సమ్మర్లో మనకు ఎక్కువగా దొరికేది మామిడిపండ్లు. స్మూతీ చేసుకోవడానికి ఇబ్బందేం లేదు. కానీ, ఉదయాన్నే అది కూడా బ్రేక్‌ఫాస్ట్‌కు బదులుగా మామిడిపండు తింటే ఏమైనా అవుతుందేమోననే ఆలోచన అక్కర్లేదు. ఎందుకంటే ఈ స్మూతీలో కేవలం మామిడిపండు మాత్రమే కాదు, ఇతర పదార్థాలు కూడా కలిపి తయారుచేస్తారు. కాబట్టి టేస్ట్ తో పాటు హెల్త్ కూడా మీ సొంతమవుతుంది. ఇక లేటెందుకు సమ్మర్లో మాత్రమే దొరికే మామిడిపండ్లతో చక్కటి స్మూతీ తయారుచేసుకుని రోజును మొదలుపెట్టేయండి.
రుచికరమైన, ఆరోగ్యకరమైన మ్యాంగో బెర్రీ స్మూతీ రెసిపీ. వేసవిని రిఫ్రెషింగ్గా మార్చేసే స్మూతీ ఇది. పైగా, ఇది తయారు చేయడం కూడా చాలా సులువు.
ఈ స్మూతీలో కేవలం మామిడిపండు మాత్రమే ఉండదు. ఇతర పదార్థాలు కూడా కలిసి ఉండటం వల్ల మామిడిపండు తీసుకుంటే విరేచనాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
పుష్కలంగా పోషకాలు: మామిడిపండులో విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. బెర్రీలలో కూడా యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటాయి. పెరుగులో ప్రోటీన్, కాల్షియం ఉంటాయి. వీటి కాంబినేషన్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తుంది.
శక్తి స్థాయిలు: మామిడిపండులో ఉండే సహజ చక్కెరలు, ఇతర పోషకాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఉదయం పూట తీసుకోవడానికి ఇది ఒక మంచి ఎంపిక.
జీర్ణక్రియ: పెరుగులోని ప్రోబయోటిక్స్, పండ్లలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
రోగనిరోధక శక్తి: విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
చర్మానికి మంచిది: విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
సంబంధిత కథనం