అల్సర్ పొట్టను ఇబ్బంది పెట్టే సమస్య. వినడానికి చిన్నదే అయినా ఎంతో చికాకును కలిగిస్తుంది. పొట్ట, పేగుల ఉపరితలంపై ఉన్న పొరలు ఆమ్లాలల వ్లల మంటకు గురవుతాయి. అక్కడ చిన్న గాయాలు, పుండ్లు వంటివి పడతాయి. అదే అల్సర్లు. అలాగే హెలికోబాక్టర్ పైలోరీ అంటే బ్యాక్టిరియా వల్ల ఇన్షెక్షన్ వచ్చి అల్సర్ కు కారణం అవుతుంది.
అల్సర్లు తీవ్రంగా మారితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రాణాంతకంగా మారిపోయే అవకాశం ఉంది. అల్సర్ల వల్ల అంతర్గత రక్తస్రావం అవుతున్నా, వాంతుల్లో రక్త కనిపిస్తున్నా, మలంలో రక్తం పడినా, పొట్టకు లేదా పేగులకు రంధ్రాలు పడినా ఎంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అల్సర్లు అలాగే తీవ్రమైన పుండ్లుగా మారి క్యాన్సర్ కణాలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అల్సర్లను తక్కువ అంచనా వేయకూడదు.
అల్సర్ వల్ల పొట్ట తీవ్రంగా ఇబ్బంది కనిపిస్తుంటే అలసత్వం చేయకూడదు. వెంటనే డాక్టర్ ను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది. జీర్ణ మాత్రలు సొంతంగా తీసుకోవడం మానుకోవాలి.
అల్సర్ ఉన్నవారికి పొత్తికడుపు పై భాగంలో నొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన సందర్భాల్లో కడుపు లోపల అల్సర్ తీవ్రంగా మారి లోపల రక్తం కారుతూ నల్ల మలం ఏర్పడుతుంది.
ఈ అల్సర్ నుండి రక్షించడానికి సాంప్రదాయ ఇంటి నివారణలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ చెప్పిన పానీయాన్ని తాగడం వల్ల అల్సర్ కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.
గసగసాలు - రెండు స్పూన్లు
కొబ్బరి తురుము - అర కప్పు
గసగసాలను రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ గసగసాలు, కొబ్బరి తురుము మిక్సీలో జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని వడగట్టి ఉదయాన్నే పరగడుపున తాగితే ప్రయోజనం కనిపిస్తుంది. ఈ మిశ్రమానికి ఎక్కువ నీరు కలిపి తాగితే మరేమీ తాగకూడదు. మూడు గంటల విరామం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఇది రుచిగా ఉంటుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)