Tandoori Chicken History: ప్రపంచ బెస్ట్ లిస్ట్‌లో ఇండియన్ పాపులర్ తందూరి చికెన్.. దీని చరిత్ర తెలుసా?
Tandoori Chicken: ప్రపంచ బెస్ట్ గ్రిల్డ్ చికెన్ వంటకాల్లో తందూరి చికెన్‍కు చోటు దక్కింది. ఈ పాపులర్ ఇండియన్ వంటకానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది. అయితే, తందూరు చికెన్ చరిత్ర, మూలాల గురించి మీరు తెలుసా?
తందూరి చికెన్ అంటే కోట్లాది మందికి ఎంతో ఇష్టం. ఇండియాలో చాలా పాపులర్ డిష్ ఇది. దీని పేరు చెబితేనే చాలా మందికి నోరూరిపోతుంది. తందూరి చికెన్‍ను రకరకాల మసాలాలు, ఫేవర్లతో తయారు చేస్తారు. చాలా మందికి ఇది ఫేవరెట్ డిష్‍గా ఉంది. ఇప్పుడు, ఇండియన్ పాపులర్ ‘తందూరి చికెన్’కు ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కింది.
వరల్డ్ బెస్ట్ గ్రిల్డ్ చికెన్ లిస్ట్‌లో చోటు
ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రిల్డ్ చికెన్ వంటకాల జాబితాను టేస్ట్ అట్లాస్ తాజాగా వెల్లడించింది. ఈ బెస్ట్ లిస్ట్‌లో ఇండియాకు చెందిన తందూరి చికెన్ 19వ స్థానంలో చోటు దక్కించుకుంది. దీంతో దీనికి ఎంత పాపులారిటీ ఉందో మరోసారి స్పష్టమైంది. ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోని చాలాచోట్ల తందూరి చికెన్ ఫేమస్ అయింది. కోట్లాది మంది హృదయాలను ఇది నిత్యం గెలుచుకుంటూనే ఉంది.
తందూరి చికెన్ మూలాలు
తందూరి చికెన్‍కు ఘనమైన పురాతన చరిత్ర ఉంది. ఈ వంటకానికి పర్షియన్ మూలాలు ఉన్నాయి. పర్షియాకు చెందిన కొందరు ప్రపంచ యాత్రికులు.. భూమిలో గుంటలు తవ్వి మట్టి కండల్లో మాంసాన్ని కాల్చుకునే వారు. దీన్ని తందూరి చికెన్‍కు మూలంగా భావిస్తారు.
మరో వాదన కూడా..
హరప్పా నాగరికత క్రీస్తు పూర్వం 3000ల కాలంలోనే తందూరి చికెన్‍ను మూలాలు ఉన్నాయని కొందరు చరిత్రకారులు నమ్ముతున్నారు. అప్పటి వారు మాంసం వండుకునేందుకు వాడుకున్న మట్టి పాత్రలను తందూర్ అనే వారని, తవ్వకాల్లో అవి బయటపడ్డాయని చెబుతున్నారు. మొత్తంగా తందూరి చికెన్ మూలాలకు రెండు వాదనలు ఉన్నాయి. ఎలా అయిన ఈ తందూరి చికెన్‍కు ఘనమైన పురాతన చరిత్ర ఉన్నట్టే.
పెషావర్ నుంచి ఢిల్లీకి..
భారత స్వాతంత్య్రానికి ముందు 1940ల్లో పాకిస్థాన్ భూభాగంలోని పెషావర్‌లో పాకిస్థాన్‍లో తందూరి చికెన్ తయారీ మళ్లీ మొదలైంది. కుందన్ లాల్ గుజ్రాల్, కుందన్ లాల్ జగ్గి అనే పంజాబీ సోదరులు ఈ వంటకాన్ని విస్తృతంగా తయారు చేశారు. బాగా ప్రాముఖ్యత వచ్చింది. ఆ తర్వాత తందూరి చికెన్ ఢిల్లీలో అడుగుపెట్టేసింది. అప్పటి నుంచి ఇండియాలో పాపులర్ చికెన్ వంటకమైంది. ఢిల్లీ వీధుల్లో రకరకాల మసాలాలతో, తయారీ విధానాలతో తందూరి చికెన్ కళకళలాడింది. జనాలకు అత్యంత వేగంగా చేరువైంది. ఇష్టమైన ఐకానిక్ వంటకంగా మారిపోయింది.
దేశమంతా..
ఢిల్లీ, పంజాబ్ నుంచి క్రమంగా దేశమంతా తందూరి చికెన్ వ్యాపించింది. దేశవ్యాప్తంగా జనాల మనసులను గెలుచుకుంది. చాలా మందికి ఫేవరెట్ డిష్‍గా ఇప్పటికీ ఉంది. తందూరి చికెన్‍లో ప్రాంతాలను బట్టి లోకల్ ఫ్లేవర్ కూడా వచ్చేసింది. రకరకాల మసాలాలు, పదార్థాలతో డిఫరెంట్‍గా కూడా తందూరి చికెన్ తయారవుతోంది. స్పైసీగా, స్మోకీగా, క్రంచీగా, జ్యూసీగా ఉంటోంది తందూరి చికెన్. ఎక్కువగా రోటీలు, నాన్స్, అన్నంతో దీన్ని నంచుకొని తింటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల కూడా తందూరి చికెన్ ఫేమస్ అయింది.
తందూరి చికెన్‍కు ఇంతటి చరిత్ర ఉంటుంది. కాలాన్ని బట్టి ఫేవర్లు మారుతున్నా ఈ వంటకం చాలా మందికి ఫేవరెట్‍గానే కొనసాగుతోంది. తరతరాలుగా డామినేట్ చేస్తోంది. ఎంతో మందికి రుచిని, సంతృప్తిని అందిస్తోంది.
టాపిక్