స్కిన్ ట్యాన్‌ను సహజంగా తొలగించుకోవాలా? అయితే ఓట్ మీల్ స్క్రబ్ ట్రై చేయండి! బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది!-summer skin care tips want to remove skin tan naturally then try this oatmeal scrub ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  స్కిన్ ట్యాన్‌ను సహజంగా తొలగించుకోవాలా? అయితే ఓట్ మీల్ స్క్రబ్ ట్రై చేయండి! బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది!

స్కిన్ ట్యాన్‌ను సహజంగా తొలగించుకోవాలా? అయితే ఓట్ మీల్ స్క్రబ్ ట్రై చేయండి! బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది!

Ramya Sri Marka HT Telugu

వేసవిలో చర్మం ట్యాన్ అవకుండా కాపాడుకోవాలంటే ఓట్ మీల్ స్క్రబ్ ను తయారు చేసుకోండి. ఎండ వేడికి రంగు మారి, నిర్జీవంగా తయారైన మీ చర్మానికి ఇది చక్కటి ఔషధంలా పని చేస్తుంది. ఇంట్లో ఎప్పుడూ ఉండే వస్తువులతోనే దీన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్లై చేసుకోవచ్చు.

వేసవిలో స్కిన్ ట్యాన్ తొలగించడానికి ఓట్ మీల్ స్క్రబ్ ఉపయోగించండి (Unsplash)

ఎండాకాలంలో ఎంత జాగ్రత్త పడ్డా చర్మం ట్యాన్ అవుతూనే ఉంటుంది. సూర్యుడి నుంచి విడుదల అయ్యే హానికరమైన యూవీ కిరణాల కారణంగా చర్మం కాంతిని కోల్పోయి డల్‌గా, నిర్జీవంగా తయారవుతుంది. ఎప్పటికప్పుడు దీన్ని తొలగించకపోతే చర్మం రంగు మారి నల్లగా కనిపిస్తుంది. ఇలా జరగడకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు స్కిన్ ట్యానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా బయట తిరిగే వాళ్లు, పీక్ అవర్స్ అంటే 11నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు ఎండలో సమయాన్ని గడిపినవాళ్లు ఎప్పటికప్పుడు స్కిన్ ట్యాన్ తొలగించుకోవాలి. ఇందుకు మార్కెట్లోకి క్రీములకు బదులుగా సహజమైన పదార్థాలైతే మరింత మంచిది. అలాంటి సహజమైన స్క్రబ్ లలో ఓట్ మీల్ స్క్రబ్ ముందుంటుంది. ఓట్ మీల్ స్క్రబ్ ఎలా తయారు చేయాలి?దీన్ని ఎలా ఉపయోగించాలి తెలుసుకుందాం రండి.

ఓట్ మీల్ స్క్రబ్ తయారీకి కావలసిన పదార్థాలు:

  • 1/2 కప్పు రోల్డ్ ఓట్స్
  • 2 టేబుల్ స్పూన్లు తేనె
  • 2 టేబుల్ స్పూన్లు పెరుగు లేదా పాలు
  • 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్
  • 2-3 చుక్కల లావెండర్ లేదా టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్(ఇది తప్పనిసరి కాదు ఉంటే వేసుకోవచ్చు. లేదంటే లేదు)

ఓట్ మీల్ స్క్రబ్ తయారీ విధానం:

  1. ఓట్ మీల్ స్క్రబ్ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఓట్స్‌ను మిక్సీలో వేసి కాస్త బరకగా గ్రైండ్ చేయండి. ఇది పూర్తిగా మెత్తటి పొడిగా కాకూడదని గుర్తుంచుకోండి. రఫ్ టెక్స్చర్ ఉంటేనే స్క్రబ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది.
  2. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో ఓట్స్ పౌడర్‌, తేనె, పెరుగు (లేదా పాలు), నూనెలను వేసి బాగా కలపండి.అన్నీ బాగా కలిసిపోయి చిక్కటి పేస్ట్ లా తయారయ్యేంత వరకూ దీన్ని కలపాలి.

ఓట్ మీల్ స్క్రబ్ అప్లై చేసే విధానం:

  • ఓట్ మీల్ స్క్రబ్ ను స్నానం చేసే ముందు తేమగా ఉన్న చర్మంపై అప్లై చేసి రౌండ్ మోషన్‌లో మసాజ్ చేయండి. చర్మాన్ని గట్టిగా రుద్దకుండా కాస్త సున్నితంగా మర్దనా చేయండి.
  • మోకాళ్లు, మోచేతులు వంటి రఫ్త్ ఏరియాలపై ఎక్కువగా అప్లై చేయండి.
  • అప్లై చేసిన తర్వాత చర్మంపై దీన్ని 10 నుంచి-10 నిమిషాలు ఉండనివ్వండి (ఐచ్చికంగా). తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగి టవల్ తో సున్నితంగా తుడవడి.
  • స్క్రబ్ చేసిన తర్వాత ముఖం కడుక్కున్న తరవాత మాయిశ్చరైజర్ అప్లై చేయడం మర్చిపోకండి. ఇది స్కిన్ కు కావాలసిన తేమను అందించడానికి చాలా బాగా సహాయపడుతుంది.

ఓట్ మీల్ స్క్రబ్ ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు

1. ఓట్ మీల్ స్క్రబ్ చర్మానికి చక్కటి ఎక్స్‌ఫోలియేషన్ అందిసకతుంది. చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి సహయజంగా మెరిసేలా, మృదువుగా సమతుల్యంగా ఉంచుతుంది.

2. తేనె, పెరుగు (లేదా పాల), కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ వంటి పదార్థాలు చర్మాన్ని లోతుగా తేమగా ఉంచుతాయి.

వేసవిలో సూర్యకిరణల వల్ల ఎండిపోయిన చర్మానికి చక్కటి పరిష్కారంగా పని చేస్తుంది.

3. ఓట్స్‌లో ఉండే శాంతికరమైన గుణాలు చర్మంలోని ఎర్రతనాన్ని, అలర్జీని తగ్గిస్తాయి. సున్నితమైన చర్మం ఉన్నవారికి ఇది చాలా బాగా పని చేస్తుంది.

4. ఓట్స్‌లో ఉండే సాపోనిన్స్ సహజమైన క్లీన్సింగ్ ఏజెంట్స్‌గా పనిచేస్తాయి. ఇవి చర్మాన్ని తేలికగా శుభ్రం చేస్తాయి. ఒత్తిడిని దూరం చేస్తాయి.

5. ఓట్ మీల్ స్క్రబ్ ఉపయోగించడం వల్ల చర్మం pH స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. రెగ్యులర్‌గా వాడితే చర్మం మృదువుగా మారుతుంది, డెడ్ స్కిన్ తొలగిపోతుంది.

7. ఇది 100% సహజమైనది ఎలాంటి కెమికల్స్ లేకుండా మీ చర్మాన్ని ఆరోగ్యంగా ప్రకాశవంతంగా మారుస్తుంది.

ఓట్ మీల్ స్క్రబ్ ను వారానికి 2-3 సార్లు వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం