మనం గడుపుతున్న బిజీలైఫ్ కారణంగా ఆందోళనలు, ఒత్తిడి ప్రతి ఒక్కరి జీవితంలోని భాగం అయిపోయాయి. వృత్తిపరంగా ఎదుర్కొనే ఒత్తిళ్ల కారణంగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇవి చాలదన్నట్లు పర్సనల్ రీజన్స్‌తో కూడా ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ఒత్తిడితోనే మనుషులు మానసికంగా కుంగిపోతున్నారు.
అలా జరగకుండా ఉండాలంటే, మానసిక ఆరోగ్యం కోసం సంతోషంగా ఉండటం చాలా అవసరం. అయితే మనలో అంతా కష్టపడటమెలాగో తెలుసుకుంటాం. కానీ, సంతోషంగా ఎలా ఉండాలో తెలియదు. ఎల్లప్పుడూ ఏదో ఒక ఆందోళనతోనే గడిపేస్తుంటారు. దీనివల్ల తెలియని మానసిక ఒత్తిడితో పాటు జీవితంలో విజయం దిశగా సాగలేరు. మీరు కూడా ఇలా ఆందోళన పడుతూ గందరగోళంలో ఇరుక్కుపోయామని అనుకుంటున్నారా..? జీవితంలో పెరిగిపోతున్న అనవసరమైన ఆందోళనల నుంచి బయటపడాలంటే ఇలా చేయండి. మోటివేషనల్ స్పీకర్ గౌర్ గోపాల్ దాస్ చెప్పిన కొన్ని సూచనలను పాటించండి. అవి మిమ్మల్ని లోపలి నుండి సంతోషంగా ఉంచటానికి సహాయపడతాయి.
1) అన్నీ సంపాదించడం సంతోషం కాదు, మీ దగ్గర ఉన్నదాన్ని ఆనందించడమే సంతోషం. మనిషికి కోరికలు అనంతం, అవి తీరకపోతే బాధపడతాడు. కానీ, సంతోషంగా ఉండాలనుకుంటే మీ దగ్గర ఉన్నదాన్ని ఆనందించి జీవించడమే సంతోషం.
2) సంతోషంగా ఉండటం అనేది మీ ఛాయీస్. ఏదైనా జరగడం లేదా లభించడం మీద సంతోషం ఆధారపడి ఉండదు. మీరు సంతృప్తిగా ఉంటేనే మనసులో సంతోషం ఉంటుంది. ఒకవేళ మీకు సంతృప్తి లేదంటే ఎటువంటి సంఘటన జరిగినా, ఎలాంటి వస్తువు దొరికినా సంతోషంగా ఉండలేరు.
3) మీరు చేసే పనుల నుండే సంతోషం,సంతృప్తి లభిస్తుంది. సంతోషం ఎవరో ఇచ్చే రెడీమేడ్ వస్తువు కాదు. సంతోషాన్ని మనసుతో అనుభవించాలి. అప్పుడే మీరు జీవితంలో సంతోషంగా ఉండగలరు.
4) సంతోషంగా ఉండాలంటే ఇతరులకు వివరించడం ఆపేయండి. మనశ్శాంతి, సంతోషం కోసం మౌనంగా ఉండటం మంచిది.
5) అన్నీ ప్లాన్ చేసుకుని నడవడం వల్ల చాలా సార్లు నిరాశ కలుగుతుంది. దానివల్ల బాధ కలుగుతుంది. జీవితంలో కొన్ని విషయాలను ప్లాన్ చేయకుండా వదిలేయాలి. ప్లాన్ చేయని విషయాలు చాలా సార్లు ఎక్కువ సంతోషాన్ని ఇస్తాయి.
ఈ సూత్రాలను పాటించడం వల్ల మనం మరింత సంతోషంగా, ప్రశాంతంగా, సంతృప్తిగా, సానుకూల దృక్పథంతో జీవించగలుగుతాం. ఇది మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీవితాన్ని మరింత ఆనందమయం చేస్తుంది.
సంబంధిత కథనం