Bread Malai Toast: అతిథుల కోసం సింపుల్‌గా తయారయ్యే బ్రెడ్ మలాయ్ టోస్ట్ చేసి పెట్టండి, ఇది భలే రుచిగా ఉంటుంది!-sweet recipes try this simple and tasty bread malai toast recipe today ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bread Malai Toast: అతిథుల కోసం సింపుల్‌గా తయారయ్యే బ్రెడ్ మలాయ్ టోస్ట్ చేసి పెట్టండి, ఇది భలే రుచిగా ఉంటుంది!

Bread Malai Toast: అతిథుల కోసం సింపుల్‌గా తయారయ్యే బ్రెడ్ మలాయ్ టోస్ట్ చేసి పెట్టండి, ఇది భలే రుచిగా ఉంటుంది!

Ramya Sri Marka HT Telugu

Bread Malai Recipe: తియ్యగా, కమ్మగా ఏదైనా తినాలని అనిపించినప్పుడు బ్రెడ్ మలాయ్ చేసుకుని తినండి. చాలా త్వరగా తయారయ్యే బ్రెడ్ మలాయ్ టోస్ట్ రుచిలో అదిరిపోతుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. ట్రై చేయాలనుకుంటే ఈ రెసిపీని ఫాలో అవండి.

బ్రెడ్ తో తయారు చేసిన రుచికరమైన మలాయ్ టోస్ట్

ఎప్పుడూ తినే రొటీన్ స్వీట్లు ఎందుకు, ఈసారి కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అని ఫీలవుతున్నారా? అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిథులకు తియ్యగా కమ్మగా ఏదైనా స్వీట్ చేసి పెట్టాలి అనుకుంటున్నారా? అయితే బ్రెడ్ మలాయ్ టోస్ట్ మీకు బెస్ట్ ఆప్షన్. ఈజీగా సింపుల్‌గా తయారయ్యే ఈ బ్రెడ్ మలాయ్ టోస్ట్ చాలా రుచిగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరికీ బాగా నచ్చుతుంది. ఆలస్యం చేయకుండా బ్రెడ్ మలాయ్ టోస్ట్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి..

బ్రెడ్ మలాయ్ టోస్ట్ తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు:

బ్రెడ్ టోస్ట్ చేయండం కోసం..

  • బ్రెడ్ - 8 నుంచి 10 బ్రెడ్
  • నూనె- 50 గ్రాములు
  • నెయ్యి- ఒక స్పూన్ నెయ్యి

పాకం కోసం

  • పంచదార- ఒక కప్పు పంచదార
  • నీరు- ఒక కప్పు నీరు

మలాయ్ కోసం

  • పాలు - అర లీటర్ పాటు
  • పాల పొడి- 200 గ్రాములు
  • చక్కెర- ఒక టీ స్పూన్
  • నెయ్యి - ఒక టీ స్పూన్

బ్రెడ్ మలాయ్ టోస్ట్ తయారు చేయడం కోసం..

  1. బ్రెడ్ మలాయ్ టోస్ట్ తయారు చేయడం కోసం ముందుగా బ్రెడ్ ముక్కలను తీసుకుని వాటి చుట్టూ ఉండే బ్రౌన్ కలర్ అంచులను కట్ చేసేయండి.
  2. తరువాత ఓ బ్రెడ్ స్లైస్ ను నాలుగు భాగాలుగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోండి.
  3. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ పాన్ తీసుకుని దాంట్లో నూనె, నెయ్యి వేసి వేడి చేయండి.
  4. నూనె కాస్త వేడెక్కిన తర్వాత కట్ చేసుకుని పక్కకు పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను దీంట్లో వేసి వేయించండి.
  5. స్టవ్ ను మీడియం ఫేం మీదే ఉంచి బ్రెడ్ ముక్కలు బంగారు రంగులోకి వచ్చేంత వరకూ వేయించుకుని పక్కకు పెట్టుకోండి.
  6. ఇప్పుడు పాకం కోసం ఒక పాన్ తీసుకుని దాంట్లో చక్కెర వేయండి.
  7. తరువాత దీంట్లోనే నీరు పోసి చక్కెర అంతా కరికి పాకంలా తయారు అయ్యేంత వరకూ వేడి చేయండి. బ్రెడ్ మలాయ్ టోస్ట్ కోసం ముదురు పాకం అవసరం లేదు కొద్దిగా జిగురు పాకం వస్తే సరిపోతుంది.
  8. పాకం తయారైన తర్వాత వేయించుకున్న బ్రెడ్ ముక్కలను తీసి పాకంలో వేసి ఒకటి లేదా రెండు నిమిషాలు ఉంచి తీసేయాలి. ఎక్కువ సేపు అలాగే ఉంచిదే బ్రెడ్ ముక్కలు మరీ మెత్తగా మారి టోస్ట్ తినడానికి వీలు కాదని గుర్తుంచుకోండి.
  9. పాకంలో పట్టిన బ్రెడ్ ముక్కలను తీసుకుని ఒక ప్లేటులో వేసి అలాగే పక్కకు ఉంచండి.
  10. ఇప్పుడు మలాయ్ కోసం కోవాలను తయారు చేసుకోవడం మాత్రమే మిగిలి ఉంది. దీని కోసం మీరు ఒక పాన్ తీసుకుని దాంట్లో పాలు పోయండి.
  11. పాలు కాస్త వేడెక్కగానే దాంట్లో పాల పొడి వేయండి. పాల పొడి కరిగేంత వరకూ బాగా కలుపుతూ ఉండండి లేదంటే వుండలు కడుతుంది.
  12. పాల పొడి అంతా చక్కగా కరిగిపోయి కాస్త దగ్గర పడగానే దాంట్లో ఒక స్పూన్ చక్కెర వేసి కలపండి.
  13. చక్కెర కరిగి కోవా చిక్కగా తయారైన తర్వాత దాంట్లో ఒక స్పూన్ నెయ్యిని వేసి బాగా కలపండి.
  14. ఇలా కోవా అంత దగ్గర పడే వరకూ స్టవ్‌ని చిన్న మంట మీదే ఉంచి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.
  15. ఇప్పుడు పాకంలో నానబెట్టి పక్కకు పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను ఒక్కొక్కటిగా తీసుకుంటూ దాని మీద కోవాలను పెట్టి మళ్లీ దాని మీద మరో బ్రెడ్ ముక్కను పెట్టండి.
  16. ఇలా బ్రెడ్ ముక్కలన్నింటికీ మధ్యలో కోవా పెట్టి పక్కన పెట్టుకున్నారంటే రుచికరమైన బ్రెడ్ మలాయ్ టోస్ట్ రెడీ అయినట్టే. సర్వ్ చేసుకుని తినేయడమే. రెసిపీ నచ్చింది కదా ట్రై చేసేయండి మరీ.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం