Ugadi 2022 | షడ్రుచుల ఉగాది రోజున ఈ కొత్త రుచిని ఆస్వాదించండి!
ఉగాది అంటేనే రుచుల పండగ. ఉగాది రోజున దాదాపు అందరి ఇళ్లలో పులిహోర చేసుకుంటారు. మీ నోటికి సరికొత్త రుచి తగిలేలా ఇక్కడ పచ్చి కొబ్బరి అన్నం రెసిపీ న్యూట్రిషనిస్ట్ ప్రీతిక అందించారు.
హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం మొదటి రోజున జరుపుకునే పండగ ఉగాది. ఇది తెలుగు వారికి తొలిపండగ. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక ప్రజలకు ఉగాది.. కొత్త సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇదే రోజును ఉత్తర భారతదేశంలో చైత్ర నవరాత్రుల మొదటి రోజుగా, మహారాష్ట్రలో గుడి పడ్వా, మరాఠీ నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. అలాగే తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు.
ట్రెండింగ్ వార్తలు
ఈ ఉగాది కొత్త ఉత్సాహాన్ని నింపే పండగ. జీవితంలో కొత్త ఆకాంక్షలను మోసుకొచ్చే పండగ. అందుకే ఈ ఉగాది పర్వదినాన జీవిత సారాన్ని తెలిపే ఆరు రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని సేవిస్తారు.
మరి ఉగాది అంటేనే రుచుల పండగ. ఉగాది రోజున దాదాపు అందరి ఇళ్లలో పులిహోర చేసుకుంటారు. మీ నోటికి సరికొత్త రుచి తగిలేలా ఇక్కడ పచ్చి కొబ్బరి అన్నం రెసిపీ న్యూట్రిషనిస్ట్ ప్రీతిక అందించారు. దానికి కావాల్సిన పదార్థాలు, ఎలా తయారు చేసుకోవాలో పేర్కొన్నారు.
లేత కొబ్బరి అన్నం
• ½ కప్ ఉడికించిన అన్నం
• ½ కప్పు తురిమిన పచ్చి కొబ్బరి
• 2-3 టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె
• ½ tsp ఆవాలు
• ½ tsp జీలకర్ర గింజలు
• ½ స్పూన్ మినప పప్పు
• ½ టేబుల్ స్పూన్ శనగ పప్పు
• 1 టేబుల్ స్పూన్ తురిమిన జీడిపప్పు
• ½ పచ్చిమిర్చి తరిగినది
• 1 tsp అల్లం తరిగిన
• ¼ టీస్పూన్ ఇంగువ
• 5 నుండి 6 కరివేపాకు
• ¼ కప్ కొత్తిమీర తరిగిన ఆకులు
• రుచికి తగినంత ఉప్పు
తయారీ విధానం
• మీడియం మంట మీద ఒక గంజులో నూనె వేడి చేయండి. అందులో ఆవాలు వేయండి. అవి చిట్ పట్ అన్న తర్వాత, జీలకర్ర, మినపపప్పు, శనగ పప్పు వేసేయండి.
• పైన పప్పులు లేత బంగారు రంగులోకి మారినప్పుడు, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఎర్ర మిరపకాయ, అల్లం, ఇంగువ, కరివేపాకు వేసి, కొన్ని సెకన్ల పాటు వేయించాలి.
• ఇప్పుడు కొబ్బరి వేసి లేత బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి.
• గంజులో ఉడకబెట్టిన అన్నం వేసి, రుచికి అనుగుణంగా కొంచెం ఉప్పు చల్లి, బాగా కలపండి.
• అలంకరణ కోసం కొంచెం తరిగిన కొత్తిమీర వేయండి.
కొబ్బరి అన్నం ఇప్పుడు సిద్ధం అయింది, వేడి వేడిగా తినేయండి.
సంబంధిత కథనం