ప్రజలు తమ చర్మ ఆరోగ్యం విషయంలో మరింత స్పృహ పెంచుకుంటున్నారు. అందుకే ఈ రోజుల్లో సన్‌స్క్రీన్ అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇది అన్ని రకాల చర్మం కలిగిన వారికి అనువైనది. అలాగే చర్మ సంరక్షణ దినచర్యలో భాగంగా చాలా ముఖ్యమైన పదార్థం అని సౌందర్య నిపుణులు కచ్చితంగా చెబుతున్నారు. ముఖ్యంగా బయటికి వెళ్లేటప్పుడు తప్పకుండా సన్‌స్క్రీన్ రాసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే..
సన్స్క్రీన్ లోషన్ సూర్యుడి నుంచి వెలువడే హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని కాపాడటానికి, అనక చర్మ వ్మాధుల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది. రోజులో కనీసం రెండు సార్లైనా చర్మానికి సన్‌స్క్రీన్ తప్పక రాయడం వల్ల చర్మం కాంతివంతంగా, మెరుస్తూ కనిపిస్తుంది. చర్మం పొడి బారడం, తేమను కోల్పోవడం వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. సన్‌స్క్రీన్ లోషన్ ను రెగ్యులర్ స్కిన్ కూర్ రోటీన్లో చేర్చుకోవడం వల్ల పిగ్మెంటేషన్ సమస్య కూడా తగ్గుతుందని, పాడైపోయిన చర్మ కూడా కొత్త కణాలను సృష్టించుకుంటుందనీ అధ్యయనాలు చెబుతున్నాయి.
సన్స్క్రీన్ తో చాలా రకాల ప్రయోజనాలు ఉన్నప్పటికీ పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. వారి సెస్సిటివ్ స్కన్ మీద సన్‌స్క్రీన్ రాయడం మంచిదేనా? ఏ వయసు నుంచీ పిల్లలకు సన్‌స్క్రీన్ రాయడం ప్రారంభించాలి? అని చాలా మంది తల్లులు ఆలోచిస్తుంటారు. ఇలాంటి ప్రశ్నలు మీలోనూ ఉంటే ఇక్కడ సమాధానం లభిస్తుంది. ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అర్పిత్ గుప్తా దీని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు.
డాక్టర్ అర్పిత్ గుప్తా ప్రకారం ఆరు నెలల లోపు పిల్లల చర్మం అతి సున్నితమైనది. కాబట్టి వారి చర్మానికి సన్‌స్క్రీన్ ఉపయోగించం మంచిది కాదని ఆయన సూచించారు. ఈ వయసులో వారికి సన్‌స్క్రీన్ రాయడం వల్ల చర్మాన్ని రసాయనాలు దెబ్బతీసే ప్రమాదముందని తెలిపారు.
మరి వారి చర్మాన్ని ఎలా రక్షించుకోవాలి అంటే.. సహజ ప్రత్యమ్యామాలను అందించారు. వేసవి కాలంలో పిల్లలకు వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేయాలి, స్నానానికి ముందు నూనెతో చర్మానికి మర్దనా చేయాలి. ముఖ్యంగా ఆరు నెలల లోపు పిల్లలను బయటికి తీసుకుని వెళ్లకూడదు అని ఆయన చెప్పుకొచ్చారు. తప్పనిపరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే వారి చర్మాన్ని పూర్తిగా కప్పేయాలి. వెడల్పాటి టోపీలు, గొడుగులు వంటి వాటితో వారిని ఎప్పుడూ నీడలోనే ఉంచాలి. సూర్యుడి హానికరమైన కిరణాలు నేరుగా వారి మీద పడకుండా కాపాడుకోవాలని తెలిపారు.
ఆరు నెలల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సన్స్క్రీన్ వాటడం సురక్షితం అని డాక్టర్ అర్పిత్ వివరించారు. అది కూడా దీర్ఘకాలిక సూర్యరశ్మి ఉన్న సందర్భాల్లో మాత్రమే. పెద్దలు కొన్నిసార్లు ఇంట్లో ఉన్నప్పుడు అలాగే బయటకు వచ్చిన ప్రతిసారీ సన్‌స్క్రీన్ ధరిస్తారు. కాని చిన్న పిల్లల విషయంలో అలా చేయకూడదు. ఇంట్లో ఉన్నప్పుడు వారికి ఎలాంటి సన్‌స్క్రీన్ అవసరం లేదు. నేరుగా ఎండలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు మాత్రమే సన్‌స్క్రీన్ ఉపయోగించండి.
పిల్లలు ఆరుబయట ఆడుకోవడం, పిక్నిక్ వంటి వాటికోసం వెళ్లడం లేదా పిల్లవాడు నేరుగా 2 నుండి 4 గంటలకు పైగా సూర్యరశ్మికి గురయ్యే ఏదైనా బహిరంగ ప్రదేశంలో ఉండటం వంటి పరిస్థితుల్లో వారికి సన్‌స్క్రీన్ తప్పకుండా రాయాలని ఆయన తెలిపారు. ఈ సమయంలో సన్‌స్క్రీన్ హానికరమైన యూవీ కిరణాల నుంచి రక్షణ కల్పిస్తుందని, ఇలాంటి సందర్భాల్లో సన్‌స్క్రీన్ చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు.
సంబంధిత కథనం