Child Sleeping Tips : మీ పిల్లలు బాగా నిద్రపోవడానికి టిప్స్-ten ways to help your child sleep better details inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Ten Ways To Help Your Child Sleep Better Details Inside

Child Sleeping Tips : మీ పిల్లలు బాగా నిద్రపోవడానికి టిప్స్

పిల్లలు నిద్రపోయేందుకు టిప్స్
పిల్లలు నిద్రపోయేందుకు టిప్స్

Tips For Kids Sleep : పెద్దలకు త్వరగా నిద్రపట్టదు. అయితే కొంతమంది పిల్లలు సైతం.. అలానే తొందరగా పడుకోరు. కానీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే.. సరైన నిద్ర అవసరం. కనీసం 9 గంటలు నిద్రపోవాలి.

ఈ కాలంలో పిల్లలు కూడా త్వరగా పడుకోడవం లేదు. ఇంట్లో టీవీ(TV) కావొచ్చు, లేదా అమ్మానాన్న పనులు చేసుకుంటున్నారని అలానే చూస్తుంటారు. అయితే ఇలాంటి కొన్ని కొన్ని కారణాలతో పిల్లలు నిద్రపోరు. ఇది వారికి ఆరోగ్య సమస్యలు(Health Issue) తెచ్చిపెట్టొచ్చు. సరిగా నిద్రపోయేలా చేయాలి.

ట్రెండింగ్ వార్తలు

నిద్ర పోయేందుకు లాలిపాట మ్యాజిక్ వేరు. పిల్లలు విశ్రాంతి తీసుకోవడానికి, గాఢమైన నిద్రలోకి జారుకోవడానికి ట్యూన్ వినడానికి ఇష్టపడతారు. లాలిపాటలు పిల్లలు తల్లి లేదా తండ్రి(Parents Tips) మధ్య బంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. పిల్లల వికాసాన్ని కూడా పెంచుతాయి.

సాహసోపేతమైన కథలు ఎల్లప్పుడూ చిన్న పిల్లలను ఉత్తేజపరుస్తాయి. పిల్లలకు కథలు(Stories) చెప్పండి. పిల్లల అభ్యాసాన్ని మెరుగుపరచడానికి, ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడుతాయి. వారికి భాషపై ఎక్కువ పట్టు సాధించడంలో సహాయపడుతుంది. అదే కథలో చిన్న వైవిధ్యాలను చేర్చడానికి ప్రయత్నించండి.

ఆటలు(Games) ఎల్లప్పుడూ శారీరక శ్రమతో కూడినవిగా ఉండవలసిన అవసరం లేదు. మీ పిల్లలు విశ్రాంతి తీసుకోవడానికి, తల్లిదండ్రుల, పిల్లల సంబంధాన్ని మెరుగుపరచడంలో సహాయపడే అనేక ఇతర గేమ్‌లు ఉన్నాయి. ఇంట్లోనే ఆడుకునే చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి. వాటిని పిల్లలకు పరిచయం చేయండి. ఒక రైమ్‌ని పఠించమని అడగండి. ఈ చర్యలు మెదడు కణాలను ప్రేరేపిస్తాయి. మీ బిడ్డ అలసిపోతుంది. మరింత ప్రశాంతమైన నిద్రను పోతారు.

మీరే మంచి కథకులు కాదని మీరు అనుకుంటే, పిల్లలకు నిద్రపోవడానికి సహాయపడే అనేక రకాల ఆడియో పుస్తకాలు(Audio Books) మార్కెట్‌లో ఉన్నాయి. మీ పిల్లల మనసు కలలు కనే, ఊహాత్మక ప్రపంచానికి తీసుకెళ్లే కథలు దొరుకుతాయి. సంగీతం, కథలు కలిపే ఉంటాయి.

మీ పిల్లలను మెమరీ లేన్‌లోకి తీసుకెళ్లండి. వారు చిన్నగా ఉన్నప్పుడు వారి చిత్రాలను వారికి చూపించండి. వారికి మొత్తం కుటుంబాన్ని వివరించండి. చిత్రాలలో వ్యక్తులను గుర్తించమని అడగండి. మీ బిడ్డ విశ్రాంతి తీసుకోవడానికి ఇది మంచి చర్య.

నిద్రవేళకు ముందు తోట చుట్టూ నడవడం మెలటోనిన్ వంటి నిద్ర(Sleeping) హార్మోన్ల ప్రభావాన్ని పెంచడానికి మంచి మార్గం. ఇది మీ బిడ్డకు వెంటనే మంచి నిద్రను ఇస్తుంది. ఇది మీకు రిఫ్రెష్ అవుట్‌లెట్ కూడా కావచ్చు.

మీ పిల్లవాడు బాగా ఉంటే.. నిద్రకు ముందు మంచి ట్రీట్ ఇస్తామని చెప్పండి. మీరు వారికి ఒక రుచికరమైన ట్రీట్‌ ఇవ్వండి. అధిక చక్కెర, కెఫిన్, జంక్ ఫుడ్‌లను నివారించండి. ఎందుకంటే ఇవి మీ పిల్లల ప్రశాంతమైన నిద్రకు భంగం కలిగిస్తాయి మరియు నిద్ర రుగ్మతలను తీవ్రతరం చేస్తాయి.

నిద్రవేళ స్క్రాప్‌బుక్‌లో గీయడం లేదా రాయడం ద్వారా రోజువారీ కార్యకలాపాలకు సంబంధించినవి గుర్తు ఉండేలా చేస్తాయి. వారికి కూడా ఓ ఇంట్రస్ట్ ఉంటుంది. ఈరోజు నువ్ ఏం చేశావో బొమ్మల రూపంలో వేయి అని చెప్పండి. మనసులో ఉన్న చింతలను తొలగిస్తుంది. బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

పడుకునే ముందు మీ బిడ్డకు వెచ్చని స్నానం(Bath) చేయించండి. మీ పిల్లల మనసు, శరీరం విశ్రాంతి తీసుకునేందుకు ఇది మంచి మార్గం. స్నానంలో ఎప్సమ్ లవణాలు, లావెండర్ ఆయిల్ ఉపయోగించండి.

వీలైతే.. ధ్యానం నేర్పించండి. ధ్యానం సరైన మార్గంలో చేస్తే మీ బిడ్డ విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ బిడ్డను కళ్ళు(Eyes) మూసుకునేలా చేయండి. లోతైన శ్వాస తీసుకోమని చెప్పండి. అందమైన, ప్రశాంతమైన దృశ్యాలను ఊహించుకోమని చెప్పండి. రోజువారీ సాధన చేయించండి.

మీ పిల్లలకు కచ్చితమైన నిద్రవేళను సెట్ చేయడం చాలా అవసరం. మీ పిల్లలు నిద్రపోయే సమయానికి గంట ముందు టీవీని ఆఫ్ చేసి, కంఫర్ట్ మోడ్‌లోకి తీసుకెళ్లండి. నిద్రించడానికి హాయిగా ఉండే బట్టలు వేయాలి. లేదంటే చికాకుతో నిద్రరాదు. కాంతిని తగ్గించి, పరిసరాల్లో తక్కువ శబ్దం ఉండేలా చూసుకోవాలి.