Transparent Sarees Tips: ట్రాన్స్‌పరెంట్ చీరల్లో తళుక్కుమనడం అంత ఈజీ కాదు, ఈ 6 చిట్కాలు పాటించి అందాన్ని పెంచుకోండి!-styling tips if you take these 6 precautions while wearing transparent sarees all the beauty is yours ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Transparent Sarees Tips: ట్రాన్స్‌పరెంట్ చీరల్లో తళుక్కుమనడం అంత ఈజీ కాదు, ఈ 6 చిట్కాలు పాటించి అందాన్ని పెంచుకోండి!

Transparent Sarees Tips: ట్రాన్స్‌పరెంట్ చీరల్లో తళుక్కుమనడం అంత ఈజీ కాదు, ఈ 6 చిట్కాలు పాటించి అందాన్ని పెంచుకోండి!

Ramya Sri Marka HT Telugu

6 tips to enhance your beauty in transparent sarees: ట్రాన్స్‌పరెంట్ చీరలు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీటిని కట్టుకునేందుకు చాలా మంది మహిళలు ఇష్టపడుతున్నారు. మీరు కూడా వీటిని కట్టుకోవాలనుకుంటే మరింత అందంగా కనిపించేందుకు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ప్రముఖ స్టైలిష్ట్ స్వాతి గౌడ్ వివరిస్తున్నారు.

ట్రాన్స్‌పరెంట్ చీరలు ధరించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

భారతీయ మహిళల అలంకరణలో చీరకుప్రత్యేక స్థానం ఉంది. బనారసి, కాంజీవరం, కాటన్ సారీలు వంటివి ఎల్లప్పుడూ ట్రెండ్‌లో ఉంటాయి. షిఫాన్, జార్జెట్, సిల్క్ వంటివి కూడా ఎప్పటికీ రన్నింగ్‌లోనే ఉంటాయి. కానీ ఈ మధ్య ట్రాన్స్‌పరెంట్ చీరలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. చాలా పలుచగా ఉండే ప్లెయిన్ చీరలు, నెట్టెడ్ చీరలు ఈ సీజన్ ఫ్యాషన్ ట్రెండ్‌గా మారాయి.

నిజానికి ట్రాన్స్‌పరెంట్ చీరలు కొత్త ఫ్యాషన్ ఏం కాదు.. ఒకప్పుడు హీరోయిన్లు బాగా వాడిన మోడలే. కానీ మధ్యలో వీటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే మళ్లీ ఇప్పుడివి వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం సెలబ్రిటీలు, ఫ్యాషన్ లవర్స్ అంతా వీటికే మొగ్గు చూపుతున్నారు. మీరు కూడా ఈ ట్రెండ్ ఫాలో అవాలి అనుకుంటున్నారా? ట్రాన్స్‌పరెంట్ చీరల్లో తళుక్కున మెరిసిపోవాలి అనుకుంటున్నారా? అయితే దీని స్టైలింగ్‌లో ఏలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం రండి..

1. బ్లౌజ్ ప్రత్యేకంగా ఉండాలి:

ట్రాన్స్‌పరెంట్ చీరలు చాలా పలుచగా, బ్లౌజు, ఒళ్లు బయటికి కనిపించేలా పారదర్శకమైన వస్త్రంతో తయారవుతాయి. కాబట్టి వీటి రూపాన్ని, డిజైన్ని ఆకర్షణీయంగా చేయడానికి బ్లౌజ్ ను ఆచీ తూచీ ఎంచుకోవాలి. ఈ చీరల మీదకి జాకెట్ చాలా స్టైలిష్‌గా ఉండాలి. ప్రింటెడ్, సీక్వెన్స్, నెట్ లేదా లేస్ వర్క్ తో ఉన్న బ్లౌజ్‌లు అయితే వీటిని చాలా ఆకర్షణీయంగా మారుస్తాయి. బ్లౌజ్ సెట్ అవలేందంటే చీర అందమే పాడైపోతుంది జాగ్రత్త.

2, పెటికోట్‌ విషయంలో జాగ్రత్త పడాలి:

సాధారణ సారీ కట్టుకునేటప్పుడు పెటికోట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ట్రాన్స్‌పరెంట్ చీరల విషయంలో మాత్రం పెటికోట్ లో జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి చాలా పలుచగా ఉంటాయి. సారీ అందం మొత్తం లోపల వేసుకునే పెటికోట్‌పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ పారదర్శక సారీలతో కాటన్ కంటే సాటిన్ పెటికోట్ ఎంచుకోండి. సాటిన్ పెటికోట్ చీరలోపల నుంచి కనిపించినప్పటికీ మెరుస్తూ చీర అందాన్ని మరింత పెంచుతుంది. పెటికోట్ పొడవు, ఫిట్టింగ్‌పై కూడా శ్రద్ధ వహించండి.

3. ప్లీట్లు(చింగులు) చేసేటప్పుడు:

ట్రాన్స్‌పరెంట్ చీరల్లో చింగులు ఎక్కువగా ఉంటే బాగుండవు. కాబట్టి పల్లు(కొంగు)ను ఇంకాస్త పొడవుగా ఉంచుకుని తక్కువ ప్లీట్లు(చింగులు) ముడుచుకోవడం మంచిది. మెరిసే శరీరంతో ఉన్న మహిళలు చిన్న చిన్న ప్లీట్లు చేయాలి, అలాగే కర్వీ ఫిగర్‌కు పెద్ద పెద్ద చింగులు బాగుంటాయి.

4. ఆభరణాలు, మేకప్:

ఆర్గన్జా, నెట్ వంటి ట్రాన్స్‌పరెంట్ సారీలు కట్టుకున్నప్పుడు ముత్యాల ఆభరణాలు ఆకర్షణీయంగా ఉంటాయి. పొడవైన, సన్నని మెడకు ముత్యాల చోకర్ రాజభోగాన్ని ఇస్తుంది. మెడ చిన్నగా ఉన్న వారు ముత్యాలతో చేసిన పొడవైన మాల ధరించవచ్చు. అదేవిధంగా పోల్కి, జడౌ పని చేసిన జుంకాలు, చాంద్ బాలీలు, కుందన్లు వంటి ఆభరణాలు కూడా ఈ రకమైన చీరలకు బాగా సెట్ అవుతాయి. మేకప్ విషయానికొస్తే ఈ చీరలు కట్టుకున్నప్పుడు షిమ్మర్ మేకప్ చాలా బాగా కనిపిస్తుంది.

5. పర్సు నుంచి చెప్పుల వరకూ..

పారదర్శక సారీలతో పర్సు నుండి చెప్పుల వరకు అన్ని రకాల ఉపకరణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు మీ సారీకి సరిపోయే పోట్లీ బ్యాగ్ లేదా క్లచ్ పర్సులను ఉపయోగించవచ్చు. చెప్పుల విషయానికొస్తే.. ట్రాన్స్‌పరెంట్ చీరలు కట్టుకున్నప్పుుడ హీల్స్ వేసుకుంటే చాలా బాగుటుంది. ఇది మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. పెన్సిల్ హీల్స్ కంటే బ్లాక్ హీల్స్ ఎంచుకోండి. దీనివల్ల నడిచేటప్పుడు చీర కాళ్ళకు చిక్కుకోదు. ప్రస్తుతం చీరల మీద స్పోర్ట్స్ షూస్ ధరించడం కూడా ట్రెండ్‌గా మారింది.

6. కొంగు సెట్ చేసేటప్పుడు:

సారీ పల్లు(కొంగు)ను మహిళలు వివిధ శైలులలో ధరించడానికి ఇష్టపడతారు. కొందరు కొంగును చింగులుగా ముడిచి పిన్‌తో సెట్ చేయడానికి ఇష్టపడతారు. మరికొందరు పల్లును మొత్తం ఒకే చింగుగా వదిలేయడానికి ఇష్టపడతారు. ఈ సన్నని వస్త్రంతో తయారైన ట్రాన్స్‌పరెంట్ చీరలు కట్టుకున్నప్పుడు కొంగును ముడుచుకోవడం అంతా బాగోదు. ఎందుకంటే దీనివల్ల సారీ భుజంపై ఎత్తుగా కనిపింస్తుంది. కొంగు మొత్తం వదిలేసి ఒక సేఫ్టీ పిన్ సహాయంతో సెట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఈ సారీ అందాన్ని రెట్టింపు అవుతుంది.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం