కల్మా అంటే ఏంటో ముస్లిం సోదరులకు మాత్రమే తెలుసు. అందుకే పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు ఎవరు ముస్లింలలో తెలుసుకునేందుకు కల్మాను చదవమని అడిగారు. ఆ దాడి తర్వాత కల్మా ఏంటో తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఒక వ్యక్తి కల్మా చదవడం ద్వారానే తన ప్రాణాన్ని కూడా కాపాడుకున్నాడు. అసలు కల్మా అంటే ఏమిటో ఇస్లాంలో దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.
ఇస్లాంలో కల్మాను షహాదా అని కూడా పిలుస్తారు. అల్లా ప్రవక్తత్వం పై విశ్వాసాన్ని ధృవీకరించే ఒక నమ్మకమైన ప్రకటన. ఇది అల్లాని నమ్ముతున్నామని చెప్పడమే. ఈ విశ్వాస ప్రకటన ఉద్దేశం ఇస్లాంలో కల్పకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముస్లింలందరికీ దాని గురించి తెలుస్తుంది. ముస్లింలు కల్మాను క్రమం తప్పకుండా పఠిస్తారు. అల్లాను ఆరాధిస్తారు. ప్రవక్త మహమ్మద్ బోధలను అనుసరిస్తారు. ముస్లిం అయిన ప్రతి వ్యక్తికి కల్మా వస్తుంది. అందుకే పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు కల్మాను చదవమని అందరినీ అడిగారు.
ఇస్లాంలో ఆరు కల్మాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి ప్రత్యేక ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి.
దీన్ని కల్మ తయ్యబ్ అని పిలుస్తారు. దీనికి అర్థం స్వచ్ఛత. దీన్ని పఠించడం ద్వారా అల్లా తప్ప వేరే దేవుడు లేడని మహమ్మద్ ఆయన దూత అని ఒప్పుకున్నట్టు ప్రకటించడమే.
"లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహు లా షారికా లాహు, లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు."
దీన్ని కల్మ షహదా అంటారు. ఇది అల్లా పై విశ్వాసానికి నిదర్శనం. ఈ కల్మాను చదివే వ్యక్తి ఇస్లాంను పూర్తిగా అంగీకరించినట్టు. అల్లా తప్ప వేరే దేవుడు లేడని సాక్ష్యం తాను ఇస్తున్నట్టు చెప్పడమే ఈ కల్మా ఉద్దేశం.
"అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహు లా షరికా లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు."
దీన్ని కల్మా తమ్జీద్ అంటారు. అల్లాను పరిపూర్ణమైన, సార్వభౌమాధికార వ్యక్తిగా ఒప్పుకోవడమే ఈ కల్మా ఉద్దేశం. అతడే గొప్పవాడనే చెబుతుంది. అల్లా దయ పట్ల లోతైన కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరుస్తుంది. అల్లా తప్ప వేరే దేవుడు లేడు. అల్లానే గొప్పవాడు. అల్లా తప్ప వేరే శక్తి , బలం ఈ ప్రపంచం లేదు అని ఈ కల్మ వివరిస్తుంది.
"సుభానల్లాహి వల్హందులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, వలా హవ్లా వలా ఖువ్వత ఇల్లా బిల్లాహి అలీయిల్ అదీమ్ "
దీన్ని కల్మ తౌహీద్ అంటారు. ఇది అల్లా ఒక్కడే దేవుడని విశ్వసిస్తున్నట్టు చెబుతుంది. అల్లా తప్ప వేరే దేవుడు లేడని అల్లా మాత్రమే ఆరాధనకు అర్హుడని చెబుతుంది. రాజ్యం మొత్తం ఆయనదేనని, సమస్త స్తుతులు ఆయనకేనని ఈ కల్మ వివరిస్తుంది. ఆయనే జీవితాన్ని ప్రసాదిస్తాడు... మరణాన్ని కలిగిస్తాడని చెబుతుంది.
"లా ఇలాహ ఇల్లాల్ లాహూ వహ్దహూ లా షేర్కలాహూ లాహుల్ ముల్కో వలాహుల్ హమ్దో యుహీ వా యుమీతో వ హోవా హై యుల్ లా యమూతో అబదన్ అబద జుల్ జలాలి వల్ ఇక్రమ్ బెయాదిహిల్ ఖైర్. వా హొవా అలా కుల్లి షైర్ ఇన్"
దీన్ని కల్మ అస్తఘ్పర్ అంటారు. ఇది పశ్చాత్తాపాన్ని సూచిస్తుంది. ఇది చేసిన పాపాలకు క్షమాపణ కోరడం, పశ్చాత్తాపంతో... అల్లా నడిచిన మార్గంలో నడవడం, తెలిసి తెలియకుండా చేసిన తప్పులను క్షమించమని సృష్టికర్త అయిన అల్లాను క్షమాపణ కోరడమే ఈ కల్మ ఉద్దేశం.
"అస్తఘ్ఫిరుల్లాహ్ రబ్బీ మిన్ కుల్లయ్ జాంబిన్ అజ్నాబ్తుహో అమాదన్ అవో ఖత్ ఆన్ సిర్రాన్ ఏవో అలనియాతన్ వా అతుబు ఇలైహీ మిన్ అజ్ జాంబిల్ లాజీ ఆలామో వా మిన్ అజ్ జాంబిల్ లాజీ లా ఆలామో ఇన్నాకా అంత అల్లాముల్ ఘూయూబీ ఉల్ వయో బిసుత్తూబి ఉల్ జునూబీ వాలా హా ఓలా వాలా ఖువ్వతా ఇల్లా బిలా హిల్ అలీయిల్ అజీమ్"
దీన్ని కల్మా రద్దే కుఫ్ర్ అంటారు. ఇది ఏకైక నిజమైన దేవుడు అల్లా మాత్రమే అని ప్రకటించే ప్రార్థన. తాను తెలియక చేసిన పాపానికి క్షమాపణ కోరడం, దాని నుండి పశ్చాత్తాపాన్ని పొందడం కూడా ఈ కల్మాలోని భాగమే. విగ్రహారాధన, అబద్ధం, అవిశ్వాసం, అపనిందలు వంటివి చేయనని చెప్పడమే ఈ కల్మా ఉద్దేశం. అశ్లీలత, అసహ్యకరమైన పనులు, విధేయత లేని పనులు చేయకుండా అల్లాకు లొంగి ఉంటానని కల్మా ద్వారా ముస్లింలు చెబుతారు.
"అల్లాహుమ్మా ఇన్నీ అవుదు బికా మిన్ అన్ ఉష్రిక బికా షై-అన్వ్- వ అన అ'లము బిహీ. వాస్ తగ్ ఫి రు క లిమా లా అలము బిహీ. తుబ్తు అన్హు వా తబర్రా-తు మిన్ అల్-కుఫ్రీ వాష్-షిర్కీ వాల్-కిజ్ధిబ్బీ వాల్-కిజ్ధీబ్తి వాల్- ఫవాహిషి వాల్-బుహ్తాని w-అల్-మఆసి కుల్లిహా వా అస్లాంతు వా అకులు లా ఇల్లాహ ఇల్లాహు ముహమ్మదుర్ రసూల్ అల్లాహ్"
ఇస్లాంలో కల్మాలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అవి విశ్వాసానికి నిదర్శన. ఈ ఆరు కల్మాలను ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ప్రతిరోజు చదువుతారు.
సంబంధిత కథనం