Female Body Shapes: మీ బాడీ షేప్ ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి!
How to Know Body Shape:బాడీ షేప్‌ని బట్టి డ్రెస్సింగ్ చేసుకుంటే మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపించవచ్చు అని చెబుతుంటారు స్టైలింగ్ నిపుణులు. మీ శరీరం ఏ షేప్‌లో ఉంటుందో తెలుసుకోవాలని, మరింత అందంగా కనిపించాలని మీకూ ఉందా? అయితే ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి. ఇవి మీ బాడీ షేప్‌ను కర్టెక్‌గా చెప్పేస్తాయి.
అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలంటే నచ్చిన బట్టలు వేసుకోవడం కాదు శరీరానికి తగిన బట్టలు వేసుకోవాలని స్టైలింగ్ నిపుణులు చెబుతుంటారు. శరీరానికి తగిన బట్టలు అంటే ఇది మనకు బాగుంటుంది, ఇది మనకు బాగుండదు అని మనకు మనమే డిసైడ్ అవడం కాదు. మన శరీర ఆకృతిని బట్టి మనకు ఎలాంటి దుస్తులు బాగా సెట్ అవుతాయో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు శరీరీ ఆకృతిని అంటే మీ బాడీ షేప్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
బాడీ షేప్‌ను ఎలా డిసైడ్ చేస్తారు?
- ఆడవారి శరీరం విభిన్న ఆకారాల్లో ఉంటుంది. స్త్రీల ఎముకల నిర్మాణం, కండరాల ద్రవ్యరాశి, శరీరంలోని కొవ్వును బట్టి బాడీ షేప్ ను కాల్కులేట్ చేస్తారు.
- వయసుతో పాటు హార్మోన్లలో వచ్చే మార్పులు, జీవక్రియలో మార్పులు, జన్యు శాస్త్రం వంటి వాటి ఆధారంగా బాడీ షేపులను నిర్ణయిస్తారు.
- ప్రెగ్నెన్సీ, పీసీఓడీ, థైరాయిడ్, వంటి అంశాలు కూడా మహిళల శరీరాకృతిపై ప్రభావం చూపుతాయి.
- ఒత్తిడి, ధూమపానం, మద్యపానం వంటివి కూడా ఆడవారి శరీరాన్ని పూర్తిగా మార్చేస్తాయి.
ఆడవారి శరీర ఆకారాలు ఎన్ని రకాలు?
ఆడవారి శరీర ఆకారాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి 6 శరీరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. పియర్ షేప్ లేదా త్రిభుజాకారం(Pear or Triange Shape):
భుజాలు ఛాతి కంటే వెడల్పుగా ఉండి.. నడుము సన్నదిగా ఉంటూ పియర్ షేప్ అంటారు. దీన్నే స్టాబెర్రీ షేప్ అని కూడా పిలుస్తారు.
2. ఆపిల్ షేప్ లేదా విలోమ త్రిభుజాకారం( appele or Inverted Triangle Shape):
రొమ్ములు పెద్దవిగా, తుంటి భాగం చిన్నదిగా ఉండి నడుము కాస్త వెడల్పుగా ఉంటే ఆపిల్ షేప్ అంటారు. ఈ శరీరం ఉన్నావాళ్లకి నడుము, తుంటి కన్నా బ్రెస్ట్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది.
3. అవర్ గ్లాస్ ఆకారం(Hourglass Shape)
అవర్ గ్లాస్ బాడీ షేప్ లో బ్రెస్ట్, తుంటి దాదాపు ఒకే సైజులో ఉంటాయి. ఈ రెండింటి కన్నా నడుము కాస్త సన్నదిగా కనిపిస్తుంది.
4. రెక్టాంగిల్ షేప్ లేదా దీర్ఘచతురస్రాకారం (Rectangle Shape ):
భుజనాలు,ఛాతి, నడుము, తుంటి అన్నీ దాదాపు ఒకే రకమైన కొలతలు ఉంటే రెక్టాంగిల్ షేప్ బాడీ అంటారు. ఇది ఎక్కువగా అథ్లెటిక్స్ లో కనిపిస్తుంది. దీన్నే బనానా షేప్ బాడీ అని కూడా పిలుస్తారు.
5. ఓవెల్ షేప్ బాడీ( Oval Shape):
భుజాలు, తుంటి సన్నవిగా ఉండి రొమ్ములు, నడుము(పొట్ట) ఎక్కువగా ఉంటే ఓవెల్ షేప్ బాడీ అంటారు.
6. డైమండ్ షేప్ బాడీ (Diamond Shape)
తుంటి వెడల్పుగా ఉండి, రొమ్ములు చిన్నవిగా, నడుము(పొట్ట) ఎక్కువగా ఉండే శరీరాన్ని డైమండ్ షేప్ బాడీ అంటారు.
బాడీ షేప్ ఏంటో తెలుసుకోవడం ఎలా?
శరీర ఆకృతిని తెలుసుకోవడానికి మీరు ఎలాంటి స్టైలిష్ట్ దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లోనే ఈజీగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీ దగ్గర స్మార్ట్ ఫోన్, మెజరింగ్ టేప్ ఉంటే చాలు. మీ బాడీ షేప్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే మీరు ముందుగా ఒక పెన్ను, పేపర్ తీసుకుని మెజరింగ్ టేప్ సహాయంతో మీ..
- ముందు భుజాల కొలతను చెక్ చేసి రాసుకోండి.
- తరువాత ఛాతి సైజ్‌ను నోట్ చేసుకోండి.
- ఆ తర్వాత నడుము కొలతలను తీసుకుని రాసుకోండి.
- చివరగా మీ తుంటి భాగాన్ని కొలుచుకొండి.
- వీటన్నింటినీ నోట్ చేసుకున్న తర్వాత.. గూగుల్‌లో బాడీ టైప్ కాల్యుకేటర్ అని సర్చ్ చేయండి.
- అందులో మీ కొలతలన్నింటినీ టైప్ చేశారంటే మీ బాడీ షేప్ ఏంటో తెలుసిపోతుంది.
అంతే మీ బాడీ షేపు తెలుసుకున్నాక ఆ షేపును మీకు డ్రెస్సింగ్ చేసుకోవడం అలవాటు చేసుకున్నారంటే అందరిలోనూ హుందాగా కనిపిస్తారు. వేసుకుంటే అందంగా కనిపిస్తారో తెలుసుకోండి. మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపించండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం