వేసవిలో మెరిసే చర్మం కోసం పసుపు ఎలా అప్లై చేయాలి? ఈ 3 సులభమైన మార్గాలు తెలుసుకోండి!-summer skin care how to use turmeric for skin in hot summer days ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  వేసవిలో మెరిసే చర్మం కోసం పసుపు ఎలా అప్లై చేయాలి? ఈ 3 సులభమైన మార్గాలు తెలుసుకోండి!

వేసవిలో మెరిసే చర్మం కోసం పసుపు ఎలా అప్లై చేయాలి? ఈ 3 సులభమైన మార్గాలు తెలుసుకోండి!

Ramya Sri Marka HT Telugu

వేసవిలో ఎండ కారణాంగా చర్మం దెబ్బతినకుండా ఉండాలంటే, ఎల్లప్పుడూ మెరిసే చర్మం కావాలంటే పసుపును ఎలా వాడాలో మీకు తెలుసా? సహజమైన, ఆరోగ్యవంతమైన చర్మం కోసం పసుపును 3 రకాలుగా వాడచ్చని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి.

చర్మానికి పసుపును ఇలా అప్లై చేశారంటే చర్మం మెరిసిపోతుంది

ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగిన పసుపును శతాబ్దాలుగా ఆయుర్వేదంలో, సౌందర్యంలో ఉపయోగిస్తూ వస్తున్నారు. అమ్మమ్మలు, నానమ్మలు ఇప్పటికీ తరచుగా చర్మానికి పసుపు వాడమని సూచిస్తారు. ఎందుకంటే ఇది చర్మం లోతుల్లో నుంచి మెరుగుపరిచి ఆరోగ్యకరంగా, అందంగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది.పసుపులో శోథ నిరోధక, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి వృద్ధాప్య సంకేతాలు, రంగు మచ్చలు, మొటిమలు వంటి అనేక చర్మ సమస్యలను నయం చేయడంలో సహాయపడతాయి. వేసవి చర్మ సంరక్షణలో పసుపును అప్లై చేయడం వల్ల కలిగే లాభాలేంటి, దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం రండి.

వేసవిలో చర్మానికి పసుపు చేసే మేలు..

1. సూర్యుని కిరణాల నుంచి రక్షణ

పసుపులో ఉన్న కుర్కుమిన్ (Curcumin) ఎండ వేడి కారణంగా కలిగే దుష్పరిణామాలను తగ్గిస్తుంది.సూర్యకాంతి వల్ల వచ్చే టానింగ్, ఎరుపుదనం, దురద వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది.

చర్మాన్ని చల్లగా ఉంచుతుంది వేసవిలో చర్మం వేడి, చెమట కారణంగా దురద, దద్దుర్లు వంటి ససమ్యలు వచ్చే అవకాశం ఉంది. పసుపు చర్మాన్ని చల్లగా ఉంచుతుంది, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది.

2. సన్ టాన్ పిగ్మెంటేషన్ తగ్గుతుంది

సూర్యుడి హానికరమైన కిరణాల వల్ల కలిగే టాన్, జిడ్డుదనం, మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలను తగ్గించడంలో పసుపు చాలా బాగా సహాయపడుతుంది.వేసవిలో పసుపును తరచూ వాడితే చర్మం తిరిగి తేటగా, అందంగా మారుతంది.

3. మొటిమలు తగ్గుతాయి

వేసవిలో చెమట వల్ల బాక్టీరియా పెరిగి మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది.పసుపులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమల్ని తగ్గించడంతో పాటు కొత్త మొటిమలు రాకుండా చేస్తాయి.

4. సహజంగా కాంతినిస్తుంది (Natural Glow)

వేసవిలో వేడి వల్ల చర్మం మసకబారుతుంది. పసుపు వాడటం వల్ల చర్మం మళ్లీ సహజమైన కాంతితో కనిపిస్తుంది.

5. అలర్జీలు తగ్గుతాయి

వేసవి కాలంలో వచ్చే చర్మపు అలర్జీలు, దోమ కాటు కారణంగా వచ్చే దురద, దద్దుర్ల కారణంగా వచ్చే సమస్యలకు పసుపు మంచి సంతులనం ఇస్తుంది. అది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో పని చేస్తుంది.

అందమైన చర్మాన్ని పొందడానికి పసుపును ఎలా వాడాలి

1. పసుపు, పాలు

  1. వేసవిలో చర్మాన్ని రక్షించుకోవడానికి పసుపు పొడి, పాలను కలిపి మృదువైన పేస్ట్ తయారు చేయండి.
  2. ఈ పేస్ట్‌ను మొత్తం ముఖం, మెడపై అప్లై చేసి ఆరిపోయే వరకు ఉంచండి(పావు గంటకు పైగా).
  3. తర్వాత చర్మానికి చల్లని నీటితో కడగాలి.

పుసుపు, పాలు మీ చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి ఒక అద్భుతమైన మిశ్రమంగా పనిచేస్తాయి. ఇవి చర్మం నుండి చనిపోయిన కణాలను తొలగించడంతో పాటు తేమను అందిస్తాయి.

2) పసుపు, నిమ్మరసం

  1. వేసవిలో కాంతిహీనంగా మారిన చర్మానికి.. ఒక గిన్నెలో ఒక చెంచా పసుపు పొడి, ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని కలిపి మృదువైన పేస్ట్ తయారు చేయండి.
  2. ఈ పేస్ట్‌ను ముఖానికి, చేతులకు, మెడకు అప్లై చేసి 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి.
  3. తరువాత గోరువెచ్చని నీటితో కడిగి,ఆ తర్వాత చర్మాన్ని శుభ్రమైన తువ్వాలతో తుడవండి.

పసుపు చర్మాన్ని మెరుస్తుంది, నిమ్మరసంలో బ్లీచింగ్ లక్షణాలు ఉన్నాయి.ఈ రెండింటీని కలిపి ఉపయోగించినప్పుడు ఇవి చర్మం రంగును మెరుగుపరచడానికి సహాయపడతాయి.

3) పసుపు, నారింజ నూనె

  1. వేసవిలో జిడ్డుగా, నిర్జీవంగా మారిన చర్మం కోసం.. ఒక పెద్ద చెంచా పసుపును తీసుకొని, దానిలో కొన్ని చుక్కల నారింజ నూనెను కలిపి మృదువైన పేస్ట్ తయారు చేయండి.
  2. ఇప్పుడు శుభ్రంగా ఉన్న ముఖం, మెడ, చేతులు వంటి బయటికి కనిపించే శరరీ భాగాలన్నీంటికీ ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి.
  3. అప్లై చేసేటప్పుడు చక్కగా మర్దన చేయడం మర్చిపోకండి.

ఇలా అప్లై చేశాక 10 నుంచి 15 పాటు ఉంచి తర్వాత కడిగేయండి. ఈ ఫేస్ ప్యాక్ వేయడం వల్ల చర్మం సహజంగా, కాంతివంతంగా తయారవుతుంది.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం