Sunday Motivation : బుద్ధుడి 5 ఆలోచనలు.. మీ జీవితాన్ని మార్చడంలో సహాయపడతాయి-sunday motivation life changing motivational quotes thoughts on life love happiness peace in telugu buddha quotes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Sunday Motivation Life Changing Motivational Quotes Thoughts On Life Love Happiness Peace In Telugu Buddha Quotes

Sunday Motivation : బుద్ధుడి 5 ఆలోచనలు.. మీ జీవితాన్ని మార్చడంలో సహాయపడతాయి

HT Telugu Desk HT Telugu
Sep 03, 2023 05:00 AM IST

Sunday Motivation : ఎందరో రాజులు బుద్ధుని మాటలు విని మనసు మార్చుకుని ఎన్నో మంచి పనులు చేశారని చరిత్ర చెబుతోంది. బుద్ధుడి చెప్పిన విషయాలు ఫాలో అయి గొప్పవాళ్లైన వారూ ఉన్నారు. బుద్ధుడి మాటలు.. జీవితంలో విజయం, శాంతిని సాధించిన అనేక ఉదాహరణలు ఉన్నాయి.

బుద్ధుడి ఆలోచనలు
బుద్ధుడి ఆలోచనలు (unsplash)

చరిత్ర, పురాతన కథలు, సాహిత్యం మొదలగునవి.. ఎన్నో విషయాలను చెబుతాయి. ఎలా జీవించాలి? మనసులో ఎలాంటి ఆలోచనలు కనపడతాయి వంటి అనేక తత్వాలను వివరిస్తాయి. పూర్వ కాలంలో జీవించిన అనేక మంది పండితులు, ఋషులు, కవులు ఎలా విజయం సాధించాలి, ఆలోచనలను ఎలా ఏకాగ్రత చేసుకోవాలి వంటి వాటి గురించి భవిష్యత్ తరాల కోసం చెప్పారు. వారిలో ముఖ్యమైన వ్యక్తి బుద్ధుడు.

ట్రెండింగ్ వార్తలు

ఎందరో రాజులు బుద్ధుని మాటలు విని మనసు మార్చుకుని ఎన్నో మంచి పనులు చేశారని చరిత్ర చెబుతోంది. గౌతమ బుద్ధుడు అందించిన కొన్ని జీవిత తత్వాలను మన జీవితంలో పాటిస్తే, విజయానికి మార్గాన్ని స్పష్టంగా చూపుతుంది. తద్వారా జీవితంలో శాంతి, ప్రశాంతత పెరుగుతుంది. బుద్ధుడు చాలా విషయాలను చెప్పాడు. అందులో కొన్ని ఆలోచనలు చూద్దాం..

మీ కోపానికి ఎవరూ శిక్షించబడరు. మీ కోపానికి మీరే శిక్షించబడతారు. అందుకే జీవితంలో కోపగించుకోకుండా కూల్ గా బతకడానికి ప్రయత్నించండి.

మీరు చేసే పనిలో ప్రతిదీ పరిపూర్ణంగా ఉందని మీరు గ్రహించినప్పుడు మీరు మీ తల వెనుకకు వంచి ఆకాశం వైపు చూస్తూ నవ్వుతారు. ఎందుకుంటే నిన్ను ఎవరూ ఆపలేరు. మీ లక్ష్యం ఏమిటో సరిగా గ్రహించండి.

మీరు విశ్వంలోని ఎవరి ప్రేమకైనా అర్హులు. మీ ప్రేమకు కూడా అందరూ అర్హులే. మీ హృదయంలో ఈ విశ్వం పట్ల ప్రేమ ఉండాలి. ఇతర విషయాల పట్ల ప్రేమ, ఆప్యాయత ఉండాలి. అలా జరిగితే, మీరు ఈ భూమి యొక్క అందాన్ని పూర్తిగా అనుభవించగలుగుతారు. ప్రతి ఒక్కరినీ, ప్రతిదానిని ప్రేమించండి.

మూడు విషయాలు చాలా కాలం దాచబడవు.. సూర్యుడు, చంద్రుడు, నిజం. మీరు దేనినైనా దాచవచ్చు కానీ నిజాన్ని దాచడం అసాధ్యం. సత్యం సూర్యచంద్రుల వంటిది.. నాశనం చేయలేనిది. జీవితంలో సత్యానికి కట్టుబడి ఉండటానికి ప్రయత్నించండి. నిజం చెప్పడానికి ప్రయత్నించండి!

పగతో కూడిన ఆలోచనలు లేని వారు కచ్చితంగా శాంతిని పొందుతారు. మీ ఆలోచనలు ఉన్నతంగా ఉంటే మీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీరు శాంతి, ప్రశాంతతతో నిండిన జీవితాన్ని కలిగి ఉంటారు. కోపంతో చూడటం కాకుండా.. ప్రేమతో చూడాలనే సూత్రానికి కట్టుబడి ప్రయత్నించండి. ఈ విశ్వమంతా ప్రేమ మీ సొంతమవుతుంది.

WhatsApp channel