5 levels of conversation in a relationship: మీ బంధం 10 కాలాలు నిలవాలంటే..
5 levels of conversation in a relationship: రిలేషన్‌షిప్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే మీరు బాగా ప్రేమించాననుకుంటే సరిపోదు. చాలా పాజిటివ్‌గా, మీరు ప్రేమించిన వారికి ఆసక్తికరంగా మీ సంభాషణ ఉండాలి.. ఈ దిశగా నిపుణుల సూచనలు ఒకసారి చూడండి.
ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్ ఉంటే రిలేషన్‌షిప్ బాగుంటుంది. ఏ బంధంలోనైనా సరే వారు తమ ఫీలింగ్స్, ఎమోషన్స్, ఎక్స్‌పెక్టేషన్స్, అవసరాలు, కోరికలు వ్యక్తీకరించాలని కోరుకుంటారు. సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇదే చక్కని మార్గం కూడా. అవతలి వ్యక్తి మనసును చదివి మనం ఏమి ఆలోచిస్తున్నామో తెలుసుకోవాలని ఆశించడంపై ఆధారపడిన సంబంధాలు, తరచుగా కాలక్రమంలో టాక్సిక్ రిలేషన్‌గా మారుతాయి. అంతిమంగా విడిపోవడానికి దారితీస్తాయి. రిలేషన్‌షిప్‌లో సంభాషణ ఉండాలి. హెల్తీ కమ్యూనికేషన్ ఉండాలి. ఏ అంశమైనా ఇద్దరూ చర్చించుకునేలా ఉండాలి. అసౌకర్యంగా ఉండే సంభాషణలు కూడా చర్చించుకుని ఒక పరిష్కారం వెతుక్కునే అవకాశం ఇందులో ఉంటుంది. గతంలో ఉన్న చేదు అనుభవాల కారణంగా ఎదురైన భయాలను మీ రిలేషన్‌షిప్‌లో చొప్పిస్తే మీ బంధం విరిగిపోయి మరోసారి మానసిక గాయం మిగలొచ్చు. మీ బంధం పది కాలాల పాటు నిలవాలంటే మీ ప్రేమ ఒక్కటే సరిపోదు. సానుకూలత, నమ్మకం, ఎదుటి వారికి మీ సంభాషణ పట్ల ఆసక్తి ఉండాలి.
ట్రెండింగ్ వార్తలు
మ్యారేజ్, ఫ్యామిలీ థెరపిస్ట్ ఎలిజబెత్ ఎర్న్‌షా రిలేషన్‌షిప్స్‌కు సంబంధించిన అనేక అంశాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా షేర్ చేస్తుంటారు. రిలేషన్‌షిప్‌లో ఉండాల్సిన కమ్యూనికేషన్ అవసరాలను తాజా పోస్టులో వివరించారు. ‘ప్రతి దశలో సంభాషణ సంతృప్తికరంగా, బంధానికి సహాయకారిగా ఉండాలి. సంభాషణలు చెత్తవి, ఉత్తమమైనవంటూ ఉండవు. సంభాషణ స్థాయిని బట్టి మీరు ప్రేమించే వారి జీవితంలో ఏ స్థానంలో ఉన్నారో అంచనా వేయొచ్చు. మీ భావాలను వినిపించొచ్చు..’ అని వివరించారు. సంభాషణకు సంబంధించిన 5 స్థాయిలను ఆమె వివరించారు.
ప్రారంభ దశ: సంభాషణ ప్రారంభించడం ఒక సవాలులాంటిది. అయితే సాధారణంగా చిన్నచిన్న అంశాలతో సంభాషణ ప్రారంభించడం మేలు చేస్తుంది. భాగస్వామి ఆరోగ్యం గురించో, భోజనం గురించి అడుగుతూ ప్రారంభించవచ్చు. లేదా వాతావరణం గురించో మాట్లాడొచ్చు.
సమాచారం పంచుకోవడం: ఒక నిర్ధిష్ట సమాచారం అవతలి వ్యక్తికి ఆసక్తి కలిగించవచ్చు. తద్వారా ఆ వ్యక్తి మరికొంత సేపు ఆ కమ్యూనికేషన్ కొనసాగించవచ్చు.
ఐడియా, ఒపీనియన్ పంచుకోవడం: మూడో దశలో సంభాషణలో లోతైన ఆలోచనలు, దృక్కోణాలు పంచుకోవచ్చు. అవతలి వ్యక్తి మీతో సంభాషణకు ఆసక్తి చూపినప్పుడు ఇలా చేయొచ్చు.
విలువలు, భావాలు: విలువల గురించి, భావోద్వేగాల గురించి చర్చించుకోవడం అంటే సాన్నిహిత్యపు దశకు చేరినట్టే. క్లోజ్ అని మనం భావించిన వారితో షేర్ చేసుకునే అన్నీ ఈ దశలో షేర్ చేసుకోవచ్చు.
నిజాలు: సంభాషణలో అత్యున్నత దశలో రిలేషన్‌షిప్ గురించి నిజాలు, అభిప్రాయాలు చర్చించుకోవచ్చు. వారి అభిప్రాయాలను కూడా కోరవచ్చు.