Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో మీకు ఏం కనిపిస్తుందో చెప్పండి, దాన్ని బట్టి మిమ్మల్ని నమ్మవచ్చో లేదో చెప్పవచ్చు-tell us what you see in this optical illusion and well tell you whether you can believe it or not ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Tell Us What You See In This Optical Illusion And We'll Tell You Whether You Can Believe It Or Not

Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో మీకు ఏం కనిపిస్తుందో చెప్పండి, దాన్ని బట్టి మిమ్మల్ని నమ్మవచ్చో లేదో చెప్పవచ్చు

Haritha Chappa HT Telugu
Mar 15, 2024 07:00 AM IST

Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లు వినోదాన్ని పంచడమే కాదు, వ్యక్తిత్వ పరీక్షలను కూడా నిర్వహిస్తాయి. ఇక్కడ అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ ఇచ్చాము. ఇది మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెబుతుంది.

ఆప్టికల్ ఇల్యూషన్
ఆప్టికల్ ఇల్యూషన్

Optical Illusion: ఆప్టికల్ ఇల్యుషన్లు మీ మెదడుకు మాత్రమే కాదు, మీ వ్యక్తిత్వానికి కూడా పరీక్ష పెడతాయి. కొన్ని రకాల ఆప్టికల్ ఇల్యూషన్ల ద్వారా ఎదుటివారు ఎలాంటి వ్యక్తి, ఎలాంటి అభిప్రాయాలను కలిగి ఉంటారో అంచనా వేసి చెప్పవచ్చు. దీన్నే పర్సనాలిటీ టెస్ట్ అని అంటారు. అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ ఇక్కడ ఇచ్చాము. దీంట్లో మీకు మొదట ఏం కనిపిస్తుందో చెబితే, దాన్నిబట్టి మీరు ఎలాంటి వారో... మిమ్మల్ని నమ్మవచ్చో లేదో చెప్పవచ్చు.

ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో రెండు బొమ్మలు కలిసి ఉన్నాయి. ఒకటి పెంగ్విన్, రెండోది ఒక మనిషి ముఖం. పెంగ్విన్ కనిపిస్తే ఒక రకమైన వ్యక్తిత్వాన్ని, మనిషి ముఖం మొదటగా కనిపిస్తే మరొక రకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మీకు ఈ బొమ్మను చూడగానే మొదట మీ మెదడు పెంగ్విన్స్‌ను గుర్తించిందో లేక మనిషి ముఖాన్ని మీ మెదడు గుర్తుపట్టిందో చెప్పండి. దాన్నిబట్టి మీరు ఎలాంటి వ్యక్తులో అంచనా వేయొచ్చు.

పెంగ్విన్ కనిపిస్తే

ఆప్టికల్ ఇల్యూషన్లో మీరు మొదట పెంగ్విన్ చూసినట్లయితే మీకు భావోద్వేగాలు చాలా ఎక్కువ. అయితే మీ అనుభవాలు మిమ్మల్ని చాలా తెలివైన వ్యక్తిగా మారుస్తాయి . ఎంతగా వేచి ఉంటే అంతగా మీకు మంచి ఫలితాలు వస్తాయని నమ్మే వ్యక్తి. మీరు మాత్రం అందరిని అంత సులువుగా నమ్మరు. అయితే మిమ్మల్ని మాత్రం ఇతరులు నమ్మవచ్చు. మీకు మోసం చేసే ఉద్దేశం తక్కువగా ఉంటుంది. అలాగని పూర్తిగా మోసం చేయరు అని మాత్రం చెప్పడం లేదు.

మనిషి ముఖం కనిపిస్తే

ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో మీకు మొదటగా మనిషి ముఖం కనిపిస్తే మీకు చాలా మంది స్నేహితులు ఉంటారని అర్థం. అలాగే సామాజిక జీవితానికి మీరు ఎక్కువ విలువ ఇస్తారు. మీరు మీ అభిప్రాయాలతో పాటూ మీ చుట్టూ ఉన్నవారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటారు. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఒక శాంతి దూతలా చూస్తారు. అయితే ఏ కథైనా క్లైమాక్స్ కు వస్తే మాత్రం మీరు చాలా కఠినంగా వ్యవహరిస్తారు. మీరు ఇతరులను మోసం చేయడానికి ఇష్టపడరు. మిమ్మల్ని ఇతరులు విశ్వసించడానికి ఎక్కువ ఆస్కారం ఉంది.

ఆప్టికల్ ఇల్యూషన్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కొన్ని వినోదాన్ని పంచుతూ ఉంటే మరికొన్ని ఇలా పర్సనాలిటీ టెస్టులకు పనికొస్తాయి. ఏదేమైనా ఆప్టికల్ ఇల్యూషన్లు మనిషికి టైం పాస్‌గా మారాయి. మీకు ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు అంటే ఇష్టమా? అయితే కొన్ని ఇన్ స్టాగ్రామ్ పేజీలు వీటికి కేటాయించారు. వాటిలోకి వెళ్లి రోజుకి రెండు మూడింటిని చూస్తూ ఉండండి.

WhatsApp channel

టాపిక్