మామిడి రకాలలో ప్రత్యేకమైనది సింధూరం మామిడి, జీవితంలో ఒక్కసారైనా దీన్ని తినాల్సిందే-the sindhuram mango is a unique mango variety and you should eat it at least once in your life ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మామిడి రకాలలో ప్రత్యేకమైనది సింధూరం మామిడి, జీవితంలో ఒక్కసారైనా దీన్ని తినాల్సిందే

మామిడి రకాలలో ప్రత్యేకమైనది సింధూరం మామిడి, జీవితంలో ఒక్కసారైనా దీన్ని తినాల్సిందే

Haritha Chappa HT Telugu

సింధూరం అంటేనే ఆపరేషన్ సింధూరం గుర్తుకు వస్తుంది కానీ, ఇక్కడ మనం సింధూరం మామిడి గురించి మాట్లాడుతున్నాం. ఎర్రగా ఉండే ఈ మామిడికి సింధూరం అనే పేరు ఎలా వచ్చింది? దీని ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం.

సింధూరం మామిడి (PC: Indiamart)

మామిడి పండ్లు తినాలంటే ప్రతి ఏడాది వేసవి వరకు వేచి ఉండాల్సిందే. మామిడి పండ్లలో ఎన్నో రకాలు ఉన్నాయి. మామిడిలో భిన్నమైన రుచులతో, అనేక పేర్లతో ఎన్నో రకాలు ఉన్నాయి. వేసవి రోజుల్లో దొరికే మామిడి పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

మామిడి పండు ఇష్టమైతే… మీరు ఖచ్చితంగా తినాల్సిన రకం సింధూరం మామిడి. హిందూ ధర్మంలో సింధూరానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఎర్రని పండు తీపి, పుల్లని రుచితో సువాసనను వెదజల్లుతుంది. సింధూరం మామిడికి ఈ పేరు ఎలా వచ్చింది? దీని ప్రత్యేకతలు ఏమిటి? ఎక్కడ వీటిని పండిస్తారు? తెలుసుకోండి

సింధూరం మామిడి చరిత్ర

‘సింధూరం’ అనే పేరు మామిడి పండు లేబుల్ మాత్రమే కాదు, ఇది భారతదేశ సాంస్కృతిక చరిత్రకు ప్రతిబింబం కూడా. సంస్కృతంలో, సింధూరం అంటే పవిత్రమైన ఎరుపు రంగు పొడి. దీన్ని ధార్మక కార్యక్రమాలు, ఆచారాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. శుభం, పవిత్రతను సూచించే ఈ ఆకర్షణీయమైన రంగు మామిడి పండు రూపాన్ని ప్రతిబింబిస్తుంది.

సింధూరం మామిడి భారతీయ సంప్రదాయాల సారాన్ని సూచిస్తుంది. ప్రకృతి, సంస్కృతిని కలిపిన పండు ఇది. ఈ మామిడి పండు తొక్క ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి దీనికి సింధూరం అని పేరు పెట్టారు.

ఈ పండు ప్రత్యేకత ఏమిటి?

సింధూరం మామిడి పండు తీపి, పుల్లని రుచుల కలయిక. తీపిగా లేదా చాలా పుల్లగా ఉండే ఇతర మామిడి రకాలకు భిన్నంగా, మృదువుగా సమతుల్యమైన రుచిని ఇస్తుంది. దాని తీపి రుచిలో పులుపు కూడా కలిసి ఉంటుంది. దీని విభిన్న రుచి మామిడి ప్రియులకు నచ్చుతుంది.

మామిడి పండ్ల సీజన్ ప్రారంభమైనప్పుడు, ఈ పండు మొదట మార్కెట్లోకి వస్తుంది. ఇతర మామిడి రకాలు పండడానికి సమయం పడుతుంది. వేసవి ప్రారంభాన్ని సూచించే మామిడి పండుగా కూడా చెప్పుకుంటారు.

సింధూరం మామిడి పండు ఎక్కడ పండిస్తారు?

సింధూరం మామిడి దక్షిణ భారతదేశపు ఉష్ణమండల వాతావరణంలో పండిస్తుంది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలలో ఈ మామిడి పండును ఎక్కువగా పండిస్తారు. ఇక్కడి వెచ్చని వాతావరణం, సారవంతమైన నేల సింధూరం మామిడి పంటకు అనుకూలంగా ఉంటుంది. ఈ పండు వేసవి ప్రారంభంలో… మార్చి నుండి మే వరకు లభిస్తుంది.

సింధూరం మామిడి పండు దక్షిణ భారతదేశంలో ఎక్కువగా పండించినప్పటికీ, భారతదేశంలోని అన్ని మార్కెట్లలో ఈ పండు లభిస్తుంది. దక్షిణ భారతదేశంలో, ఈ పండు స్థానిక మార్కెట్లు, పండ్ల దుకాణాలలో లభిస్తుంది. ఈ ఏడాది వేసవి ముగియక ముందు మీరు సింధూరం మామిడి పండు రుచి చూడండి.

ఈ ప్రత్యేక రుచిగల మామిడి పండు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా లభిస్తుంది. బిగ్‌బాస్కెట్, అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో మీరు సింధూరం మామిడి పండును కొనుగోలు చేయవచ్చు.

(గమనిక: ఈ సమాచారం సాధారణ జ్ఞానం, ఇంటర్నెట్‌లో లభించే సమాచారం ఆధారంగా ఇచ్చాము. ఈ సమాచారం పూర్తిగా ఖచ్చితమైనదని హిందూస్తాన్ టైమ్స్ తెలుగు (హెచ్‌టీ కన్నడ) చెప్పడం లేదు. ఈ విషయంపై ఖచ్చితమైన సమాచారం కోసం సంబంధిత రంగ నిపుణులను సంప్రదించండి)

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.