Summer Skin Care: ఎండలోనే ఆఫీసుకు వెళుతున్నారా? చర్మం పాడవకుండా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించండి!-summer skin care tips what should office going women do to protect their skin in summer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Summer Skin Care: ఎండలోనే ఆఫీసుకు వెళుతున్నారా? చర్మం పాడవకుండా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించండి!

Summer Skin Care: ఎండలోనే ఆఫీసుకు వెళుతున్నారా? చర్మం పాడవకుండా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించండి!

Ramya Sri Marka HT Telugu

Summer Skin Care: వేసవిలో రోజూ ఆఫీసుకు వెళ్ళే మహిళలకు చర్మం దెబ్బతినే అవకాశం ఎక్కువ. ఈ సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల సూర్యరశ్మి తగిలిన మేర చర్మం నిర్జీవంగా మారిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే, ఇక్కడ సూచించిన చిట్కాలు పాటించండి.

ఆఫీసుకు వెళ్ళే మహిళలు వేసవిలో చర్మాన్ని కాపాడుకోవడం ఎలా

వేసవి వచ్చిందంటే చర్మం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎండ వేడి కారణంగా వేసవిలో చర్మం సహజం కాంతిని కోల్పోతుంది. వాతావరణ మార్పుల కారణంగా చెమట ఎక్కువగా పట్టడంతో ఒంటి మీద మలినాలు పేరుకుపోయి చర్మ సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా రోజూ ఎండలో బయటికి వెళ్లే వారు, ఉదయం ఆఫీసుకు వెళ్ళే మహిళల్లో ఈ ఇవి కాస్త ఎక్కువగానే కనిపిస్తుంటాయి.

సూర్యుడి నుంచి విడుదలయ్యే యూవీ కిరణాల కారణంగా చాలా మందికి మహిళలకు చర్మం టాన్ అయిపోతుంది. ఎండ కారణంగా వచ్చే చెమటతో పాటు ప్రయాణ సమయలంలో కాలుష్యం, దుమ్ము, ధూళి వంటివన్నీ కలిసి చర్మాన్ని పూర్తిగా దెబ్బ తీస్తాయి. ఫలితంగా మొటిమలు, చిన్న చిన్న పొక్కులు, దద్దుర్లు, దురద వంటి అనేక రకాల చర్మ సమస్యలు వస్తాయి. వీటన్నింటి నుంచి తప్పించుకోవాలంటే వేసవి కాలంలో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..

ఎండలో ఆఫీసులకు వెళ్లే మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

1) ఎక్స్‌ఫోలియేట్ చేయండి

వేసవిలో చర్మం ఆరోగ్యంగా ఉండటానికి, ఎండ కారణంగా వచ్చే చర్మపు మంట లేదా సన్‌బర్న్‌ వంటి వాటిని నయం చేయడానికి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడం చాలా అవసరం. చర్మంపై ఉండే మృతకణాలను, ధూళి, నూనె వంటి ఇతర మలినాలను తొలగించడాన్ని ఎక్స్‌ఫోలియేషన్ అంటారు. ఎక్స్ ఫోలియేషన్ ప్రకియ తర్వాత చర్మం చాలా ఆరోగ్యంగా, మెరుస్తూ కనిపిస్తుంది.మృదుత్వం పెరుగుతుంది. మొటిమలు, నల్లటి మచ్చలు కూడా తగ్గుతాయి. అలా అని రోజూ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడం కూడా చర్మాన్ని దెబ్బతీస్తుంది. వారానికి ఒకసారి చేయడం సరైనది.

2) సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడండి

సూర్యుడి కిరణాల ద్వారా విడుదలయ్యే అధిక UV ఎక్స్‌పోజర్ మీ చర్మానికి హాని కలిగిస్తుంది. ఫలితంగా సన్‌బర్న్, ముడతలు, చిన్న చిన్న గీతలతో పాటు వృద్ధాప్య లక్షణాలు పెరుగుతాయి. వీటి నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి SPF 30 ఉన్న UV స్పెక్ట్రమ్ ఉన్న సన్‌బ్లాక్ లేదా సన్‌స్క్రీన్ ఉపయెగించండి. ఇంటి నుండి బయటకు వెళ్ళే బయటకు కనిపించే చర్మం మొత్తానికి దీన్ని అప్లై చేసుకుని వెళ్లండి.

3) మేకప్ తగ్గించండి

వేసవి నెలల్లో మేకప్ తగ్గించండి. వీలైనంత వరకూ మేకప్ కు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎండాకాలంలో మీ చర్మానికి గాలి ఎక్కువ అవసరం అవుతుంది. మేకప్ చర్మానికి గాలి తగలకుండా అడ్డుకుంటుంది. కాబట్టి వాతావరణం చాలా వేడిగా ఉన్నప్పుడు మేకప్ వేయకండి. వేయాల్సి వచ్చినప్పుడు మినరల్-ఆధారిత మేకప్ వేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ ఉత్పత్తులు తేలికైనవి. మీరు ఫౌండేషన్ వేయడానికి ఇష్టపడితే దాని స్థానంలో SPF ఉన్న టింటెడ్ మాయిశ్చరైజర్ వేసుకోండి. దాని మీద ఫేస్ పౌడర్ వేసుకోవచ్చు.

4) కూలింగ్ మిస్ట్ వాడండి

వేడి, తేమతో కూడిన వేసవి రోజుల్లో చర్మాన్ని కాపాడుకునేందుకు కూలింగ్ మిస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది సన్‌బర్న్, చర్మపు వాపు వంటి సమస్యలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. అంతేకాదు కూలింగ్ మిస్ట్ మీ చర్మాన్ని తాజాగా, మెరుస్తూ ఉంచుతుంది. మీరూ ఎండలో ఆఫీసులకు వెళుతున్నట్లయితే దీన్ని తప్పకుండా ఉపయోగించండి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం