చలికాలంలో చల్లటి వాతావరణం కారణంగా ప్రతి ఒక్కరూ వెచ్చదనాన్ని ఆస్వాదించాలనుకుంటారు. ఇందుకోసం ఎండ ఎక్కడుంటే అక్కడ ఎక్కువ సమయాన్ని గడుపుతుంటారు. నిజానికి చలికాలంలో ఎండలో కూర్చోడం ఆరోగ్యానికి చాలా మంచిది. మంచి ఎండ శరీరానికి వెచ్చదనాన్ని ఇవ్వడమే కాకుండా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మరింత వివరంగా తెలుసుకుందాం.
ఆరోగ్యానికి ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఎండలో కూర్చునే సరైన పద్ధతి తెలియకపోతే, ఇది ప్రయోజనాలకు బదులుగా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఎండలో కూర్చునేటప్పుడు దాని ప్రయోజనాలను పొందడానికి ఏ తప్పులను నివారించాలో తెలుసుకుందాం.
చలికాలంలో ప్రజలు శరీర వెచ్చదనాన్ని కాపాడుకోవడానికి గంటల తరబడి ఇంటి ముందు లేదా పార్కులో ఎక్కువ సేపు ఎండలోనే కూర్చుంటారు. ఇది ఎక్కువ మంది చేస్తున్న పొరపాటు. ఎందుకంటే ఎండలో కూర్చోవడం మంచిదే అయినప్పటికీ ఎక్కువ సమయం కూర్చోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల చర్మం కాలిపోయి ఎర్రగా మారుతుంది, పొడి బారుతుంది. ఫలితంగా దురద, సన్ బర్న్ వంటి సమస్యలు వస్తాయి.
సూర్యుని UV కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి, చర్మానికి రక్షణగా ఎల్లప్పుడూ సన్‌స్క్రీన్ రాసుకోవాలి. సన్‌స్క్రీన్ రాసుకోవడం వల్ల చర్మాన్ని సన్ బర్న్, చర్మ క్యాన్సర్ నుండి రక్షించుకోవచ్చు. అలా చేయకపోతే, సూర్యుని అతినీలలోహిత కిరణాలు చర్మంలోని కొల్లాజెన్‌ను విచ్ఛిన్నం చేసి, ముడతలు, గోధుమ రంగు మచ్చలు వంటి అనేక రకాల చర్మ సమస్యలను కలిగిస్తాయి.
సూర్యకిరణాలు శరీరం మీద పడటం మానసిక, శారీరక, చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ ఇది కొంత సమయం వరకూ మాత్రమే. నిర్ణీత సమయం దాాటిందంటే సూర్య కిరణాలు మేలు కన్నా ఎక్కువ హని చేస్తాయని గుర్తుంచుకోవాలి. ఏ కాలంలో అయినా ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య కిరణాలు మాత్రమే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తర్వాత ఎండలో కూర్చోవడం వల్ల ఫలితాల కన్నా నష్టాలే కలుగుతాయి. చర్మం, కళ్లు దెబ్బతింటారు. ముఖ్యంగా చలికాలంలో చలికాలంలో ఉదయం 8 నుండి 10 గంటల మధ్య ఎండలో కూర్చోవడం ఉత్తమం. ఈ సమయంలో ఎండ తక్కువగా ఉండి చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
ఎండలో కూర్చోవడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య వస్తుంది, కాబట్టి ఎండలో కూర్చోవడానికి ముందు, తర్వాత కచ్చితంగా నీరు తాగాలి. రోజంతా ఎక్కువ నీరు తాగుతూ ఉండాలి.
సూర్యుడి నుంచి వచ్చే ప్రకాశవంతమైన కాంతి కళ్ళకు హాని కలిగిస్తుంది. కాబట్టి, ఎండలో కూర్చునేటప్పుడు మీ కళ్ళను రక్షించుకోవడానికి సన్ గ్లాసెస్ ధరించండి.
సూర్య కిరణాల వల్ల కలిగే చర్మ సమస్యల నుంచి తప్పించుకోవాలంటే వీలైనంత వరకూ నిండుగా ఉండే బట్టలు వేసుకోవాలి. పొడవాటి చేతులు, మెడను కప్పేసేలా కాలర్, కాళ్లను కప్పేసేలా ప్యాంటు ధరించి ఎండలో కూర్చోవడం మంచిది.
సంబంధిత కథనం