New Year Gifts: న్యూ ఇయర్ రోజున మీ ప్రియమైన వారిని ఊరికే విష్ చేస్తే ఏం బాగుంటుంది? ఈ గిఫ్ట్ ఐడియాలపై ఓ లుక్కేయండి
New Year Gifts: న్యూ ఇయర్ రోజున స్నేహితులు, కుటుంబీకులు అందరికీ రకరకాలుగా శుభాకాంక్షలు చెబుతుంటాం. అయితే అందరిలాగే మీ ప్రియుడు లేదా ప్రేయసిని కూడా ఊరికే విష్ చేస్తే బాగుండదు కదా..అందుకే వీటిలో ఏదైనా బహుమతిగా ఇచ్చి శుభాకంక్షలు తెలపండి వారు చాలా సంతోషిస్తారు.
న్యూ ఇయర్ 2025 వచ్చేస్తోంది. ఆ రోజున కుటుంబీకులు, స్నేహితులను సరికొత్తగా విష్ చేసేందుకు, సంతోషకరమైన సమయాన్ని గడిపేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా? అందరిలాగే భాగస్వామికీ, ప్రియుడు లేదా ప్రేయసికి కూడా ఊరికే శుభాకాంక్షలు చెబితే ఏం బాగుంటుంది..? ప్రత్యేకంగా ఎలా విష్ చేయాలి అని ఆలోచిస్తున్నారా..? అయితే మేము మీకు సహాయం చేయగలం. కొత్త సంవత్సరం మీ భార్య లేదా భర్తకు, బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా శుభాకాంక్షలు చెప్పాలని భావిస్తున్నట్లయితే మీరు వారి కోసం ఏదైనా బహుమతిని ప్లాన్ చేయండి.
మీరు ఇచ్చే బహుమతులు వారి పట్ల మీ ప్రేమను, అంతులేని గౌరవాన్ని వ్యక్తపరిచేలా ఉండాలి. ఎక్కువ ఖర్చు పెట్టకుండానే తక్కువ బడ్జెట్‌లోనే వారికి నచ్చిన బహుమతులను ఎంచుకునేలా చూడండి. ప్రేమికులు ఇష్టపడే కొన్ని అద్భుతమైన ఆలోచనలు, బహుమతులను మేం మీకోసం తీసుకొచ్చాం.ఇవి మీ ప్రియమైన వారి అభిరుచులకు తప్పకుండా సరిపోతాయనే అనుకుంటున్నాం. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
పర్సనలైజ్డ్ గిఫ్ట్స్/ ఫోటో ఫ్రేమ్‌లు:
మీ ప్రియమైన వారిని ఇంప్రెస్ చేయడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే పర్సనలైజ్డ్ గిఫ్ట్స్ లేదా ఫోటో ఫ్రేమ్‌లు, ఫొటో క్యాండిల్స్. ఇవి వారికి వ్యక్తిగతంగా చాలా నచ్చుతాయి. మీతో వారు గడిపిన విలువైన సమయాలను, ప్రత్యేక సందర్భాలను జ్ఞాపకాలుగా మలిచి వాటిని బహుమతిగా ఇవ్వడం వారికి చాలా సంతోషాన్నిస్తుంది. ఎక్కువ ఖర్చు లేకుండా వారిని సంతోషపెట్టే మార్గం కూడా ఇదే.
వాచీలు, యాక్సెసరీలు:
మీ ప్రియుడు లేదా ప్రేయసికి, భాగస్వామికి వాచీలు, యాక్సెసరీలు ఇష్టమైతే వారికోసం మీరు స్టైలిష్ చేతి గడియారాలు, హై-టెక్ స్మార్ట్‌వాచ్‌లు ఎంచుకోండి. ఇప్పుడు స్మార్ట్‌వాచ్‌లు ఫిట్‌నెస్ ట్రాకింగ్, ఇన్‌స్టంట్ నోటిఫికేషన్‌లు వంటి ఫీచర్‌లను అందిస్తాయి. ఇవి వారికి నచ్చడమే కాకుండా ప్రతిరోజూ ఉపయోగపడతాయి కూడా.
మినీ పుస్తకం లేదా మినీ ఆల్బమ్:
పర్సనల్ గా హ్యాపీగా ఫీలయ్యేలా మీరు ఎవరికైనా బహుమతి ఇవ్వాలనుకుంటే.. మినీ బుక్ లేదా మినీ ఆల్బమ్ మీకు మంచి ఎంపిక. వారిపై మీ భావాలను ఒక కాగితంలో రాయడం, వారు మీకు ఎలా ముఖ్యమో తెలియజేస్తూ చిన్న చిన్న లేఖలుగా రాసి చిన్న పుస్తకంగా తయారు చేసి ఇవ్వడం.చిన్న చిన్న ఫొటోలను ప్రింట్ చేయించి మినీ ఆల్బమ్ తయారు చేసి బహుమతిగా ఇవ్వడం వారిని చాలా ఆకట్టుకుంటుంది. ఇది వారికి ఖచ్చితంగా నచ్చుతుంది.దీనికి క్రియేటివ్ టచ్ ఇవ్వడానికి స్టిక్కర్లు, శీర్షికలు,ప్రేమ పలుకులను చేర్చండి.
హ్యాండ్ పెయింటెడ్ గిఫ్ట్స్:
మీ ప్రియమైన వ్యక్తి కోసం తెల్లటి గాజు వస్తువులు లేదా కాఫీ మగ్ లను తీసుకుని వారికి నచ్చే విధంగా యాక్రిలిక్ పెయింట్ సహాయంతో వారికి డిజైన్లు వేయండి. లేదా లవ్ యూ డియర్ అని రాసి బహుమతిగా ఇవ్వండి. వారు ఉదయం కాఫీ లేదా టీ సిప్ చేసినప్పుడల్లా, అది వారికి మిమ్మల్ని గుర్తు చేసేలా వ్యక్తిగత సందేశాన్ని రాయండి.
ఇష్టమైన ఆహారాలు:
మీకు ఇష్టమైన వ్యక్తి కోసం మీరే స్వయంగా వంట చేయడం అనేది ప్రేమను వ్యక్తం చేయడంలో ఉన్నతమైన భాషం. కనుక వారికి తెలియకుండా వారి నమ్మలేని విధంగా వారికి ఇష్టమైన ఆహారాన్ని మీరే వండి పెట్టండి.తిపీ పదార్థమైతే మరింత బాగుంటుంది కూడా. అంతేకాదు డైనింగ్ టేబుల్ ను అందంగా అలంకరించి వారిని కూర్చోబెట్టి వడ్డించండి. ఇది వారికి మీ మీదున్న అతీతమైన ప్రేమను సూచిస్తుంది. ఎన్నటికీ గుర్తుండిపోతుంది.
ఆభరణాలు:
పూసలు, తీగలు వంటి వాటితో మీరు స్వయంగా తయారు చేసిన ఆభరణాలు, కుట్టిన రుమాలు లేదా స్కార్ఫ్ లు వంటి వాటిని ప్రత్యేకంగా తయారు చేయండి. బ్రాస్‌లెట్‌లు, నెక్లెస్‌లు లేదా చెవిపోగులను డిజైన్ చేయండి. మీ ప్రియమైన వ్యక్తికి ఇష్టమైన రంగులు లేదా రాళ్లతో వాటిని వ్యక్తిగతీకరించండి. లేని పక్షంతో వారికి గతంలో నచ్చి కొనుక్కోని వస్తువులను సీక్రెట్ గా కొని ఇప్పుడు బహుమతిగా ఇవ్వండి.
గిఫ్ట్ బాస్కెట్:
మనస్సులో చాలా బహుమతులు ఉన్నాయి, కానీ ఒకదాన్ని కచ్చితంగా ఎంచుకోలేకపోతున్నా.. అనుకునే వారు చేయాల్సిన పనేంటంటే.. ఒక బుట్ట లేదా గిఫ్ట్ బకెట్ తీసుకొని మీ ప్రియమైన వ్యక్తి అభిరుచి, వ్యక్తిత్వాన్ని బట్టి వారికి నచ్చేవి, మీరు ఎంచుకున్నవి అన్నింటినీ దాంట్లో ప్యాక్ చేసి సర్‌ఫ్రైజ్ ప్యాక్ చేసి బహుమతిగా ఇవ్వండి. వారు కచ్చితంగా సంతోషిస్తారు.
సంబంధిత కథనం