Personality Test: ఇక్కడిచ్చిన మూడు కోతులలో మీకు ఏది నచ్చిందో చెప్పండి, మీరు ఎలాంటి వారో తెలిసిపోతుంది
Personality Test: మూడు కోతుల గురించి అందరికీ తెలిసిందే. ఆ మూడు కోతుల్లో మీకు ఇష్టమైన కోతి ఏదో చెబితే.. మీరు ఎలాంటి వారో, మీ వ్యక్తిత్వం ఎలాంటిదో అంచనా వేయవచ్చు.

Personality Test: మనలో చాలామందికి ఎదుటివారు ఎలాంటివారో తెలుసుకోవాలన్న కోరిక ఉంటుంది. అలాగే మన గురించి మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి తెలుసుకొనేందుకు వ్యక్తిత్వ పరీక్షలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వ్యక్తిత్వ పరీక్షల్లో ఇది ఒకటి. ఈ వ్యక్తిత్వ పరీక్షల్లో భాగంగా ఎన్నో అంశాలను తెలుసుకోవచ్చు. ఎదుటివారి భావోద్వేగాలను, వారి మనస్తత్వాన్ని అంచనా వేయొచ్చు. ఇక్కడ మేము మూడు కోతుల ఛాలెంజ్ ను ఇచ్చాము. ఇక్కడ ఉన్న మూడు కోతుల్లో మీకు ఏది ఇష్టమో చెప్పండి... దాన్ని బట్టి మీరు ఎలాంటి వారో అంచనా వేయొచ్చు. మూడు కోతుల చిత్రం ఈనాటిది కాదు. ఈ మూడు కోతులను చెడు వినద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు అని చెప్పడానికి వినియోగిస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం మనం మీరు ఎలాంటి వారో తెలుసుకునేందుకు, వ్యక్తిత్వ పరీక్ష పెట్టేందుకు వినియోగిస్తున్నాము.
మొదటి కోతి
ఈ కోతుల బొమ్మల్లో మొదటి కోతి చెవులను మూసుకుని కనిపిస్తుంది. మీకు ఈ మొదటి కోతి నచ్చితే మీరు స్నేహశీలలు అని అర్థం. అలాగే బహిర్ముఖులు. అంటే మనసులో ఏదీ ఉంచుకోరు. అన్ని విషయాలు బయటికి చెప్పేస్తారు. అలాగే విలువలకు కొన్ని నియమాలకు కట్టుబడి ఉంటారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను అర్థం చేసుకోవడంలో ముందుంటారు. మీరు మీ బంధాలు, స్నేహంలో సిన్సియర్ గా ఉంటారు.
రెండో కోతి
కళ్ళను మూసుకొని కనిపిస్తున్నది రెండో కోతి. ఈ కోతి మీకు నచ్చితే మీరు వ్యక్తిగతంగా స్వయం సమృద్ధి కల వారని అర్థం. అలాగే ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. అలా ఒంటరిగా ఉన్నప్పుడే మీరు ఓదార్పును పొందుతారు. మీరు దూరం నుండి వ్యక్తులను ప్రేమించడానికి ఇష్టపడతారు. మీరు మంచి ఫ్రెండ్ కాగల లక్షణాలు ఉన్నవారు.
మూడో కోతి
నోటికి చేతులు అడ్డంగా పెట్టుకుని ఉన్న ఈ మూడో కోతి మీకు నచ్చినట్లయితే మీరు చాలా సున్నిత మనస్సులని అర్థం. అలాగే ఎదుటివారి పట్ల సానుభూతి చూపిస్తారు. మీ హృదయం నిజమైనది. బంధాలలో, స్నేహాలలో మీరు ఎల్లప్పుడూ సహాయం చేసేందుకు ముందుంటారు. ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తారు. ప్రజలు కూడా మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడతారు. ఎన్నో విషయాల్లో మిమ్మల్ని అభినందిస్తూ ఉంటారు.
టాపిక్