Sunday Motivation : మిమ్మల్ని మీరు నమ్మకపోతే.. ఇంకెవరు నమ్ముతారు?
Self Doubt : స్వీయ అనుమానం మానసికంగా కుంగిపోవడంతో పాటు, నరకంలాంటి ఆలోచనలను మనలోకి నింపుతుంది. కొన్ని మార్పుల ద్వారా ఈ స్వీయ అనుమానాన్ని దూరం చేయవచ్చు. మనల్ని మనం నమ్మాలి.
నాతో ఈ పని కాదు.. నేను ఏం చేసినా సక్సెస్ కాదు.. ఇవే ఆలోచనలు కొంతమందికి. వీటితోనే జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఈ పనిని నేను చేస్తానా లేదా అనే అనుమానాలే ఉంటాయి. సెల్ఫ్ డౌట్ అనేది ఓ నరకంలాంటిది. ఈ స్వీయ అనుమానాన్ని తగ్గించేందుకు చాలా కష్టపడాలి. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. మనం మనపై స్వీయ అనుమానాన్ని తగ్గించుకోవాలి.
ట్రెండింగ్ వార్తలు
మీపై ఏ సందర్భంలో మీరు అనుమాన పడతారో.., ఆ అనుమానిత మూలాన్ని గుర్తించండి. ఇలా చేయడం వల్ల అనుమానం నుండి బయటపడవచ్చు. స్వీయ అనుమానం ప్రధాన కారణాలలో అనవసరమైన చర్చలు ఒకటి. మీ గురించి మీరు తక్కువగా మాట్లాడుకోవడం చేయోద్దు. అది మీకు మీరు తక్కువ అయిపోతారు. ఈ ప్రతికూల ఆలోచనలు మనస్ఫూర్తిగా ఆలోచించకుండా చేస్తాయి. వాస్తవంగా జీవించండి.
మీ సామర్థ్యం, పనితీరు మీద మీకు నమ్మకం ఉండాలి. అలాగే మీరు స్వీయ అనుమానాన్ని అనుభవించినపుడు ఆ సామర్థ్యం గురించి ఆలోచించండి. ఇది మీ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, మీ విశ్వాసం పెరగడానికి సహాయం చేస్తుంది.
మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని చూసుకోవడం ద్వారా స్వీయ అనుమానాన్ని తగ్గించడానికి సహాయం చేస్తుంది. తగినంత విశ్రాంతి పొందండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించండి. అలాగే ధ్యానం, వ్యాయామాలు చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మీ స్వీయ అనుమానం గురించి దగ్గరి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడం ద్వారా మీ సమస్య పరిష్కరించబడుతుంది.
గెలుస్తామనే నమ్మకం లేనివారూ.., ఓడిపోతామనే అనుమానం ఉన్నవారు.., తప్పక పరాజయం పాలవుతారు..