Kashmir Trip: హిమపాతాలు చూసేందుకు కాశ్మీర్ ట్రిప్ వెళతారా? ఎంత ఖర్చువుతుందో తెలుసుకోండి-taking a trip to kashmir to see the snowfall find out how much it costs ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kashmir Trip: హిమపాతాలు చూసేందుకు కాశ్మీర్ ట్రిప్ వెళతారా? ఎంత ఖర్చువుతుందో తెలుసుకోండి

Kashmir Trip: హిమపాతాలు చూసేందుకు కాశ్మీర్ ట్రిప్ వెళతారా? ఎంత ఖర్చువుతుందో తెలుసుకోండి

Haritha Chappa HT Telugu
Jan 09, 2025 09:31 AM IST

Kashmir Trip: కాశ్మీర్ ను భూమ్మీద ఉన్న స్వర్గంలా చూస్తారు. ఇక్కడ ఏర్పడే హిమపాతాలు చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి. మంచుతో కప్పబడిన పర్వతాలను చూడాలని అందరికీ ఉంటుంది. మీరు కూడా ఇక్కడికి వెళ్లాలనుకుంటే ఒక వ్యక్తికి ఎంత ఖర్చవుతుందో తెలుసుకోండి.

కాశ్మీర్ ట్రిప్ ఎంత ఖర్చవుతుంది?
కాశ్మీర్ ట్రిప్ ఎంత ఖర్చవుతుంది?

కాశ్మీర్ అందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భూమ్మీద ఉన్న స్వర్గంలా చెప్పుకుంటారు కాశ్మీర్‌ను. కాశ్మీర్ లోయలు, భారీ హిమపాతం, మంచు పర్వతాలు… ఇలా చెప్పుకుంటూ పోతే కాశ్మీర్ లో చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో. ఎంతో మంది కాశ్మీర్ వెళ్లాలని కోరుకుంటారు. కానీ ఖర్చు దగ్గర భయపడుతుంటారు. కుటుంబమంతా కలిసి వెళితే ఖర్చు తడిసి మోపెడవుతుందని అనుకుంటారు. అందుకే కాశ్మీర్ వెళ్లేందుకు ఎంత ఖర్చవుతుందో తెలుసుకోండి.

yearly horoscope entry point

కాశ్మీర్ ప్రాంతమంతా అందమైన మంచుతో కప్పి ఉంటుంది. రోడ్డు పక్కన ఉన్న ఇళ్లు, వాహనాలు, చెట్లు, బెంచీల పైకప్పులపై భారీగా మంచు కురిసి విదేశాల్లో ఉన్న ఫీలింగ్ ను కలిగిస్తుంది. ఈ సమయంలో ఇక్కడికి వచ్చిన పర్యాటకుల ఆనందానికి అవధులు ఉండవు. అదే సమయంలో సోషల్ మీడియాలో ఈ హిమపాతానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు చూస్తున్న వారు ఈ ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మీరు కూడా ఇక్కడకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే మీ కోసమే ఈ కథనం.

కాశ్మీర్ వెళ్లేందుకు అయ్యే ఖర్చు

కాశ్మీర్ అందరి మనసులను ఆకర్షిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ ప్రదేశం అందం మరింత పెరుగుతుంది. చలికాలంలో ఇక్కడ మంచు అధికంగా కురుస్తుంది. కాబట్టి చాలా మంది ఇక్కడకు వెళ్లాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడకు వెళ్లడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవాలని అనుకుంటారు. అయితే అది మీరు మీరు ప్రయాణించే విధానంపై ఆధారపడి ఉంటుంది. లగ్జరీ ట్రిప్ చేసి అన్నీ ఎంజాయ్ చేయాలనుకుంటే కనీసం 70 నుంచి 80 వేల రూపాయలు ఖర్చు చేయాలి. అయితే బడ్జెట్ లో ప్రయాణించాలనుకుంటే 3 పగలు, 2 రాత్రులు కశ్మీర్ ట్రిప్ కు అయ్యే ఖర్చు కనీసం 10 వేలు ఉంటుంది. కశ్మీర్ కు 5 రోజుల, 4 రాత్రుల ట్రిప్ కు రూ.35 వేల నుంచి రూ.51 వేల వరకు ఖర్చవుతుంది. ఇది కేవలం ఒక వ్యక్తికి మాత్రమే. ఇక కుటుంబమంతా వెళితే ఖర్చులు మరింత పెరుగుతాయి.

చలికాలం నలభై రోజుల పాటూ ఇక్కడ తీవ్రంగా ఉంటుంది. డిసెంబర్ 21 నుంచి కాశ్మీర్లో విపరీతంగా మంచు కురుస్తోంది. ఈ సమయంలో విపరీతమైన చలి ఉంటుంది. ఈసారి చిల్లె కలాన్ అనే ప్రాంతంలో రెండోసారి భారీ హిమపాతం ఏర్పడింది. మీరు కాశ్మీర్ లో మంచును ఆస్వాదించాలనుకుంటే ఇది ఉత్తమ సీజన్.

కాశ్మీర్ వెళ్లాలనకుంటే మాత్రం కచ్చితంగా తగిన దుస్తులు వేసుకోవాలి. చేతులకు, కాళ్లకు కూడా గ్లవుజులు, సాక్సులు వేసుకోవాలి. అక్కడ చలిని తట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి కాశ్మీర్ వెళ్లాలనుకునే దుస్తుల విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Whats_app_banner