Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో ఒకచోట మాత్రమే 34 సంఖ్య ఉంది, అది ఎక్కడ ఉందో ఐదు సెకన్లలో కనిపెట్టండి-the number 34 is only one place in this optical illusion find out where it is in five seconds ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో ఒకచోట మాత్రమే 34 సంఖ్య ఉంది, అది ఎక్కడ ఉందో ఐదు సెకన్లలో కనిపెట్టండి

Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో ఒకచోట మాత్రమే 34 సంఖ్య ఉంది, అది ఎక్కడ ఉందో ఐదు సెకన్లలో కనిపెట్టండి

Haritha Chappa HT Telugu
Published Feb 12, 2025 04:30 PM IST

Optical Illusion: ఆప్టికల్ ఇల్యుషన్లు ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లను ఇక్కడ ఇచ్చాము. ఇది మీకు ఎంతో నచ్చుతుంది. మీ మెదడుకు సవాలు విసురుతుంది.

ఆప్టికల్ ఇల్యూషన్
ఆప్టికల్ ఇల్యూషన్

ఆప్టికల్ ఇల్యూషన్లను ఇష్టపడే వారి కోసం మరొక ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ తీసుకొచ్చాము. ఇది చూసేందుకు సింపుల్ గా కనిపిస్తున్నా కాసేపు మీ మెదడుకు, కళ్ళకు భ్రమను కలిగిస్తుంది. దాని పరిష్కరించేందుకు మిమ్మల్ని కాస్త కష్టపడుతుంది. కానీ మీరు కచ్చితంగా దీన్ని పరిష్కరించగలరు. ఇక్కడ ఇచ్చిన నెంబర్లలో 34 నెంబరు అన్నిచోట్లా తలకిందులుగా ఉంది. ఒకచోట మాత్రమే 34 తలకిందులుగా లేకుండా ఉంది. అది ఎక్కడ ఉందో కనిపెట్టడమే మీ పని. కేవలం 5 సెకన్లలోనే మీరు ఈ పని పూర్తి చెయ్యాలి. ఐదు సెకన్లలోనే కనిపెడితే మీ మెదడు, కళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు. పది సెకన్లలో కనిపెట్టిన కూడా మీరు తెలివైన వారనే అర్థం చేసుకోవాలి.

ఆప్టికల్ ఇల్యుషన్ జవాబు

ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్ జవాబును మీరు కనిపెడితే మీకు ధన్యవాదాలు. మీ మెదడు చురుగ్గా పనిచేస్తుందని అర్థం. అలాగే మీ కంటి చూపు కూడా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. మీ మెదడు కంటి చూపు కలిసి సమన్వయంతో అనుసంధానమై పనిచేస్తున్నాయని చెప్పవచ్చు. ఇక జవాబు విషయానికి వస్తే అన్ని చోట్ల 34 తలకిందులుగానే ఉంది. కానీ కుడివైపు నుంచి నాలుగో లైన్ లో మాత్రం ఒకచోట 34 సరైన పద్ధతిలో రాసి ఉంది. అదే జవాబు. నిజానికి ఈ ఆప్టికల్ ఇల్యుషన్లో కేవలం 5 సెకన్లలోనే పరిష్కరించేందుకు ప్రయత్నించి వారిలో 99% మంది విఫలమయ్యారు. కేవలం ఒక శాతం మంది మాత్రమే విజయవంతం అయ్యారు.

చురుకైన మెదడు కలిగిన వారు మాత్రమే ఈ ఆప్టికల్ ఇల్యూషన్లను ఐదు సెకన్లలో పరిష్కరించగలరు. ఆప్టికల్ భ్రమలు తెలివిగా మనల్ని ఏమారుస్తాయి. మెదడును మోసం చేస్తాయి. కళ్ళను భ్రమపరుస్తాయి. అందుకే వీటిని కనిపెట్టడం కాస్త కష్టంగానే ఉంటుంది. ఇక్కడున్న సంఖ్యలు మనసును గందరగోళానికి గురి చేసినట్టు ఉంటాయి.

ఆప్టికల్ ఇల్యూషన్ అనేది ఒక దృశ్య వ్యవస్థ. దీనిలో భ్రమ, వాస్తవికత అనేవి కలిసిపోయి కనిపిస్తాయి. అందుకే ఈ రెండింటిని విడదీసే శక్తి మెదడుకు, కంటికి ఉండాలి. ఏది భ్రమో ఏది వాస్తవమో తెలుసుకునేందుకు ఆప్టికల్ ఇల్యూషన్లు ఎంతో ఉపయోగపడతాయి.

కళ్ళు, మెదడు కలిసి పనిచేస్తేనే ఏ ఆప్టికల్ ఇల్యూషన్ నైనా పరిష్కరించగలము. కళ్లు, మెదడు కలిసి పని చేయాలంటే ఏకాగ్రత అవసరం. అందుకే ఆప్టికల్ ఇల్యూషన్లను పరిష్కరించే వారిలో ఏకాగ్రత అధికంగా ఉంటుంది. మీలో కూడా ఏకాగ్రత తక్కువగా ఉంటే ఆప్టికల్ ఇల్యూషన్లను ప్రతిరోజు పరిష్కరించడం మొదలుపెట్టండి. కొన్ని రోజుల్లోనే మీకు మంచి ఫలితాలు కనబడతాయి.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner