Healthy Diet | గ్లూటన్​ ఫ్రీ హెల్తీ బ్రేక్​ ఫాస్ట్.. సమ్మర్​లో బెస్ట్​ ఇదే..-summer special gluten free healthy breakfast for weightloss ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Summer Special Gluten Free Healthy Breakfast For Weightloss

Healthy Diet | గ్లూటన్​ ఫ్రీ హెల్తీ బ్రేక్​ ఫాస్ట్.. సమ్మర్​లో బెస్ట్​ ఇదే..

HT Telugu Desk HT Telugu
May 06, 2022 09:16 AM IST

ఉదయం లేవగానే కాస్త బద్దకంగా ఉంటుంది. ఈ సమయంలో త్వరగా చేసుకునే బ్రేక్​ఫాస్ట్​ ఉంటే మనసుకు హాయిగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు రెండు నిమిషాల పని.. ఉదయం ఓ మూడు నిమిషాల పనితో హెల్తీ బ్రేక్​ఫాస్ట్​ రెడీ అంటే మీరు నమ్ముతారా? పైగా అది బరువును అదుపులో ఉంచే.. గ్లూటన్​ ఫ్రీ బ్రేక్​ఫాస్ట్​ అంటే అసలు వదులుతారా? అయితే ఈ రెసిపీ మీకోసమే.

హెల్తీ బ్రేక్ ఫాస్ట్
హెల్తీ బ్రేక్ ఫాస్ట్

Breakfast For Summer | ఈ మధ్య అందరూ హెల్తీగా ఉండేందుకు శ్రద్ధ తీసుకుంటున్నారు. నేచురల్​గా బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో డైట్​ చాలా ముఖ్యం. ఎంత వ్యాయామాలు చేసినా.. డైట్​ వల్లనే బరువు అదుపులో ఉంటుంది. అలాంటప్పుడు బరువును అదుపులో ఉంచే హెల్తీ బ్రేక్​ఫాస్ట్ తీసుకోవడంలో తప్పేముంది. ఇప్పుడు మీరు తెలుసుకునే బ్రేక్​ఫాస్ట్​ సమ్మర్​లో తీసుకుంటే మరీ మంచిది.

కావాల్సిన పదార్థాలు

* పెరుగు - 100 గ్రాములు

* చియా సీడ్స్ - 5 గ్రాములు

* టొమాటో - 1 చిన్నది

* కీరాదోస - 4 టేబుల్ స్పూన్స్ (ముక్కలు)

* ఉప్పు - తగినంత

* పచ్చిమిర్చి - చిన్నవి రెండు (ముక్కలు చేసుకోవాలి)

* జీలకర్ర పొడి- అర టీస్పూన్

* బాదం - 6 (నానబెట్టినవి)

* కొత్తిమీర - తగినంత

* వేయించిన పల్లీలు - 10 గ్రాములు

తయారీ విధానం

ఓ గిన్నెలో పెరుగుతీసుకుని.. బాగా కలపాలి. దానిలో ఓట్స్, చియా సీడ్స్ వేసి కలిపి మూత పెట్టాలి. ఆ మిశ్రమాన్ని రాత్రంతా ఫ్రిజ్​లో నాననివ్వాలి. ఉదయాన్నే దాని బయటకు తీసి.. కీరదోస, కొత్తిమీర, టమాట, సాల్ట్, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, వేయించిన పల్లీలు, బాదం వేసి బాగా కలపాలి. అంతే మీ హెల్తీ బ్రేక్​ఫాస్ట్ రెడీ.

దీనిలో మొత్తం 240 క్యాలరీలు ఉంటాయి. ప్రొటీన్ 12.4 గ్రాములు, ఫైబర్ 6.5 గ్రాములు, ఫ్యాట్ (మంచివి) 8.6 గ్రాములు, కార్బ్స్ 29 గ్రాములు ఉంటాయి. కాబట్టి దీనిని మీ డైట్​లో ఈజీగా చేర్చుకోవచ్చు. దీనిని బ్రేక్​ఫాస్ట్​గా లేదా బ్రంచ్​గా లేదా స్నాక్​గా తీసుకోవచ్చు. ముఖ్యంగా సమ్మర్​లో దీనిని తీసుకోవడం వల్ల శరీరం వేసవి వేడిని తగ్గిస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్