ఫ్లోర్ టైమ్ ట్రెండ్ అంటే ఏంటి? ఊరికే నేల మీద పడుకుంటే ఒత్తిడి ఎలా తగ్గుతుంది?-stressed out the floor is your new therapy understanding the floor time trend ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఫ్లోర్ టైమ్ ట్రెండ్ అంటే ఏంటి? ఊరికే నేల మీద పడుకుంటే ఒత్తిడి ఎలా తగ్గుతుంది?

ఫ్లోర్ టైమ్ ట్రెండ్ అంటే ఏంటి? ఊరికే నేల మీద పడుకుంటే ఒత్తిడి ఎలా తగ్గుతుంది?

Ramya Sri Marka HT Telugu

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫ్లోర్ టైమ్ ట్రెండ్ గురించి మీకు తెలుసా? ఏమి చేయకుండా ఊరికే నేల మీద పడుకుంటే ఒత్తిడి తగ్గుతుందా? దీని వెనకున్న కారణాలేంటి? ఫ్లోర్ టైమ్ ట్రెండ్ ఎప్పుడు, ఎలా చేయాలి వంటి విషయాలను తెలుసుకుందాం రండి.

నేల మీద ప్రశాంతంగా పడుకున్న యువతి

లైఫ్ రేసింగ్‌లా మారిందా? నిమిషం తీరక లేని ఈ జీవితంలో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారా? అయితే ఫ్లోర్ టైమ్ ట్రెండ్ టెక్నిక్ ట్రై చేయండి. ఒత్తిడిని తగ్గించడానికి ఇది చాలా బాగా సహాపడుతుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. దీన్ని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి వంటి వివరాలను తెలుసుకుందాం రండి.

ఫ్లోర్ టైమ్ ట్రెండ్ అంటే ఏంటి?

ఫ్లోర్ టైమ్ ట్రెండ్ అనేది ఇటీవల సోషల్ మీడియాలో, ముఖ్యంగా టిక్‌టాక్‌, ఇన్స్టాలో, రీల్స్‌లో ట్రెండ్ అవుతున్న ఒక మానసిక ఆరోగ్య పద్ధతి. ఇందులో వ్యక్తులు నేలపై పడుకుని ఉండాలి. ఎటువంటి పరధ్యానం లేకుండా అంటేఫోన్, టీవీ మొదలైనవి ఏవీ చూడకుండా కొంత సమయాన్ని గడపాలి. ఈ సమయంలో కేవలం విశ్రాంతి తీసుకోవాలి, ప్రస్తుత క్షణంపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఇదే ఫ్లోర్ టైమ్ ట్రెండ్ .

ఒత్తిడిని తగ్గించడానికి ఫ్లోర్ టైమ్ ఎలా సహాయపడుతుంది?

ఫ్లోర్ టైమ్ ఒత్తిడిని తగ్గించడానికి అనేక రకాలుగా సహాయపడుతుంది:

1. శరీరానికి విశ్రాంతి:

నేలపై పడుకోవడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి, శరీరం స్థిరంగా ఉంటుంది, ఇది నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది.

2. శ్వాసను క్రమబద్ధీకరించడం:

ప్రశాంతంగా పడుకోవడం వల్ల లోతైన, నెమ్మదైన శ్వాస తీసుకోవడం సులభమవుతుంది, ఇది ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది.

3. మనస్సును శాంతపరచడం:

ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండటం వల్ల మెదడుకు విశ్రాంతి లభిస్తుంది, ఆలోచనల ప్రవాహం నెమ్మదించి ఒత్తిడి తగ్గుతుంది

4. వర్తమానంలో ఉండటం:

ఫ్లోర్ టైమ్ ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది, ఆందోళన, భవిష్యత్తు గురించిన భయాలను తగ్గిస్తుంది.

5. గ్రౌండింగ్:

శరీరం పూర్తిగా నేలను తాకి పడుకోవడం వల్ల తెలియకుండానే మనసులో ఒక రకమైన భద్రతా భావం ఏర్పుడుతుంది. తద్వారా ఒత్తిడి తగ్గిస్తుంది.

6. స్వీయ-అవగాహన:

ఇది శరీర అనుభూతులు, భావోద్వేగాలను గమనించడానికి సమయాన్నిస్తుంది. మీ మీద మీ శరీరం మీద మీకు ఒక అవగాహన కలిగేలా చేస్తుంది.

ఫ్లోర్ టైమ్ ట్రెండ్ ఎప్పుడు చేయాలి?

ఫ్లోర్ టైమ్‌ను రోజులో ఎప్పుడైనా చేయొచ్చు. కానీ ఈ టైమ్స్‌లో చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి:

  • ఉదయం లేవగానే: రోజంతా హుషారుగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది.
  • మధ్యాహ్నం నీరసంగా అనిపించినప్పుడు: మళ్లీ ఎనర్జీ వస్తుంది.
  • రాత్రి పడుకునే ముందు: మంచి నిద్ర పడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
  • ఒత్తిడిగా లేదా ఆందోళనగా ఉన్నప్పుడు: వెంటనే రిలీఫ్ వస్తుంది.

పాటించాల్సిన టిప్స్:

  1. పడుకోవడానికి మంచి, శుభ్రమైన ప్రదేశం చూసుకోండి. చల్లగా ఉంటే ఒక చాప వేసుకోండి.
  2. బిగుతుగాగా ఉండే బట్టలు కాకుండా ఫ్రీగా, వదులుగా ఉండే డ్రెస్ వేసుకుని చేయండి.
  3. చుట్టూ ఎలాంటి అల్లరి లేకుండా నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోండి. కావాలంటే మెల్లగా మ్యూజిక్ పెట్టుకోవచ్చు.
  4. మీ శ్వాస మీద, మీ శరీరం మీద దృష్టి పెట్టడానికి ట్రై చేయండి.
  5. మొదట్లో కొంచెం వింతగా అనిపించినా, రెగ్యులర్‌గా చేస్తే అలవాటు అవుతుంది.మీకు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం