సన్‌డే స్పెషల్! క్యాప్సికమ్ చికెన్ కర్రీ ట్రై చేయండి, ఈ రెసిపీతో చేశారంటే అదిరిపోతుంది!-sunday special try the capsicum chicken curry this recipe will make you drool ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  సన్‌డే స్పెషల్! క్యాప్సికమ్ చికెన్ కర్రీ ట్రై చేయండి, ఈ రెసిపీతో చేశారంటే అదిరిపోతుంది!

సన్‌డే స్పెషల్! క్యాప్సికమ్ చికెన్ కర్రీ ట్రై చేయండి, ఈ రెసిపీతో చేశారంటే అదిరిపోతుంది!

Ramya Sri Marka HT Telugu

సన్‌డే వచ్చిందంటే నాన్ వెజ్ ఉండాల్సిందే కదా! అందులోనూ చాలా మందికి ఫేవరేట్ ఫుడ్ అయిన చికెన్‌ను కచ్చితంగా వండాల్సిందే. మరి అలాంటప్పుడు చికెన్ కర్రీని ప్రతి వారం ఒకేలా ఎందుకు వండాలి. రండి ఈ సారి క్యాప్సికమ్‌తో కలిపి కొత్తగా ట్రై చేసేద్దాం.

క్యాప్పికం చికెన్ కర్రీ

క్యాప్సికమ్ చికెన్ కర్రీ వినడానికే కొత్తగా ఉంది కదా. తినడానికి కూడా అలాగే ఉంటుంది. పైగా చికెన్ టేస్ట్‌తో పాటు క్యాప్సికమ్ టేస్ట్ కలిసి ముందెప్పుడూ లేనంత టేస్టీగా అనిపిస్తుంది. క్యాప్సికమ్ అంటే ఇష్టపడని వారు కూడా లొట్టలేసుకుని తినేంత సూపర్ గా ఉంటుంది కర్రీ. ఈ రెండింటి కాంబినేషన్ వల్ల చికెన్లో ఉండే ప్రొటీన్లు, క్యాప్సికమ్‌లో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. ఫలితంగా రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు కండరాలకు బలం సమకూరుతుంది. మరింకెందుకు ఆలస్యం రెసిపీ తెలుసుకుని ట్రై చేసేయండి.

క్యాప్సికమ్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు:

  • వేరుశనగ నూనె - ఒక కప్పు
  • అల్లం - వెల్లుల్లి పేస్ట్ - అర కప్పు
  • ఉల్లిపాయలు - 5 (మీడియం సైజు)
  • జీలకర్ర పొడి - 2 టేబుల్ స్పూన్లు
  • కొత్తిమీర పేస్ట్ - అర కప్పు
  • ఎర్రటి మిరపకాయల పేస్ట్ - 4 టేబుల్ స్పూన్లు
  • పసుపు - అర టేబుల్ స్పూన్
  • కారం పొడి - 1 టేబుల్ స్పూన్
  • నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
  • నీరు - 2+2 గ్లాసులు
  • కొత్తిమీర - ఒక కప్పు
  • పచ్చిమిరప కాయలు - 4
  • చికెన్ - ఒకటిన్నర కిలో
  • క్యాప్సికమ్ - 4 (పెద్దవి)

క్యాప్సికమ్ చికెన్ కర్రీ తయారుచేసే విధానం:

  1. కడాయి తీసుకుని అందులో చికెన్ వేయించడానికి ఒక కప్పు నూనె పోయండి.
  2. ఒక చిన్న కప్పులో మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం - వెల్లుల్లి పేస్ట్ తీసుకుని దానిని నూనెలో వేసి వేయించుకోండి.
  3. అలా 2-3 నిమిషాలు వేగిన తర్వాత, అందులో ఉల్లిపాయల పేస్ట్ వేయండి. (మీడియం సైజులో ఉన్న 5 ఉల్లిపాయలను తీసుకుని ముందుగానే పేస్ట్‌గా చేసి పెట్టుకోవాలి)
  4. ఈ మిశ్రమాన్ని 4 నుంచి 5 నిమిషాల పాటు వేయించుకుని, ఆ తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచండి. అందులో నుంచి ఆయిల్ సపరేట్ అయిపోతుంది.
  5. అందులో రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి, అరకప్పు కొత్తిమీర పేస్ట్ వేయండి.
  6. ఆ తర్వాత ఎర్రటి మిరపకాయలను మెత్తగా నూరి 4 టేబుల్ స్పూన్ల మిశ్రమాన్ని గిన్నెలో వేయండి.
  7. అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం గిన్నెలో వేసి మొత్తం కలిసేలా మూడు నిమిషాల వరకూ తిప్పుతూ ఉండండి.
  8. కొద్దిసేపటి తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటే రుచికి, వాసనకు కమ్మగా ఉంటుంది.
  9. ఇప్పుడు ఆ మిశ్రమంలో అవసరానికి సరిపడా 1-2 గ్లాసుల నీరు పోసి బాగా కలిపి 8 నిమిషాల వరకూ మూత పెట్టి అలా వదిలేయండి.
  10. ఆ తర్వాత మూత తీసి కమ్మటి పెరుగు ఒక కప్పు వేసి కలపండి.
  11. ఇప్పుడు మిక్సీలో ఒక కప్పు కొత్తిమీర, నాలుగు పచ్చిమిరపకాయలు వేసి మెత్తటి పేస్ట్ చేసుకోండి. దానిని గిన్నెలో వేసుకుని, ఆ మిశ్రమానికి రుచికి తగినంత ఉప్పు కలపండి.
  12. ఆ చిక్కటి పేస్ట్‌లో ఒకటిన్నర కిలోల చికెన్ వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి.
  13. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చికెన్ ను పైకి కిందకు తిప్పండి.
  14. ఇప్పుడు అందులో నిలువుగా కోసిన టమాటా ముక్కలు వేయండి.
  15. రెండు గ్లాసుల నీరు పోసుకుని చికెన్ ముక్కలు విరగకుండా జాగ్రత్తగా కలుపుకుని మూత పెట్టేయండి.
  16. చికెన్ ఉడికిందని కన్ఫామ్ చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ ముక్కలను వేసి మళ్లీ ఒకసారి కలిపి మూత పెట్టేయండి.
  17. అలా ఓ ఐదు నిమిషాలలో క్యాప్సికమ్ ముక్కలు కూడా ఉడికిపోయిన తర్వాత చివరిగా కొత్తిమీర చల్లుకుని మూతపెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి.
  18. అంతే, వేడివేడిగా మీ వాళ్లకు క్యాప్సికమ్ చికెన్ కర్రీ సర్వ్ చేసి కాంప్లిమెంట్‌లు కొట్టేయండి.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం