Pesarattu Recipe । రుచికరమైన పెసరట్టు.. ఇది ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్!
Pesarattu Recipe: పెసరట్టు ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన గ్లూటెన్-ఫ్రీ వంటకం. పెసరట్టు రెసిపీని ఈ కింద చూడండి.
Pesarattu Recipe (istock)
Healthy Breakfast Recipes: పెసరట్టు అనేది ఆకుపచ్చని పెసర్లు, కొన్ని సుగంధ ద్రవ్యాలు కలిపి చేసే ఒక దోశలాంటి అల్పాహారం. మీరు ఉదయాన్నే దోశ తినడం కంటే పెసరట్టు తినడం మరెంతో ఆరోగ్యకరం. పెసర్లలో పోషకాలు దండిగా ఉంటాయి. ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. జీర్ణ ఆరోగ్యానికి సహాయపడతాయి, బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. రక్తపోటును నివారిస్తాయి. ప్రోటీన్లు కూడా అందుతాయి.
అందుకే పెసరట్టు ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన గ్లూటెన్-ఫ్రీ వంటకం. పెసరట్టు రెసిపీని ఈ కింద చూడండి.
Pesarattu Recipe కోసం కావలసినవి
- 1/2 కప్పు పెసర్లు
- 2 టేబుల్ స్పూన్లు బియ్యం
- 1/2 కప్పు నీరు
- 1 టీస్పూన్ తరిగిన అల్లం
- 1 పచ్చిమిర్చి
- 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర
- 1 చిటికెడు ఇంగువ
- 1/2 టీస్పూన్ జీలకర్ర
- ఉప్పు రుచి కోసం
- నూనె లేదా నెయ్యి, అవసరం మేరకు
పెసరట్టు తయారీ విధానం
- ముందుగా, పెసర్లు, బియ్యాన్ని శుభ్రంగా కడిగి 4 నుండి 6 గంటలు నీటిలో నానబెట్టండి.
- ఆ తర్వాత నీటిని వడకట్టి నానబెట్టిన పెసర్లు, బియ్యంను గ్రైండర్‌లో వేయండి.
- అందులోనే అల్లం, పచ్చిమిర్చి, ఇంగువ, జీలకర్ర, కొత్తిమీర ఆకులు ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పిండిగా రుబ్బుకోవాలి. ఇది దోశ పిండిని పోలి ఉండాలి.
- ఇప్పుడు ఒక ఫ్లాట్ పాన్ మీద నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయండి, వేడయ్యాక గరిటతో పెసరట్టు పిండిని పోసి గుండ్రంగా విస్తరించండి. చుట్టూ కొద్దిగా నూనె చిలకరించండి.
- ఆపైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేయాలి. అట్టు గోధుమ రంగులోకి వరకు రెండు వైపులా కాల్చండి.
అంతే, పెసరట్టు రెడీ. దీనిని ఉప్మా లేదా కొబ్బరి చట్నీ లేదా అల్లం పచ్చడితో వడ్డిస్తారు.
సంబంధిత కథనం