Styling Tips: మీ హిప్ ఏరియా, భూజాలు వెడల్పుగా ఉంటాయా? మీకు ఎలాంటి డ్రెస్‌లు సూట్ అవుతాయో తెలుసుకోండి!-styling tips do you have a wide hip area and shoulder find out what kind of dresses suit you ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Styling Tips: మీ హిప్ ఏరియా, భూజాలు వెడల్పుగా ఉంటాయా? మీకు ఎలాంటి డ్రెస్‌లు సూట్ అవుతాయో తెలుసుకోండి!

Styling Tips: మీ హిప్ ఏరియా, భూజాలు వెడల్పుగా ఉంటాయా? మీకు ఎలాంటి డ్రెస్‌లు సూట్ అవుతాయో తెలుసుకోండి!

Ramya Sri Marka HT Telugu

Styling Tips for women: మీ హిప్ ఏరియా, భుజాలు వెడల్పు ఎక్కువగా ఉంటాయా? మీ బాడీ షేపును బట్టి మీకు ఎలాంటి డ్రెస్సులు సూట్ అవుతాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ స్టైలింగ్ చిట్కాలు మీ కోసమే. వీటిని బట్టి డ్రెస్సింగ్ చేసుకున్నారంటే అందరిలో అందంగా కనిపిస్తారు.

హిప్ కాస్త వెడల్పుగా ఉన్న యువతి

అమ్మాయిల బాడీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా మంచి స్లిమ్‌గా అనిపించినప్పటికీ వారి హిప్ ఏరియా(పిరుదులు ఉండే భాగం) బాగా వెడల్పుగా కనిపిస్తుంది. కొందరిలో భుజాలు వెడల్పు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి కారణాల వల్ల వారు మోడ్రన్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు అందంగా కనిపించలేరు. ఇది వారి మొత్తం లుక్‌నే ఇవి మార్చేస్తాయి. అందుకనే చాలా మంది అమ్మాయిలు వెస్టర్న్ డ్రెస్సులు వేసుకోవాలని ఉన్నా కూడా వేసుకోవడనాకి భయపడతారు. వాటిని వేసుకున్నప్పుడల్లా అసౌకర్యంగా, ఇబ్బందిగా ఫీలవుతారు. ఇది వారిలోని ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. మీకు కూడా హిప్ ఏరియా లేదా భుజాలు వెడల్పుగా ఉండటం వల్ల ఇబ్బందులను ఎదర్కొంటుంటే ఈ స్టైలింగ్ టిప్స్ మీ కోసమే.

మీరు మోడ్రన్ డ్రెస్సుల్లో మెరిసిపోవాలనుకుంటే ముందు మీరు మీ బాడీ టైప్ ను అర్థం చేసుకుని. మీ శరీరం షేపును బట్టి దుస్తులను ఎంచుకోవడం వల్ల మీరు అందరిలో అందంగా కనిపిస్తారు. ఎక్కడికి వెళ్లిన ఆత్మవిశ్వాసంతో నిలబడ గలుగుతారు. మీ బాడీ టైప్‌ను బట్టి మీకు మ్యాక్సీ, లాంగ్ లెన్త్ లేదా మోకాల పొడవు ఉండే డ్రెస్సులు వంటి వాటిలో ఏది బాగా సూట్ అవుతుందో తెలుసుకోవచ్చు. దానికి సంబంధించి కొన్ని చిట్కాలను మీకు ఇక్కడ తెలుసుకోవచ్చు.

ఏ షేప్ బాడీ ఉన్న వారు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటే అందంగా కనిపిస్తారు?

1. యాపిల్ షేప్(apple shape body)

ఒక అమ్మాయి ఛాతి నుంచి నడుము వరకు ఉండే శరీర భాగం బరువుగా, వెడల్పుగా ఉంటే అది యాపిల్ షేప్ బాడీ అవుతుంది. ఈ రకమైన శరీరానికి V నెక్‌లైన్, ఫ్రిల్ స్లీవ్స్, నడుమును హైలైట్ చేసే కాఫ్ లెంత్ డ్రెస్సులు అందంగా కనిపిస్తాయి. మిడ్ పోర్షన్‌ను హైలైట్ చేయకుండా ఉండే షిఫ్ట్ డ్రెస్సులు కూడా యాపిల్ షేప్ శరీరానికి అందంగా కనిపిస్తాయి.

2. పియర్ షేప్ శరీరం(pear shape body)

నడుము, హిప్ ఏరియా భుజాల కంటే వెడల్పుగా ఉంటే అలాంటి శరీరానికి A లైన్ డ్రెస్సులు, రాప్ డ్రెస్సులు, ఫిట్ అండ్ ఫ్లేర్ డ్రెస్సులు అందంగా కనిపిస్తాయి. ఇవి నడుము భాగాన్ని తక్కువ హైలైట్ చేస్తాయి.

3. వెడల్పు భుజాలు(Broad Shoulders)

కొంతమంది మహిళలకు నడుము సన్నగా ఉంటుంది. కానీ ఛాతి భాగం లేదా భుజాలు వెడల్పుగా ఉంటాయి. అలాంటి మహిళలకు స్ట్రాపీ డిజైన్, కావల్ నెక్‌లైన్‌తో కూడిన ఫిట్ అండ్ ఫ్లేర్ డ్రెస్సులు, A లైన్ డ్రెస్సులు బాగా సెట్ అవుతాయి. సన్నని నడుముపై వాల్యూమ్‌ను జోడించే డ్రెస్సులు అప్పర్ బాడీతో బ్యాలెన్స్‌ లుక్ ఇస్తాయి.

4. రెక్టాంగిల్ షేప్ శరీరం(rectangle shape body)

అప్పర్, లోవర్ ఏరియా అంటే హిప్, ఛాతీ భాగంలో ఒకేలా ఉండే అమ్మాయిలు డ్రెస్సులు ధరించేటప్పుడు డీప్ V నెక్‌లైన్, స్లీవ్ డిజైన్స్‌పై దృష్టి పెట్టాలి. ఫ్లేర్ లుక్ ఇచ్చే డ్రెస్సులు రెక్టాంగిల్ షేప్ ఉన్న వారికి అందంగా ఉంటాయి.

5. అవర్‌గ్లాస్ శరీరం(hourglass body)

ఈ రకమైన శరీరంలో నడుము భాగం సన్నగా ఉంటుంది. ఛాతి, హిప్ ఏరియా వెడల్పుగా ఉంటుంది. ఈ రకమైన శరీరానికి పై నుండి కింది వరకు బ్యాలెన్స్డ్ లుక్ ఇచ్చే డ్రెస్సులు అందంగా కనిపిస్తాయి. ఫిట్ లుక్, A లైన్ డ్రెస్సులు ఫ్లేర్ లుక్ బాగుంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం