Sunday Motivation : సమయాన్ని నువ్వు సరిగా వాడుకోకపోతే.. ఆ తర్వాత అది నీతో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది
Sunday Motivation : చాలా మంది అనవసరమైన విషయాలకు స్పందిస్తారు. ఆ విషయం గురించే ఆలోచిస్తారు. నిజానికి చెడు విషయంలో ఎలాంటి లాభం ఉండదు. సమయం వృథా అవ్వడం మాత్రమే ఉంటుంది.
ఎక్కడో ఏదో జరుగుతుంది. ఆ విషయం గురించి మీకు అవసరం లేదు. కానీ ఎవరో వచ్చి చెప్తారు. ఆ విషయాన్నే పట్టుకుని ఉంటారు. దాని గురించే ఆలోచిస్తారు. అలాంటి విషయంతో మీకు ఎలాంటి లాభం ఉండదు. సమయం మాత్రమే వృథా అవుతుంది. అందుకే చెడు విషయాలను వినకపోవడమే మంచిది. మీకు ఉపయోగంలేని విషయం గురించి ఆలోచిస్తే.. మీకు సమయం వృథా. ఓ చిన్న స్టోరీ చదవండి..
ఒక ఊర్లో ఓ గురువు తన శిష్యులతో కలిసి ఒక ఆశ్రమంలో నివసించేవాడు. అప్పుడు మాస్టారుని చూడడానికి ఒక వ్యక్తి వస్తాడు. గురువుతో మాట్లాడుతాడు. గురువు గారూ మీ శిష్యుని గురించి ఒక విషయ చెప్పాలని అంటాడు. అతడిని చూసి.. ముందు నేను అడుగుతున్న మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పు అని గురువు ఎదురు ప్రశ్నిస్తాడు.
అతను కూడా సరే అడగండి అంటాడు. అప్పుడు గురువు అతనిని అడిగిన మొదటి ప్రశ్న
నువ్వు చెబుతున్నది ఇంతకు ముందు నీకు జరిగిందా? అని అడిగాడు గురువు. దానికి అతను "లేదు" అన్నాడు.
రెండవ ప్రశ్న నువ్వు చెప్పబోయేది మంచిదా చెడ్డదా? అని అడిగాడు. అతను 'చెడు' అని బదులిచ్చాడు.
మూడో ప్రశ్న.. నువ్వు చెప్పేది విని నాకు లాభమా, నష్టమా? అని గురువు అడుగుతాడు. 'అలాంటిదేమీ లేదు మాస్టారు' అని వచ్చిన వ్యక్తి సమాధానమిస్తాడు.
అప్పుడు గురువు అతనితో ఇలా అంటాడు.. 'నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో నాకు తెలియదు, నేను వినకపోతే నాకు నష్టం లేదు, నువు చెప్పబోయేది ఇంకేదో చెడ్డది, కాబట్టి నేను ఎందుకు వినాలి?' అని వచ్చిన వ్యక్తిని వెనక్కి పంపాడు.
చాలామంది ఇలానే.. ఎవరైనా ఏదైనా చెబితే.. వినేస్తారు. అయితే విని వదిలేస్తే.. పర్లేదు. కానీ ఆ విషయం గురించే ఆలోచిస్తారు. ఈ కారణంగా మీ సమయం వృథా అవ్వడం తప్ప వేరే ప్రయోజనం ఏమీ ఉండదు. సమయం వృథా అయితే అన్ని విధాలుగా మీరే నష్టపోతారు. అనవసరమైన ఆలోచలను వస్తాయి. అవసరం లేని విషయం గురించి ఎక్కువసేపు ఆలోచిస్తారు. ఎవరైనా ఏదైనా చెబితే.. మీకు లాభం ఉంటేనే ఆ విషయాన్ని స్వీకరించండి. లేదంటే వదిలేయడమే మంచిది.
ఏ విషయం గురించైనా ఆలోచించే ముందు.. నిన్ను నువ్వు ప్రశ్నించుకో..
నువ్వు ఆలోచించేది మంచా.. చెడా అనే సమాధానం తప్పక వస్తుంది..
మంచి అనిపిస్తే.. ఆలోచించు.. చెండు అనిపిస్తే ఆపేయి..!
సమయాన్ని నువ్వు సరిగా వాడుకోకపోతే.. ఆ తర్వాత అది నితో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది..!