Summer fashion: సమ్మర్‌లో స్టైలిష్‌గా, కంఫర్ట్‌గా ఉండే దుస్తులు ఇవే-summer fashion tips to blend comfort and style in your daily outfits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Summer Fashion Tips To Blend Comfort And Style In Your Daily Outfits

Summer fashion: సమ్మర్‌లో స్టైలిష్‌గా, కంఫర్ట్‌గా ఉండే దుస్తులు ఇవే

HT Telugu Desk HT Telugu
Mar 20, 2023 03:06 PM IST

మీ రోజువారీ వేసవి దుస్తులలో కంఫర్ట్, స్టైల్ మధ్య కచ్చితమైన బ్యాలెన్స్ సాధించడానికి కొన్ని టాప్ టిప్స్ ఇక్కడ చూడండి.

వేసవి వచ్చేసింది, మీ వార్డ్‌రోబ్‌ను రిఫ్రెష్ చేయడానికి, తాజా ఫ్యాషన్ ట్రెండ్‌లను అనుసరించడానికి ఇది సమయం. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నడుమ సౌకర్యవంతంగా, స్టైలిష్‌గా ఉండే దుస్తులను కనుగొనడం సవాలే.
వేసవి వచ్చేసింది, మీ వార్డ్‌రోబ్‌ను రిఫ్రెష్ చేయడానికి, తాజా ఫ్యాషన్ ట్రెండ్‌లను అనుసరించడానికి ఇది సమయం. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నడుమ సౌకర్యవంతంగా, స్టైలిష్‌గా ఉండే దుస్తులను కనుగొనడం సవాలే. (Instagram )

మీరు ఇంట్లోనే ఉండే వ్యక్తి అయినా లేదా ఎక్కువగా పార్టీలకు అటెండ్ అయ్యే వారైనా లేదా కంఫర్ట్, స్టైల్‌ కోల్పోకుండా సమ్మర్‌లో ఎలాంటి దుస్తులు ధరించాలి అనే సందిగ్ధత మనలో చాలా మందికి తరచుగా ఎదురవుతుంది. అయితే మీరు సాధారణ దుస్తులకు సంబంధించిన సంప్రదాయ ఆప్షన్ కాకుండా ఇతర ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలనుకుంటే ఈ గైడ్ మీ కోసమే.

లెట్స్‌డ్రెస్‌అప్ సహ వ్యవస్థాపకురాలు డాక్టర్ దృష్టి ఆనంద్ మీ రోజువారీ దుస్తుల కోసం కొన్ని సౌకర్యవంతమైన, స్టైలిష్ సమ్మర్ క్యాజువల్ అవుట్‌ఫిట్ ఐడియాలను హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌తో పంచుకున్నారు.

1. ట్యాంక్ టాప్

టాంక్ టాప్స్
టాంక్ టాప్స్ (Instagram)

ట్యాంక్ టాప్స్ సౌకర్యవంతంగా ఉంటాయి. మంచి స్టైల్ ఇస్తాయి. సందర్భం, వాతావరణాన్ని బట్టి జాకెట్, బ్లేజర్ లేదా ష్రగ్‌తో లేయర్‌లా ధరించండి. డెనిమ్ జాకెట్ లేదా లెదర్ జాకెట్ సాధారణ రూపాన్ని ఇస్తుంది. అయితే బ్లేజర్ మరింత ఫార్మల్ లుక్‌ ఇస్తుంది. మిడి లేదా మ్యాక్సీ స్కర్ట్‌తో మీ ట్యాంక్ టాప్‌ను జత చేస్తే సొగసైన రూపం మీ సొంతమవుతుంది. పూలతో కూడిన లేదా ప్రింటెడ్ స్కర్ట్ ఈ దుస్తులకు కలర్‌ఫుల్‌గా ఉంటుంది. స్టేట్‌మెంట్ నెక్లెస్‌, బ్రాస్‌లెట్‌ లేదా చెవిపోగులు జత చేస్తే దుస్తులను ఎలివేట్ చేయవచ్చు. బంగారు లేదా వెండి ఆభరణాలు దుస్తులకు మరింత వన్నె తెస్తాయి.

2. కఫ్టాన్ దుస్తులు

కఫ్టాన్స్
కఫ్టాన్స్ (Instagram)

వేసవిలో బాగా వదులుగా ఉండే కఫ్టాన్ దుస్తులు నప్పుతాయి. మీ సౌలభ్యం ప్రకారం పొడవును ఎంచుకోవచ్చు. పొడవైన కఫ్టాన్ దుస్తులు లేదా పొట్టి దుస్తులను ఎంచుకోండి. మీరు బోల్డ్ ప్రింట్‌లు, పూల రంగులు లేదా సాలిడ్స్‌ ఇష్టపడుతున్నా బోలెడన్ని ఆప్షన్లు ఉంటాయి. సందర్భానుసారంగా మీరు సాధారణ ఉపకరణాలతో ఈ దుస్తులను స్టైల్‌గా మార్చుకోవచ్చు. పాస్టెల్ ఫ్లోరల్ దుస్తుల కోసం కాంట్రాస్టింగ్ చెప్పులు, విరుద్ధమైన రంగులలో అందమైన స్లింగ్ పర్స్‌ జత చేయండి.

3. గ్రాఫిక్ షర్ట్

గ్రాఫిక్ టీ షర్ట్
గ్రాఫిక్ టీ షర్ట్ (Instagram/@sunnyleone)

మీరు బ్రైట్, బోల్డ్ విషయాల పట్ల మక్కువ కలిగి ఉన్న వ్యక్తులలో ఒకరైతే చమత్కారమైన, ఆహ్లాదకరమైన సందేశాలతో కూడిన గ్రాఫిక్ షర్ట్ మీ వేసవి స్టైల్‌ను ప్రదర్శించడానికి సరైనది. కలర్స్, మెసేజెస్‌తో భావ వ్యక్తీకరణ చేసే షర్టును ఎంచుకోవచ్చు. రంగురంగుల పలాజ్జో ప్యాంట్‌లు, ఫ్లేర్డ్ జీన్స్ లేదా రిప్డ్ ప్యాంట్‌లు జత చేసుకోవచ్చు. పాదరక్షల కోసం యాంకిల్ స్ట్రాప్ చెప్పులు, స్పోర్ట్స్ షూ లేదా కాంట్రాస్ట్ బాలేరినాలను ధరించండి. 

4. పాస్టెల్ ట్యూనిక్స్

పాస్టెల్ ట్యూనిక్స్
పాస్టెల్ ట్యూనిక్స్ (Instagram/@therealkarismakapoor)

సాధారణ పాస్టెల్-టోన్ ట్యూనిక్స్ లేదా టాప్స్ ప్రతి వార్డ్‌రోబ్‌లో తప్పనిసరిగా ఉండాలి. అవి చాలా స్టైలిష్‌గా, సౌకర్యవంతమైనవిగా ఉంటాయి. ఉదయం కాఫీ రన్ నుండి అర్థరాత్రి సూపర్ మార్కెట్ సందర్శనల వరకు, నైట్ ఓవర్స్ నుంచి సుదూర విమానా ప్రయాణాల వరకు ధరించవచ్చు. మీరు ట్యూనిక్‌ని టక్ చేసి ప్యాంటుతో ధరించవచ్చు. దుస్తుల సాధారణ స్వభావాన్ని నిలుపుకుంటూ తెలుపు, స్పోర్టి స్నీకర్లు ధరిస్తే ఆకట్టుకుంటారు.

WhatsApp channel

టాపిక్