆమ్లం శరీర జీవక్రియను పెంచుతుంది. దీనివల్ల అదనపు కేలరీలు శరీరం నుండి బయటకు పోతాయి, కొవ్వు తక్కువగా నిల్వ చేయబడుతుంది.
సున్నం తినే విధానం:
సున్నాన్ని నేరుగా కాకుండా నీటితో, పెరుగు, పప్పులో కలిపి తినవచ్చు. ఇలా చేస్తే సున్నంతో కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.