tasty drinks for BP: బీపీ తగ్గించే రుచికరమైన డ్రింక్స్ ఇవే..
tasty drinks for BP: రక్తపోటు తగ్గించే పానీయాలు, వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని బీపీ సమస్య వెంటాడుతోంది. జీవన శైలి సరిగ్గా లేకపోవడం, ఒత్తిడి కలిసి డయాబెటిస్, గుండె వ్యాధులు, బీపీ కి కారణం అవుతాయి. ఎక్కువగా తినడం, తక్కువగా కదలడం, అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం, తీపి పదార్థాలు తీసుకోవడం ఈ వ్యాధులకు కారకాలు. ఇంట్లో వండుకోడానికి సమయం లేక బయట తిండికి అలవాటు పడటం ఇంకో కారణం. అందుకే రోజూ తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆహారంలో మార్పులు చేసుకోవాలి.
ట్రెండింగ్ వార్తలు
కొన్ని పరిశోధనల ప్రకారం DASH (Dietary Approaches to Stop Hypertension) బీపీ తగ్గించడానికి సాయం చేస్తుందని తేలింది. అంటే పోషకాలున్న ఆహారం ద్వారా బీపీ తగ్గించుకునే మార్గం. ఇదే ఉత్తమమైన పద్ధతి. పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వుండే పాల ఉత్పత్తులు, కొవ్వు తక్కువుండే ఆహారం, సోడియం తీసుకోవడం తగ్గించడం, ఆల్కహాల్ మానేయడం మంచి మార్గాలు. మెగ్నీషియం, క్యాల్షియం, పోటాషియం బీపీ తగ్గించడంలో తోడ్పడతాయి.
బీపీ తగ్గించే రుచికరమైన పానీయాలేంటో చూడండి:
బనానా మిల్క్ షేక్:
అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటు తగ్గిస్తుంది. కొవ్వు తక్కువగా ఉండే స్కిమ్డ్ పాలను బనానా షేక్ చేయడానికి వాడండి. పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం కావాల్సినంత అందుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది.
మజ్జిగ:
చలువ చేసే ఈ పానీయం ప్రతిరోజూ తీసుకోదగ్గది. దీంట్లో క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గించడంలో సాయపడుతుంది. బీపీ తగ్గిస్తుంది. తక్కువ కొవ్వుండే పాల ఉత్పత్తులన్నీ DASH డైట్ కిందికి వస్తాయి.
దానిమ్మ, బీట్ రూట్ రసం:
దానిమ్మలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. దీంట్లో ఉండే ఒక ఎంజైమ్ రక్త నాళాల పరిమాణం నియంత్రణలో ఉంచడానికి సాయపడుతుంది. బీట్ రూట్ లో ఉండే నైట్రేట్ (NO3), బీపీ తగ్గడానికి వాసోడైలేషన్ (రక్తనాళాల వ్యాకోచం) ప్రక్రియలో తోడ్పడుతుంది.
కొబ్బరినీళ్లు:
దీంట్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటు తగ్గిస్తుంది. దీంట్లో ఉండే సహజ ఎలక్ట్రోలైట్లు మన శరీరంలో ఉన్న అధికంగా ఉన్న సోడియం బయటికి పంపించడంలో సాయపడతాయి. ఇది రక్తపోటు అదుపులో ఉండటానికి ముఖ్యమైన ప్రక్రియ. దీంట్లో ఉండే పోటాషియం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా రావు.
సంబంధిత కథనం
టాపిక్