Tata Nexon XZ+ (L) । మరిన్ని ఫీచర్లతో సరికొత్తగా వచ్చేసిన టాటా నెక్సాన్ కార్!
టాటా మోటార్స్ తమ నెక్సాన్ కారుకు మరిన్ని అప్‌డేట్లు చేసి సరికొత్తగా Tata Nexon XZ+ (L) వేరియంట్ ను విడుదల చేసింది. దీని ధర, ఇతర వివరాలు ఇక్కడ చూడండి.
టాటా మోటార్స్ ఇండియా Tata Nexon XZ+ (L) బ్రాండ్ నుంచి పాపులర్ SUV అయిన టాటా నెక్సాన్ కారులో సరికొత్త XZ+ (L) వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ XZ+ (L) ట్రిమ్ అనేది టాప్-ఎండ్ మోడల్ అయిన XZ+ పైన ఉంటుంది. ఈ కొత్త వేరియంట్ కార్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లలో ఎంచుకోవచ్చు. అలాగే పెట్రోల్ ఇంకా డీజిల్ ఇంజిన్‌లతో నడిచే రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది.
ట్రెండింగ్ వార్తలు
Nexon XZ+ (L) వేరియంట్‌లో Tata ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ ఛార్జింగ్ సిస్టమ్, ఆటో-డిమ్మింగ్ IRVM, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు లెథెరెట్ అప్హోల్స్టరీ వంటి అనేక కొత్త ఫీచర్లు అందిస్తున్నారు. ఇవే కాకుండా ఈ XZ+ (L) అనేది టాప్- ఎండ్ మోడల్ ఆధారంగా వచ్చిన వేరియంట్ కాబట్టి, ఇందులో కూడా టాప్- ఎండ్ Nexon కారులో లభించినట్లుగా అన్ని ఫీచర్లు, స్పెక్స్ ఉంటాయి. ఇంటీరియర్ లో ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, వెనకవైపు ఏసి వెంట్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి.
Tata Nexon XZ+ (L) కార్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 11.38 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇంకా ఈ కొత్త వేరియంట్ కారులో అదనంగా ఏమైనా అప్‌డేట్లు వచ్చాయా? ఇంజన్ కెపాసిటీ ఎలా ఉంది? మొదలైన విషయాలు ఇప్పుడు చూద్దాం.
Tata Nexon XZ+ (L) SUVలో ఇంజన్, ఇతర స్పెసిఫికేషన్లు
యాంత్రికంగా టాటా నెక్సాన్ XZ+ (L) వేరియంట్‌లో ఎలాంటి మార్పులు లేవు. పాత వేరియంట్‌లలో ఉన్నట్లుగానే ఈ కారులో కూడా పెట్రోల్ వెర్షన్‌లో 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 118bhp శక్తిని, 170Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక డీజిల్ వెర్షన్‌లో 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ 108bhp శక్తిని, 260Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా AMT ఆప్షన్లో పొందవచ్చు.
ఇదిలా ఉంటే, టాటా మోటార్స్ తమ మైక్రో SUV అయినTata Punchలో సరికొత్త Camo ఎడిషన్‌ను సెప్టెంబర్ 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
సంబంధిత కథనం