Tawa Pulao: తవా పులావ్ రెసిపీ ఇలా చేస్తే వేడి వేడిగా డిన్నర్లో అదిరిపోతుంది-tawa pulao recipe in telugu know how to make this rice recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tawa Pulao: తవా పులావ్ రెసిపీ ఇలా చేస్తే వేడి వేడిగా డిన్నర్లో అదిరిపోతుంది

Tawa Pulao: తవా పులావ్ రెసిపీ ఇలా చేస్తే వేడి వేడిగా డిన్నర్లో అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Jun 28, 2024 05:57 PM IST

Tawa Pulao: పులావ్ అంటే ఇష్టపడేవారి సంఖ్య ఎక్కువే. ఒకసారి తవా పులావ్ వండుకుని చూడండి. డిన్నర్లో వేడి వేడిగా తినేందుకు బావుంటుంది.

తవా పులావ్ రెసిపీ
తవా పులావ్ రెసిపీ

Tawa Pulao: పులావ్ టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువే. మటర్ పులావ్, వెజిటబుల్ పులావ్, కీమా పులావ్ వంటివి ఎక్కువగా చేస్తారు. ఒకసారి అలాగే తవా పులావ్ కూడా వండుకుని చూడండి. ఇందులో క్యారెట్లు, క్యాప్సికమ్, టమోటాలు, బంగాళాదుంపలు వంటివి వేస్తాము కాబట్టి... రుచిగా ఉంటాయి. తవా పులావ్ ఎలా చేయాలో తెలుసుకోండి.

తవా పులావ్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

ఉడికించిన అన్నం - రెండు కప్పులు

పచ్చి బఠానీలు - అర కప్పు

క్యారెట్ - రెండు

క్యాప్సికమ్ - ఒకటి

ఉప్పు - రుచికి సరిపడా

పసులు - అర స్పూను

టమోటా - రెండు

ఉల్లిపాయ - ఒకటి

కారం - ఒక స్పూను

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు

బటర్ - ఒక స్పూను

బంగాళాదుంప - ఒకటి

నిమ్మరసం - ఒక స్పూను

జీలకర్ర - ఒక స్ూను

ఉప్పు - రుచికి సరిపడా

పావ్ భాజీ మసాలా - మూడు స్పూన్లు

తవా పులావ్ రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక జీలకర్ర వేసి చిటపటలాడించాలి.

2. తరిగిన ఉల్లిపాయలు వేసి రంగు మారేవరకు వేయించాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.

3. టోమాటో ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. అలాగే చిన్నగా కోసిన బంగాళాదుంపలను వేసి కలుపుకోవాలి. అవి ఉడికే వరకు చిన్నమంట మీదే ఉడికించాలి.

4. క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిబఠానీలను వేసి ఉడికించాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని చిన్న మంట మీద ఉడికించాలి.

5. పావ్ భాజీ మసాలా, పసుపు, కారం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి.

6. కాస్త నీరు వేసి బాగా ఉడకనివ్వాలి.

7. అందులో ముందుగా వండిన అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి.

8. కొత్తిమీర తరుగును చల్లుకుని సర్వ్ చేయాలి. టేస్టీ తవా పులావ్ రెడీ అయినట్టే.

పులావ్ పేరు చెబితేనే నోరూరిపోతుంది. పైన మేము చెప్పినట్టు తవా పులావ్ వండుకుని చూడండి మీకు నచ్చడం ఖాయం. ముఖ్యంగా దీన్ని రాత్రి పూట డిన్నర్ లా లేదా లంచ్ బాక్స్ రెసిపీగా ఉపయోగించుకోవచ్చు. ఒకసారి దీన్ని వండి చూడండి మీకు నచ్చడం ఖాయం. బయట ఫాస్ట్ ఫుడ్ కొనుక్కుని తినడానికి బదులుగా ఈ రైస్ ను స్పైసీగా ఇంట్లోనే చేసుకుంటే మంచిది.

WhatsApp channel

టాపిక్