Lemon Ginger Rasam Recipe। రుచికరమైన నిమ్మకాయ అల్లం రసం.. మాన్‌సూన్‌లో ఇది గొప్ప ఉపశమనం!-tangy and spicy lemon ginger rasam a perfect soup recipe for monsoon rainy season ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lemon Ginger Rasam Recipe। రుచికరమైన నిమ్మకాయ అల్లం రసం.. మాన్‌సూన్‌లో ఇది గొప్ప ఉపశమనం!

Lemon Ginger Rasam Recipe। రుచికరమైన నిమ్మకాయ అల్లం రసం.. మాన్‌సూన్‌లో ఇది గొప్ప ఉపశమనం!

HT Telugu Desk HT Telugu

Lemon Ginger Rasam Recipe: నిమ్మకాయ అల్లం రసం అనేది వర్షాకాలానికి ప్రత్యేకమైన వంటకం. ఎలా చేయాలో ఈ కింద సూచనలను చదవండి.

Lemon Ginger Rasam Recipe (istock)

Monsoon Recipes: సాంప్రదాయ తెలుగు భోజనంలో రసం కచ్చితంగా ఉంటుంది. ఈ రసాన్ని మనం సాధారణంగా పప్పు, మిరియాలు, చింతపండు నీళ్లు కలిపి పలుచటి సూప్ లాగా చేసుకుంటాం. అయితే ఇప్పుడు ఉన్నది వర్షాకాలం, ఈ సీజన్ లో మనం వేడివేడిగా అల్లం టీని టీని ఆస్వాదించడం మనందరికీ ఇష్టం, మరి ఇదే తరహాలో అల్లం రసం ఎందుకు ప్రయత్నించకూడదు? మీకోసం ఇక్కడ రుచికరమైన నిమ్మకాయ అల్లం రసం రెసిపీని అందిస్తున్నాం.

నిమ్మకాయ అల్లం రసం అనేది వర్షాకాలానికి ప్రత్యేకమైన వంటకం. ఇది ఈ సీజన్ లో తలెత్తే సాధారణ దగ్గు, జలుబు లేదా ఫ్లూలకి ఒక సాంప్రదాయ ఔషధంలా కూడా పనిచేస్తుంది. ఈ రసంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణ వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అటువంటి గుణాలు కలిగిన, రుచికరమైన నిమ్మకాయ అల్లం రసం ఎలా చేయాలో ఈ కింద సూచనలను చదవండి.

Lemon Ginger Rasam Recipe కోసం కావలసినవి

  • ¼ కప్పు కంది పప్పు
  • 2 టమోటాలు
  • 4-5 పచ్చి మిరపకాయలు
  • 1 అంగుళం అల్లం
  • 1 పెద్ద నిమ్మకాయ
  • ¼ టీస్పూన్ పసుపు పొడి
  • 3 కప్పుల నీరు
  • 1 టేబుల్ స్పూన్ నెయ్యి
  • 1 స్పూన్ ఆవాలు
  • 1 రెమ్మ కరివేపాకు
  • 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర
  • రుచికి తగినంత ఉప్పు

నిమ్మకాయ అల్లం రసం తయారీ విధానం

  1. ముందుగా పప్పును ఒక పాత్రలో శుభ్రంగా కడిగి పెట్టుకోండి, ఉల్లిపాయలను, కూరగాయ ముక్కలను కట్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోండి. అల్లంను మెత్తగా దంచి పక్కన పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ లో పప్పును తీసుకోండి, అందులో చిటికెడు పసుపు, 1 కప్పు నీరు పోసి, మూతపెట్టి ఆవిరి మీద 4-5 విజిల్స్ వరకు లేదా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
  3. ఉడికిన పప్పును గరిట వెనుక భాగంతో నొక్కుతూ మెత్తగా చేసుకొని పక్కన పెట్టండి.
  4. ఇప్పుడు బాణలిలో నెయ్యి వేసి వేడి చేయండి. వేడయ్యాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి, ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, తరిగిన అల్లం, టొమాటోలను వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
  5. ఆ తర్వాత చిటికెడు పసుపు పొడితో పాటు 1 కప్పు నీరు కలపండి. టమోటాలు మృదువైనంత వరకు ఉడికించాలి.
  6. ఇప్పుడు మెత్తగా చేసిన పప్పును వేయండి, సరిపడా ఉప్పు వేసి, 2 కప్పుల నీరు కలపండి. బాగా మరిగించండి.
  7. ఆపైన తాజాగా తరిగిన కొత్తిమీర ఆకుల వేసి స్టవ్ ఆఫ్ చేయండి.
  8. చివరగా, రసాన్ని కొద్దిగా చల్లబరిచి, పులుపు కోసం నిమ్మకాయ రసం పిండండి.

అంతే, నిమ్మకాయ అల్లం రసం రెడీ. దీనిని నేరుగా తాగొచ్చు లేదా వేడి వేడి అన్నంలో కలుపుకొని తినొచ్చు.

సంబంధిత కథనం