Bone Soup: కీళ్ల నొప్పులు త్వరగా తగ్గాలంటే బోన్ సూప్‌ను వారానికి ఎన్ని సార్లు తాగాలో తెలుసా?
Bone Soup: కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అలాంటివారికి బోన్ సూప్ ఎంతో సహకరిస్తుంది. వారానికి రెండు నుంచి మూడుసార్లు తాగితే చాలు.
Bone Soup: వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్ల నొప్పులు తీవ్రంగా వేధిస్తాయి. ఎక్కువగా పనిచేసే వారిలో కీళ్లు అరిగిపోయే ప్రమాదం, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటివారికి బోన్ సూప్ ఒక వరమనే చెప్పాలి. నిజానికి దీనివల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య పోషకాలు అందుతాయి. కానీ ఇది సరిగా ప్రజాదరణ మాత్రం పొందలేదు. వారానికి ఒకసారి బోన్ సూప్ తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పోషక విలువలు కూడా సమంగా శరీరానికి అందుతాయి. అంతేకాదు బరువు తగ్గడానికి ప్రోటీన్ డైట్ లో భాగంగా చేసుకోవడానికి, వృద్ధాప్యాన్ని దూరం పెట్టడానికి కూడా బోన్ సూప్ ఎంతో ఉపయోగపడుతుంది.
బోన్ సూప్ అంటే ఏమిటి?
మేక, గొర్రె, కోడి ఇలాంటి జంతువులకు చెందిన ఎముకలను నీటిలో ఉడకబెట్టడం ద్వారా బోన్ సూపును తయారుచేస్తారు. ఎక్కువ సేపు దీన్ని అధికమంట వద్ద మరిగించాల్సి వస్తుంది. ఆ సూప్ ను తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
కీళ్ల నొప్పులు ఉన్న వారు
కీళ్ల నొప్పులు ఉన్నవారు, కీళ్ళను బలోపేతం చేసుకోవాల్సిన వారు బోన్ సూపును ప్రతిరోజూ తాగాల్సిన అవసరం ఉంది. దీనిలో కొల్లాజెన్ ఉత్పత్తి చేసే గుణం ఎక్కువ. అలాగే ప్రోటీన్ కూడా నిండుగా ఉంటుంది. చర్మానికి, జుట్టుకు లభిస్తుంది. కొల్లాజెన్ ఉండే భోజనాన్ని తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. కీళ్ల రుగ్మతలు కూడా తగ్గుతాయి. చర్మం బిగుతుగా మారి అకాల వృద్ధాప్యం రాకుండా ఉంటుంది. కాబట్టి కొలాజెన్ కోసం వారానికి రెండు మూడు సార్లు బోన్ సూప్ తాగేందుకు ప్రయత్నించండి. దెబ్బతిన్న కీళ్ళను నయం చేయడానికి కూడా బోన్ సూపు ఎంతో ఉపయోగపడుతుంది.
బోన్ సూప్ ప్రొటీన్ డైట్
ప్రోటీన్ డైట్ మీద ఉండేవారు ప్రతిరోజు బోన్ సూప్ తీసుకోవచ్చు. దీనిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. జిమ్ కు వెళ్లే వారికి కూడా బోన్ సూప్ ఒక వరమనే చెప్పాలి. ఒక వ్యక్తికి రోజుకు 54 గ్రాముల ప్రోటీన్ అవసరం పడుతుంది. బోన్ సూప్ తాగడం వల్ల 10 గ్రాముల ప్రోటీన్ శరీరానికి అందుతుంది. ప్రోటీన్ ఉన్న ఆహారం తినడం వల్ల పొట్ట నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇతర ఆహారాలు ఎక్కువగా తినరు. తద్వారా కూడా బరువు త్వరగా తగ్గుతారు.
ఊబకాయం, అధిక బరువుతో బాధపడేవారు, బరువు తగ్గించే ప్రయాణంలో బోన్ సూప్ ను భాగం చేసుకోండి. అధిక ప్రోటీన్ ఉండే కంటెంట్ కాబట్టి ఇది మీ కేలరీలను పరిమితంగా ఉంచుతుంది. ఒక కప్పు బోన్ సూపు తాగడం వల్ల ప్రోటీన్ శరీరానికి చేరుతుంది. మీ ఆహార కోరికలను అదుపులో ఉంచుతుంది. దీనివల్ల జంక్ ఫుడ్, స్వీట్ క్రేవింగ్స్ తగ్గుతాయి.
బోన్ సూప్‌ను కోడి, గొర్రె, మేక వంటి వాటి ఎముకలతో తయారుచేస్తారు. అవన్నీ కూడా గడ్డి వంటి శాకాహారాన్ని తినేవి. కాబట్టి ఆ జంతువుల ఎముకల్లో కొల్లాజెన్ ఉత్పత్తి అధికంగా ఉంటుంది. ఇది మన యవ్వనవంతమైన చర్మానికి చాలా అవసరం. అలాగే ఖనిజాలు, విటమిన్ ఏ మన చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. ముఖంపై ముడతలు, గీతలు రాకుండా ఉంటాయి.
బోన్ సూప్‌లో కొలాజిన్, గ్లూటమైన్, గ్లైసిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ వంటి వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. శరీరంలో ఇన్ఫ్లమేషన్ రాకుండా అడ్డుకుంటాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గడం వల్ల గుండె ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. వారానికి కనీసం రెండుసార్లు బోన్ సూప్ తయారుచేసుకొని తినడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా మటన్ బోన్స్ తో చేసుకునే సూప్ టేస్టీగా ఉంటుంది. మీకు మీలో తినాలన్న కోరికను కూడా పెంచుతుంది.
టాపిక్