Ovarian Cancer: అండాశయ క్యాన్సర్ వల్ల అమ్మతనానికి దూరమైన హీరోయిన్, ఆ క్యాన్సర్ ఎందుకు వస్తుంది?-the heroine who lost her mother due to ovarian cancer why does she get that cancer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ovarian Cancer: అండాశయ క్యాన్సర్ వల్ల అమ్మతనానికి దూరమైన హీరోయిన్, ఆ క్యాన్సర్ ఎందుకు వస్తుంది?

Ovarian Cancer: అండాశయ క్యాన్సర్ వల్ల అమ్మతనానికి దూరమైన హీరోయిన్, ఆ క్యాన్సర్ ఎందుకు వస్తుంది?

Haritha Chappa HT Telugu
Jun 20, 2024 02:00 PM IST

Ovarian Cancer: అండాశయ క్యాన్సర్ కారణంగా గర్భం ధరించడం కష్టంగా మారిపోతుంది. మనీషా కొయిరాలా అండాశయ క్యాన్సర్ బారిన పడి తల్లితనానికి దూరమైపోతున్నట్టు చెబుతోంది.

మనీషా కొయిరాలా
మనీషా కొయిరాలా

క్యాన్సర్ కేసులు ఏటా పెరిగిపోతున్నాయి. ధనిక, పేద అనే తేడా లేకుండా అన్ని వర్గాలలోనూ క్యాన్సర్ మహమ్మారి పాకిపోతోంది. ఎంతో మంది హీరోయిన్లు కూడా ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రముఖ నటి మనీషా కొయిరాలా కూడా క్యాన్సర్ బాధితురాలే. 2012లో ఆమె స్టేజ్ 4 అండాశయ క్యాన్సర్ తో బాధపడుతున్న బయటపడింది. ఆమె న్యూయార్క్ లో ఆ సమస్యకు చికిత్స తీసుకుంది. చికిత్స విజయ వంతం కావడంతో 2014లో కోలుకుంది. అయితే ఆమె క్యాన్సర్ వల్ల తలి కాలేకపోతున్నట్టు బాధపడుతోంది మనీషా కొయిరాలా. కేవలం అండాశయ క్యాన్సర్ తనను తల్లి కాకుండా అడ్డుకుందని ఆమె ఎంతో బాధపడుతోంది.

అండాశయ క్యాన్సర్ అంటే…

సంతానోత్పత్తిపై క్యాన్సర్ ప్రభావాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ వ్యాధిని ఓడించిన తర్వాత మహిళలు తాము గర్భం ధరించగలమో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అండాశయ క్యాన్సర్ అనేది ఆడవారికి మాత్రమే వచ్చే క్యాన్సర్. అండాశయాలలో ఇది అభివృద్ధి చెందుతుంది, ఇవి అండాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ క్యాన్సర్ వచ్చాక ప్రాథమికంగా ఎలాంటి లక్షణాలను చూపించదు. కానీ పొట్ట మొత్తం వ్యాపించే అవకాశం ఉంది.

గర్భం రాదా?

మనీషా కొయిరాలా అండాశయ క్యాన్సర్ వల్లే గర్భం ధరించలేకపోయింది. ఆమె మాత్రమే కాదు ఈ క్యాన్సర్ సోకిన ఏ స్త్రీ అయినా తల్లి కావడం కష్టంగానే మారుతుంది. ఎందుకంటే క్యాన్సర్ చికిత్సలో భాగంగా కీమోథెరపీ, శస్త్రచికిత్స వంటివి చేస్తారు. ఇవి స్త్రీ సంతానోత్పత్తిపై శాశ్వత ప్రభావాన్ని చూపిస్తాయి. కీమోథెరపీ క్యాన్సర్ కణాలను చంపడానికి ప్రభావవంతంగా ఉంటుంది, కానీ అండాశయాలలోని ఆరోగ్యకరమైన కణాలను కూడా దెబ్బతీస్తుంది. దీనివల్ల సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. అంతేకాక, కొంతమంది మహిళలు కీమోథెరపీ వల్ల తాత్కాలిక లేదా శాశ్వతంగీ పీరియడ్స్ ఆగిపోయే సమస్యను ఎదుర్కొంటారు.

అండాశయాలను లేదా కణితిని వెలికి తీయడానికి చేసే శస్త్రచికిత్స కూడా సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల కూడా స్త్రీలు గర్భం ధరించలేరు. మాతృత్వాన్ని పొందలేదు. అయితే, అండం గడ్డకట్టడం లేదా ఐవిఎఫ్ వంటి సహాయక పునరుత్పత్తి సాంకేతికతల వల్ల గర్భం ధరించే అవకాశాలు మాత్రం ఉంటాయి. అండాశయ క్యాన్సర్ ఉన్న మహిళలకు అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్టీ) ఒక ఆశాకిరణం అని చెప్పుకోవచ్చు. గర్భధారణ కలను నెరవేర్చుకోవడానికి క్యాన్సర్ చికిత్సకు ముందే అండాన్ని భద్రపరచుకోవాలి.

అండాశయ క్యాన్సర్ ఉన్న మహిళలు కూడా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవిఎఫ్) ద్వారా దాత గుడ్లు స్వీకరించి తల్లి కావచ్చు. అండాశయ క్యాన్సర్ ఎటువంటి లక్షణాలను కలిగించకుండా పొట్ట అంతటా వ్యాపిస్తుంది, అందువల్ల దాని పెరుగుదలను గుర్తించడం దాదాపు అసాధ్యం. ముఖ్యంగా ప్రారంభ దశలో ఈ క్యాన్సర్ గుర్తించలేరు. క్యాన్సర్ అభివృద్ధి కారణంగా, గుడ్లు మరియు హార్మోన్ల ఉత్పత్తిలో అంతరాయం ఏర్పడుతుంది. ఇది సహజంగా గర్భం ధరించే అవకాశాలను తగ్గిస్తుంది. కాబట్టి అండాశయ క్యాన్సర్ కుటుంబ చరిత్ర ఉంటే ముందుగా అండాలను తీసి భద్రపరచుకోవడం ముఖ్యం. క్యాన్సర్ ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందో గుర్తించడం కష్టం.

Whats_app_banner