Nita Ambani: నీతా అంబానీ వేసుకున్న ఈ బ్లేజర్ ఖరీదు చాలా తక్కువట, ఎంతో తెలిస్తే షాకవుతారు-the cost of this blazer worn by nita ambani is very low you will be shocked to know how much it is ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nita Ambani: నీతా అంబానీ వేసుకున్న ఈ బ్లేజర్ ఖరీదు చాలా తక్కువట, ఎంతో తెలిస్తే షాకవుతారు

Nita Ambani: నీతా అంబానీ వేసుకున్న ఈ బ్లేజర్ ఖరీదు చాలా తక్కువట, ఎంతో తెలిస్తే షాకవుతారు

Haritha Chappa HT Telugu
Published Jul 25, 2024 02:30 PM IST

Nita Ambani: రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ పారిస్ లో ఐఓసీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె వేసుకున్న బ్లేజర్ అందరినీ ఆకట్టుకుంది.

నీతా అంబానీ
నీతా అంబానీ

పారిస్ 2024 ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవ వేడుకలు సమీపిస్తున్న తరుణంలో, భారతదేశం నుండి ఐఓసి సభ్యురాలిగా నీతా అంబానీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) ప్రకటించింది. ప్రముఖ భారతీయ మహిళ, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ పారిస్ లో జరిగిన 142వ ఐఓసీ సమావేశంలో 100% ఓట్లు సాధించి తిరిగి ఎన్నికయ్యారు.

ఈ కార్యక్రమంలో నీతా అంబానీ సొగసైన ట్వీడ్ బ్లేజర్ ధరించి అద్బుతంగా కనిపించారు. ఆ బ్లేజర్లో ఆమె ఎంతో చక్కగా, హూందాగా ఉన్నారు. ఇప్పుడు దాని ఖరీదు గురించే సోషల్ మీడియాలో ట్వీట్లు కనిపిస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో నీతా అంబానీ స్టైలిష్ చానెల్ బ్లేజర్ ధరించి ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. ఆ డ్రెస్సులో క్లాస్‌గా, స్టైల్‌గా కనిపిస్తున్నారు నీతా. ఆమె జాకెట్ ఎవరికైనా ఇట్టే నచ్చేసేలా ఉంది.

నీతా అంబానీ ఎంచుకునే దుస్తులు చాలా హూందాగా ఉంటాయి. చీరలు, లెహెంగాలు వంటి సంప్రదాయ దుస్తుల్లోనే కాదు, జీన్స్ వంటి వెస్ట్రన్ వేర్ లో కూడా నీతా ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆమె వేసుకున్న బ్లేజర్ ఎంతో మంది సెలెబ్రిటీలకు కూడా నచ్చుతుంది. ఈ బ్లేజర్ సిగ్నేచర్ చైన్-లింక్ డిజైన్ ను అనుకరిస్తోంది. ఈ బ్లేజర్ అధునాతనతను కూడా జోడించేలా ఉంది. ఈ జాకెట్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా మారింది.

ఈ బ్లేజర్ ధర ఎంత?

నీతా అంబానీ వేసుకున్న బ్లేజర్ ఎవరికైనా నచ్చుతుంది. దీని ధర గురించి ఎంతో ఆసక్తిగా అందరూ వెతుకుతారు. ఎందరో ఫ్యాషన్ ప్రముఖులు కూడా ఈ పనిని చేశారు. ఆమె అద్భుతమైన చానెల్ బ్లేజర్ ధర 6,891 AED. అంటే మన రూపాయల్లో అక్షరాలా రూ .1.57 లక్షలు. సాధారణ ప్రజానీకానికి ఇది ఎక్కువ ఖరీదే. కానీ నీతాలాంటి బిలియనీర్ కు మాత్రం ఈ ధర చాలా తక్కువ అని కామెంట్ చేస్తున్నారో ఎంతో మంది.

నీతా అంబానీ బ్లేజర్
నీతా అంబానీ బ్లేజర్ (https://theluxurycloset.com/)

ఈ బ్లేజర్ కు జతగా నీతా అంబానీ నలుపు రంగు ప్యాంటు, మెరిసే చెవి దిద్దులు మాత్రమే పెట్టుకుంది. డైమండ్ స్టడ్ చెవిపోగులు, వేలిని అలంకరించిన భారీ ఉంగరం ఆమెను ఎంతో ప్రత్యేకంగా నిలిపింది. ఆమె మేకప్ లో న్యూడ్ ఐషాడో, మస్కారా పూసిన కనురెప్పలు, నల్లగా ఉన్న కనుబొమ్మలు, ఎర్రబడిన బుగ్గలు, ప్రకాశవంతమైన హైలైటర్, న్యూడ్ లిప్ స్టిక్ వేసుకుంది. ఈ లుక్ లో నీతా అంబానీ చాలా సింపుల్ గా, ఎలెగెంట్ గా కనిపిస్తోంది.

Whats_app_banner