Sunday Motivation : మీరు ప్రయత్నించి ఓడిపోయారా? అయితే కంగ్రాట్స్..-sunday motivation on if you try and fail congratulations most people wont even try ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Sunday Motivation On If You Try And Fail, Congratulations. Most People Wont Even Try.

Sunday Motivation : మీరు ప్రయత్నించి ఓడిపోయారా? అయితే కంగ్రాట్స్..

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 08, 2023 06:30 AM IST

Sunday Motivation : మీరు ఏదైనా ప్రయత్నించి ఓడిపోయారా? అయితే కంగ్రాట్స్. ఇది మీరు ఓడిపోయినందుకు కాదు. ప్రయత్నించినందుకు. కనీసం కొందరు ప్రయత్నించకుండానే ఓటమిని అంగీకరిస్తున్నారు. వారితో పోలిస్తే.. మీరు చాలా గ్రేట్.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Sunday Motivation : ఈ రోజుల్లో చాలా మంది తమ కలలను కనీసం ప్రయత్నించకుండానే వదిలేసుకుంటున్నారు. ఏమిరా అంటే.. హా పర్లేదులే. ఈ జీవితమే బాగుంది. మళ్లీ కొత్తగా ట్రై చేస్తే.. ఫలితం అనుకూలంగా రాకుంటే.. ఇప్పుడున్న లైఫ్ కూడా పాడైతే అని ఏవేవో అనుకుంటూ.. కనీసం ప్రయత్నం కూడా చేయట్లేదు. మనం ట్రై చేయలేదు కదా దానర్థం గెలవలేదు.. ఓడలేదు అనుకుంటున్నారు. కానీ అసలైన గెలుపు అంటే ఏమిటో తెలుసా? మనం బరిలోకి దిగడమే అసలైన గెలుపు. ఆ తర్వాత గెలిచినా.. ఓడినా అది మన విజయమే.

ఎందుకంటే గెలుపు అనేది మరింత ఆనందాన్ని ఇస్తాది కానీ.. మన బరిలోకి దిగడమే నిజమైన గెలుపు. మన ప్రత్యర్థికి గట్టి పోటినిచ్చి ఓడిపోయినా చాలు. ఎందుకంటే గెలిచిన వ్యక్తి కూడా ఒక్కసారైనా నీ చేతిలో ఓడిపోతున్నానేమో అని కచ్చితంగా భయంతోనే నీ కంటే మెరుగ్గా ప్రదర్శన ఇచ్చి ఉంటాడు కాబట్టి. అదే నీ నిజమైన గెలుపు. అసలు బరిలోకి దిగకుండా.. మనతోని కాదు అనుకోవడం లేదా నేను వెళ్లి ఉంటేనా అనుకోవడం చాలా తేలిక. పెవిలియన్​లోకి వెళ్లలేని వాడికి ఎప్పుడూ గేమ్​ గురించి.. ప్లేయర్​ల గురించి చర్చించే హక్కు లేదు.

మీరు ఎప్పుడైనా ప్రయత్నించి ఓడిపోయారనుకోండి మీరేమి బాధపడకండి. మీరు చాలా మందికంటే స్ట్రాంగ్. ఎందుకంటే.. కొందరు అర్హత ఉన్నా పోటీల్లో పాల్గొనరు. ఎందుకంటే వాళ్లకి ఎలాంటి ధైర్యం లేదు కాబట్టే.. ఏవేవో సాకులు చెప్తూ.. గేమ్ బయటే ఉండిపోతారు. కానీ మీకు ధైర్యం ఉంది కాబట్టే.. బరిలోకి దిగారు. మీరు ఇవ్వగలిగినంత ఎఫర్ట్స్ పెట్టారు. రిజల్ట్ సంగతి పక్కన పెడితే మీ అడ్డంకులను అధిగమించి బరిలోకి దిగారు. ఏమో ఈరోజు మీరు విజయాన్ని సాధించలేకపోవచ్చు. కానీ రేపు కచ్చితంగా విజయం మీదే అవుతుంది.

జీవితంలో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా కావాలన్నా.. లేదా సాధించాలన్నా.. మీరు ధైర్యంతో అడుగు ముందుకు వేయండి. రిజల్ట్ ఎలా ఉన్నా పర్లేదు. ధైర్యంగా అడుగు ముందుకు వేయడమే నిజమైన సక్సెస్. ఒక్కసారి మీరు తెగించారు అంటే.. మీ జీవితం మీకు నచ్చేట్లు మారడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీరు ఓడిపోయినా ఎండ్ ఆఫ్ ద డే మీరు సంతృప్తిని పొందుతారు. రేపటికి మరింత ఉత్సాహంతో ఎదురు చూస్తారు. ఎందుకంటే రేపు కూడా మీరు ప్రయత్నిస్తారు. గెలిచే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎన్నో సార్లు ఓడిపోయినా పర్లేదు కానీ.. ఎప్పుడూ మాత్రం మీ గేమ్ ఆపకండి. అదే మీకు అతి పెద్ద ప్లస్ అవుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం