Stress: ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, అందాన్ని కూడా దెబ్బతీస్తుంది! ఎలా జాగ్రత్త పడాలో తెలుసుకోండి!-stress not only affects your health but also your beauty learn how to be careful ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Stress: ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, అందాన్ని కూడా దెబ్బతీస్తుంది! ఎలా జాగ్రత్త పడాలో తెలుసుకోండి!

Stress: ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, అందాన్ని కూడా దెబ్బతీస్తుంది! ఎలా జాగ్రత్త పడాలో తెలుసుకోండి!

Ramya Sri Marka HT Telugu
Published Feb 08, 2025 01:30 PM IST

Stress: మెరుగైన జీవితం కోసం మాత్రమే కాదు, మెరుగ్గా కనిపించడానికి కూడా ఒత్తిడిని నివారించడం లేదా తగ్గించడం చాలా ముఖ్యమని చెబుతున్నారు నిపుణులు. అందం తగ్గకుండా ఉండాలంటే ఒత్తిడి నుంచి ఎలా తప్పించుకోవాలో ఇక్కడ తెలుసుకోవచ్చు.

ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, అందాన్ని కూడా దెబ్బతీస్తుంది! ఎలా జాగ్రత్త పడాలో తెలుసుకోండి!
ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, అందాన్ని కూడా దెబ్బతీస్తుంది! ఎలా జాగ్రత్త పడాలో తెలుసుకోండి!

అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలంటే ఎండ తగలకుండా ఉండటం, రకరకాల క్రీములు వాడటం కాదు.. సంతోషంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. అవును అనేక రకాల చర్మ సమస్యలకు బయట నుంచి వచ్చే దుమ్ము, ధూళి, UV కిరణాలు వంటి వాటి కన్నా ఎక్కువ మానసిక ఒత్తిడి కారణమవుతుందట. ఒక్కమాటలో చెప్పాలంటే అందం విషయంలో వీటన్నింటి కన్నా ఒత్తిడి చాలా ప్రమాదకారిగా వ్యవహరిస్తుందట. అందంపై ఒత్తిడి ప్రభావం ఎలా ఉంటుంది? దాని నుంచి ఎలా తప్పించుకోవాలి తెలుసుకుందాం.

అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఆశ్చర్యకరమైన విషయం భారతదేశంలో దాదాపు 77 శాతం మంది ఒత్తిడి లక్షణాలను ఎదుర్కొంటున్నారు. అందంపై, ఆరోగ్యంపై దీని ప్రభావం చాలా లోతైనదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒత్తిడి ప్రభావం ఆరోగ్యం మీద కాసేపు మాత్రమే ఉండచ్చు. కాసేపటికి అది తగ్గిపోవచ్చు. కానీ అందం విషయంలో అలా జరగకపోవచ్చు. ఒత్తిడి కారణంగా ముఖం సహజ కాంతిని కోల్పోతుంది. దాని ప్రభావం తగ్గడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. అందుకే మీరు మీ ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. ఒత్తిడిని క్షణాల్లో తగ్గించే, మీ కాంతిని కూడా నిలబెట్టుకునే కొన్ని మార్గాల గురించి తెలుసుకుందాం రండి.

ఒత్తిడి వల్ల శరీరంలో ఏం జరుగుతుంది?

ఒత్తిడి అందరికీ ఉంటుంది ఇది సాధారణమే. కానీ కొంతమందికి ఇది పెద్ద సమస్యే. ఎందుకంటే కొన్నిసార్లు మన స్వభావం కూడా ఒత్తిడితో కూడానది అయి ఉంటుంది. అంటే కొందరు అనవసరమైన విషయాల గురించి కూడా అతిగా ఆలోచించి ఒత్తిడిని తీసుకుంటారు. అలాంటి సందర్భంలో, ఒత్తిడి శరీరంపై, అందంపై ఎలా ప్రభావం చూపుతుందో డాక్టర్ ఐపి ఆహూజా చెబుతున్నారు.

ఒత్తిడి ఉన్నప్పుడు శరీరంలో ఒత్తిడి హార్మోన్ విడుదల అవుతుంది, వలన జీవనశైలికి సంబంధించిన అనేక సమస్యలు ప్రారంభమవుతాయి. అయితే కొంతసేపటి తర్వాత మీ టెన్షన్ తగ్గుతుంది. కానీ ఒత్తిడి కారణంగా శరీరానికి వచ్చిన ఈ సమస్యలు కొన్నిసార్లు జీవితకాలం పాటు ఉంటాయి. మనం ఒత్తిడిని పొందినప్పుడు మొదట మనకు జీర్ణ సంబంధిత సమస్యలు ప్రారంభమవుతాయి, ఇది జీవక్రియపై ప్రభావం చూపుతుంది, క్రమంగా ఇది హార్మోన్లలో అసమతుల్యతకు కారణం అవుతుంది. ఎక్కువకాలం ఒత్తిడిని అనుభవిస్తే నిద్రలేమి కూడా వస్తుంది. ఈ రెండు సమస్యల వల్ల అనేక తీవ్రమైన పరిణామాలు కనిపిస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్లు కూడా ఒత్తిడి వల్లే వస్తాయి.

అందంపై ఒత్తిడి ఎలా ప్రభావం చూపుతుంది?

ఒత్తిడి ప్రభావం చర్మంపై నేరుగా కనిపిస్తుంది. మానసిక ఒత్తిడి కారణంగా పెరిగిన కార్టిసోల్ హార్మోన్ చర్మంపై ఉన్న గ్రంధులు ఎక్కువ నూనెను విడుదల చేసేలా చేస్తాయి. మొటిమల సమస్య పెరుగుతుంది. అదనంగా, నిద్రలేమి కారణంగా కళ్ళ కింద నల్లటి వలయాలు, కళ్ళు ఉబ్బడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.

కొన్ని అధ్యయనాలు ప్రకారం.. ఎక్కువ ఒత్తిడి చర్మాన్ని సున్నితంగా చేస్తుంది. దీని వలన చర్మం పొడిబారడం, కాంతిని కోల్పోవడం జరుగుతుంది. కొన్నిసార్లు దురద, దద్దుర్లు కూడా వస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తి కూడా తగ్గి చర్మంపై ముందే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి.

ఒత్తిడి కారణంగా చర్మం కాంతి తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ఒత్తిడి ముఖంపై తక్కువ ప్రభావం చూపడానికి మీరు కొన్ని చర్యలు తీసుకోవాలి. ఈ విషయం గురించి ఫిట్‌నెస్ నిపుణురాలు దీప్తి భూషణ్ చెబుతున్నదేంటంటే.

ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కునేవారు రోజుకు ఒక గంట అయినా మాత్రమే మీ శరీర సంరక్షణ కోసం కేటాయించడం ద్వారా మనం మెరుగైన జీవితానికి పునాది వేయవచ్చు.

ఒక గంటను మూడు భాగాలుగా విభజించండి, వీటిలో ఒక భాగం వ్యాయామం, ఒక భాగం ప్రాణాయామం, మరొక భాగం ధ్యానం కోసం కేటాయించేలా ప్లాన్ చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఇవి మీ శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరిచి, ఒత్తిడి హార్మోన్ స్థాయి తగ్గుతుంది. ప్రాణాయామాన్ని అలవాటు చేసుకోవాలి. దీని వల్ల క్షణాల్లో ఒత్తిడి తగ్గుతుంది, మనశ్శాంతి ముఖంపై కనిపిస్తుంది.

అదనంగా, ఆహారంపై శ్రద్ధ వహించండి. సహజమైన, సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోండి.

గోరు వెచ్చని నీరు త్రాగే అలవాటు చేసుకోండి.

అదనంగా, చర్మంలో తేమను సరిచేయడానికి, సరిపడా నీరు, పండ్ల రసాలు త్రాగడం మంచిది.

మరింత అందంగా కనిపించేందుకు హైడ్రేటింగ్ మాస్క్, ఇతర హైడ్రేటింగ్ ఉత్పత్తులను ఉపయోగించండి.

Whats_app_banner