Sunday Motivation : మంచిదో.. చెడ్డదో.. మీరు అనుకున్నదే చేయండి.. కనీసం తృప్తి అయినా మిగులుతుంది..-sunday motivation when writing the story of your life don t let anyone else hold the pen ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Sunday Motivation When Writing The Story Of Your Life, Don't Let Anyone Else Hold The Pen.

Sunday Motivation : మంచిదో.. చెడ్డదో.. మీరు అనుకున్నదే చేయండి.. కనీసం తృప్తి అయినా మిగులుతుంది..

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 25, 2022 06:00 AM IST

Sunday Motivation : మీ జీవితం గురించి మీకు తప్పా ఇంకెవరికి తెలియదు. మీరు ఏమి అనుకుంటున్నారు.. మీకు ఏమి కావాలి.. మీకు ఏమి నచ్చుతుంది.. మీకు ఏది అవసరం.. ఇలాంటి అన్ని విషయాలు మీకు తప్పా ఎవరికి తెలియదు. కాబట్టి.. మీ జీవితం గురించి కథ రాసేటప్పుడు లేదా.. మీ డైరీ రాసుకునేటప్పుడు.. మీ పెన్ వేరే వాళ్లు పట్టుకోకుండా చూసుకోండి. మీకు నచ్చినది మీరు మాత్రమే రాసుకోండి.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Sunday Motivation : జీవితం చాలా విలువైనది. అలాంటి జీవితాన్ని పక్కన వాళ్ల చేతిలలో పెట్టకండి. మీ జీవితం గురించి మీరు రాసుకుంటున్నప్పుడు.. లేదా మీకు నచ్చిన పని చేస్తున్నప్పుడు.. లేదా నచ్చినది రాసుకుంటున్నప్పుడు.. ఆ పెన్ వేరే వాళ్ల చేతికి ఇవ్వకండి. ఎందుకంటే మీ గురించి మీకు తెలుసినట్టుగా ఇంకెవరికి తెలియదు కదా. ఒకవేళ వేరే వాళ్లు రాస్తే.. వాళ్లకి తెలిసిందే రాస్తారు. తెలుసుకుని రాసినా.. మీకు జరిగింది వాళ్లు రాస్తారనే గ్యారంటీ లేదు. కాబట్టి మీ గురించి మీరే రాసుకోండి.

మీ జీవితం గురించిన నిర్ణయాలు మీరే తీసుకోండి. మీకు ఏమి కావాలో తెలిసినప్పుడు.. మీకు నచ్చిన నిర్ణయం తీసుకునే రైట్ మీకు ఉంది. అవతలి వాళ్లు ఫీల్ అవుతారనో.. లేదా మొహమాటం కొద్దో వారికి మీ జీవితం మీద అధికారం ఇవ్వకండి. వాళ్లు మీకు ఎంత కావాల్సిన వాళ్లు అయినా.. వాళ్లు మీకు ఎంత అవసరమైనా.. వాళ్లు మీకు దగ్గరి బంధువులు అయినా.. ఆఖరికి మిమ్మల్ని కన్నవారికైనా మీ తలరాతను రాసే హక్కు ఇవ్వకండి.

మీ జీవితం ఎలా ఉంటే అందంగా ఉంటుందో.. ఏమి చేస్తే మంచిదో మీకన్నా ఇంకెవరికి బాగా తెలియదు. మీకు అది బాగుంటుంది.. ఇది బాగుంటుంది అని వాళ్లు అనుకోవడమే తప్పా.. మీకు అది నచ్చుతుందో లేదో కూడా ఆలోచించకుండా.. అదే మీకు బెటర్ అని ఫిక్స్ అయ్యే వాళ్లు కూడా ఉంటారు. లేదా మీ ఆలోచనలన్నీ తప్పేనని.. మీకు అసలు ఆలోచించడమే రాదని ఫీల్ అయ్యే వాళ్లు ఉంటారు. మీరు చిన్నపిల్లలని.. మీకు అర్థం చేసుకునే, ఆలోచించే సామార్థ్యం లేదని భావిస్తారు. అలాంటి వారు మీ జీవితాన్ని ఏమి బాగు చేస్తారు. బాగు చేస్తున్నాము అనుకుంటారు. కానీ అది మరింత డ్యామేజ్ అవుతుంది తప్పా.. ఇంకేమి కాదు.

కాబట్టి మీకు కావాల్సిన పనిని చేయండి. మీకు నచ్చినదే చేయండి. అది మీకు కరెక్ట్ కాదు అనిపిస్తే ఆపేయండి. తప్పు చేసినా.. దానిని సరిదిద్దుకోండి. లేదా ఆ తప్పునుంచి కొత్త విషయాన్ని నేర్చుకోండి. కానీ ఏది చేసినా మీరు మాత్రమే చేయండి. మీ జుట్టును వేరే వాళ్ల చేతిలో పెట్టి.. నేను ముందుకు వెళ్లట్లేదే అని బాధపడే బదులు.. గుండు గీసుకుని అయినా.. ముందుకు వెళ్లడం నేర్చుకోండి. మీ జీవితం నాశనం అయినా పర్లేదు. అది మీ చేతుల్లోనే నాశనం అయితే.. మీకు ఒక తృప్తి ఉంటుంది. ఇతరుల చేతుల్లో మీ జీవితం నాశనమైపోవడం కంటే.. మీరే దానిని చేజేతులా పాడుచేసుకున్నా.. మనసుకు నచ్చిందే చేశామనే తృప్తి ఉంటుంది. ఇతరుల సలహాలు తీసుకోండి. కానీ మీకు నచ్చినదే.. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్