Breakfast Tips : బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇవి తీసుకోండి.. ఆరోగ్యంగా ఉంటారు-take these foods in your breakfast for health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Take These Foods In Your Breakfast For Health

Breakfast Tips : బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇవి తీసుకోండి.. ఆరోగ్యంగా ఉంటారు

HT Telugu Desk HT Telugu
Mar 11, 2023 06:30 AM IST

Breakfast Tips : కొంతమంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయరు. దీంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఉదయం పూట తీసుకునే ఆహారంతోనే రోజంతా ఎలా ఉంటామో ఆధారపడి ఉంటుంది. అందుకే.. అల్పాహారంలోకి ప్రోటీన్లు ఉండే ఫుడ్ తీసుకోవాలి.

ఓట్స్ బ్రేక్ ఫాస్ట్
ఓట్స్ బ్రేక్ ఫాస్ట్

చాలామంది నేరుగా మధ్యాహ్నమే భోజనం చేస్తారు. ఉదయం అల్పాహారం తీసుకోరు. బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే.. చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అన్ని పోషకాలు ఉండేలా.. ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. ఈ కారణంగా రోజుకు మనకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి. దీంతో శక్తి లభిస్తుంది. పోషకాహార లోపం ఏర్పడకుండా.. వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.

ఉదయం తీసుకోవాల్సిన ఆహారాల్లో స్ట్రాబెర్రీలు ఒకటి. వీటితో విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. బ్రేక్ ఫాస్ట్ లో ఒక కోడిగుడ్డును తప్పుకుండా తీసుకోవాలి. దీంతో కావాల్సిన పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు, కొవ్వులు దొరుకుతాయి. కచ్చితంగా ఉదయం అల్పాహారంలోకి కోడిగుడ్డు ఉండేలా ప్లాన్ చేయండి. ఉడకబెట్టి లేదా.. ఆమ్లెట్ రూపంలో కూడా తినొచ్చు. కూరగాయలతో కలిపి ఆమ్లెట్ లాగా తింటే టేస్టీగా ఉంటుంది.

అల్పాహారంలోకి వెన్న లేదా నెయ్యిని తీసుకుంటే మంచిది. దీంతో విటమిన్ ఇ, కెలు లభిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బ్రేక్ ఫాస్ట్ లోకి బాదంపప్పు తీసుకుంటే కూడా మంచిది. రాత్రిపూట గుప్పెడు బాదంపప్పును నానబెట్టుకోవాలి. తర్వాతి రోజు బ్రేక్ ఫాస్ట్ లోకి వాటిని పొట్టు తీసి తినాలి. ఇలా చేస్తే పోషకాలు అందుతాయి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. .

బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అరటి పండును కలిపి తింటే.. బీపీ తగ్గుతుంది. రక్త సరఫరా మెరుగవుతుంది. చివరగా గ్రీన్ టీని తీసుకోండి. కొవ్వు కరుగుతుంది. బరువు కూడా తగ్గుతారు. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.

WhatsApp channel