ఆధునిక ప్రపంచంలో మనం నిత్యం ఏదో ఒక ఒత్తిడికి లోనవుతూనే ఉంటాం. అది పని ఒత్తిడి కావచ్చు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, లేదా రోజువారీ జీవితంలోజరిగే చిన్న చిన్న సంఘటనలు కావచ్చు. ఇవన్నీ కలిసి మన మనసులో ఆందోళనను, అనవసరపు ఆలోచనలను పెంచుతూ, ప్రశాంతతను దూరం చేస్తాయి. రాత్రిపూట నిద్రపట్టక, పగలంతా ఏ పనీ సరిగా చేయలేక, ఒక తెలియని భారంతో జీవిస్తున్నామని చాలా మంది బాధపడుతున్నారు. మనం ఎంత ప్రయత్నించినా, ఆ ఆలోచనల సుడిగుండంలోంచి బయటపడలేకపోతున్నామనే నిస్సహాయత మనల్ని మరింత కుంగదీస్తుంది.
అయితే, ఈ సమస్యకు యోగాలో ఒక అద్భుతమైన, శాశ్వతమైన పరిష్కారం ఉంది. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, ఇది మన మనస్సును, శరీరాన్ని, ఆత్మను కలిపే ఒక గొప్ప సాధనం. కొన్ని సరళమైన ఆసనాలను క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా మనసును ప్రశాంతంగా, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకొవచ్చు. ఆత్మను ఉత్సాహంగా ఉంచుకోవచ్చు.
HT లైఫ్స్టైల్తో ఇచ్చిన ఇంటర్వ్యూలో, హిమాలయన్ సిద్ధా అక్షర్, యోగా నిపుణుడు, అలాగే అక్షర్ యోగా కేంద్రం వ్యవస్థాపకుడు, యోగా ఆందోళనకరమైన మానసిక స్థితిని ఎలా తగ్గిస్తుందో వివరంగా చెప్పారు.
ఆయన ప్రకారం, "యోగా అనేది శారీరక ఆరోగ్యం, మానసిక స్థిరత్వాన్ని పెంపొందించడానికి ప్రసిద్ధి చెందిన ఒక ప్రాచీన పద్ధతి. ఇది ఒక సమగ్ర శిక్షణ, భావోద్వేగ నియంత్రణ, ఆత్మజ్ఞానం కోసం సాధనాలను అందిస్తుంది. తద్వారా మానసిక సామరస్యాన్ని సాధించడంలో యోగా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల నాడీ వ్యవస్థ శాంతించి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది."
ఆందోళన, అధిక ఆలోచనల నుంచి బయటపడి, మీకు మానసిక శాంతిని, అద్భుతమైన ప్రశాంతతను అందించే ఆ 6 శక్తివంతమైన యోగాసనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం రండి.
ఈ ఆసనం ఏకాగ్రత మరియు స్థిరత్వాన్ని పెంచుతుంది. దీన్ని ఎలా చేయాలంటే
ఇది నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. దీన్ని ఎలా చేయాలంటే..
ఇది లోతైన విశ్రాంతిని కలిగిస్తుంది, మానసిక శాంతిని పెంచుతుంది.
ఈ అభ్యాసం ఒత్తిడి, కోపాన్ని తగ్గించడానికి అనువైనది. ఇది శరీరం, మనసును చల్లబరచడానికి సహాయపడుతుంది. దీన్ని ఎలా చేయాలంటే..
ఈ ప్రాణాయామం ఒత్తిడి, ఉద్రిక్తతను తగ్గిస్తుంది, మీ శరీరాన్ని చల్లబరుస్తుంది, విష నిర్మూలనకు మద్దతు ఇస్తుంది.
ఈ ముద్ర వేయడంకోసం ముందుగా మీ రెండు చేతుల వేళ్లను ఒకదానికొకటి తాకేలా కలపండి. అంటే, కుడి చేతి బొటనవేలు ఎడమ చేతి బొటనవేలిని, కుడి చూపుడు వేలు ఎడమ చూపుడు వేలిని... ఇలా అన్ని వేళ్లు ఒకదానికొకటి సున్నితంగా తాకేలా ఉంచండి.
వేళ్లను కేవలం చివర్లు మాత్రమే తాకాలి, అరచేతులు దూరంగా ఉండాలి, వాటి మధ్య చిన్న ఖాళీ ఉంటుంది.
మీ చేతులను మీ ఛాతీకి దగ్గరగా, వేళ్లు పైకి చూస్తున్నట్లు పట్టుకోండి.
మీ చూపును మీ కనుబొమ్మల మధ్య (ఆజ్ఞా చక్రం) లేదా మీ నాసికాగ్రంపై కేంద్రీకరించండి.