Potato Uttappam । ఆలుగడ్డ ఊతప్పం, ఇది రెగ్యులర్ రెసిపీకి విభిన్నం, మరెంతో రుచికరం!-tasty potato uttappam to start your day with check recipe in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Potato Uttappam । ఆలుగడ్డ ఊతప్పం, ఇది రెగ్యులర్ రెసిపీకి విభిన్నం, మరెంతో రుచికరం!

Potato Uttappam । ఆలుగడ్డ ఊతప్పం, ఇది రెగ్యులర్ రెసిపీకి విభిన్నం, మరెంతో రుచికరం!

HT Telugu Desk HT Telugu

Potato Uttappam Recipe: ఆలుగడ్డ ఊతప్పం రెగ్యులర్ రెసిపీకి విభిన్నమైనది. ఒకసారి ఆలుగడ్డ ఊతప్పం తినిచూడండి, దీని రుచి అదిరిపోతుంది.

Potato Uttappam Recipe (freepik)

Quick Breakfast Recipes: బ్రేక్‌ఫాస్ట్‌లో బంగాళాదుంప మసాలాతో చేసే మసాలా దోశను మీరు చాలా సార్లు తిని ఉంటారు. అలాగే ఊతప్పంను కూడా ఎక్కువ సార్లే తిని ఉంటారు. ఒకసారి ఆలుగడ్డ ఊతప్పం తినిచూడండి, దీని రుచి అదిరిపోతుంది. సాధారణంగా మనం ఊతప్పం తయారీలో ఎక్కువగా ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, క్యాప్సికమ్ వంటివి వేసుకుంటాము, బియ్యం పిండితో చేస్తాము. ఆలుగడ్డ ఊతప్పం రెగ్యులర్ రెసిపీకి విభిన్నమైనది. దీని తయారీలో ఉల్లిపాయలు, బంగాళాదుంపలు మాత్రమే ఉపయోగిస్తారు.

బంగాళదుంపలతో చేసే ఎలాంటి రెసిపీ అయినా రుచిగా ఉంటుంది. మీరు బంగాళాదుంపలు కాల్చి తినొచ్చు, వేయించి తినొచ్చు, ఉడకబెట్టి తినొచ్చు, ఎలా తిన్నా కూడా టేస్టీగానే ఉంటుంది. అటువంటి టేస్టీ ఆలుగడ్డ ఊతప్పం రెసిపీని ఈ కింద తెలుసుకోండి. దీనిని చేయడం కూడా చాలా సులభం, తక్కువ సమయంలోనే ఇన్‌స్టంట్‌గా ఎలా చేయవచ్చో ఈ కింద సూచనలు చదవండి.

Potato Uttappam Recipe కోసం కావలసినవి

  • ఉడికించిన బంగాళదుంపలు 3
  • ఉల్లిపాయలు 2
  • పచ్చిమిర్చి 4
  • శనగపిండి 1 కప్పు
  • రవ్వ 1/4 కప్పు
  • జీలకర్ర 1/2 టీస్పూన్
  • కారం పొడి 1 టీస్పూన్
  • తాజా కొత్తిమీర 1 టేబుల్ స్పూన్
  • పెరుగు 1 కప్పు
  • రుచికి తగినంత ఉప్పు
  • అవసరమైనంత నూనె

ఆలుగడ్డ ఊతప్పం తయారీ విధానం

  1. ముందుగా ఒక గిన్నెలో బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయలు ముక్కలు, పచ్చిమిర్చి, శనగపిండి, రవ్వ, జీలకర్ర, కారం, కొత్తిమీర తరుగు, ఉప్పు, పెరుగు, తగినంత నీరు వేసి, కావలసిన స్థిరత్వం వచ్చే వరకు పిండి బ్యాటర్ తయారు చేయండి. పది నిముషాలు అలాగే ఉండనివ్వండి.
  2. ఇప్పుడు నాన్ స్టిక్ తవాను వేడి చేయండి. కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక సగం గరిటెల పిండిని పోయండి.
  3. మూడు అంగుళాల మందంతో గుండ్రంగా ఊతప్పం తయారు చేయండి. రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు కాల్చండి.

అంతే, ఆలుగడ్డ ఊతప్పం రెడీ. గ్రీన్ చట్నీతో వేడిగా వడ్డించండి.

సంబంధిత కథనం