Strengthen Your Bone Health : మీ ఎముకలను దృఢంగా లేకుంటే.. ఈ ఆసనాలు వేసేయండి..-strengthen your bone health with these 5 yoga asanas ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Strengthen Your Bone Health With These 5 Yoga Asanas

Strengthen Your Bone Health : మీ ఎముకలను దృఢంగా లేకుంటే.. ఈ ఆసనాలు వేసేయండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Dec 20, 2022 01:24 PM IST

Yoga for Osteoporosis : ఈ మధ్యకాలంలో చాలామంది ఎముకల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేయడం చాలా ముఖ్యం. సరైన ఆహారంతో పాటు.. కొన్ని యోగా ఆసనాలతో మీ ఎముకలను స్ట్రాంగ్ చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

ఎముకలు స్ట్రాంగ్ ఉండాలంటే..
ఎముకలు స్ట్రాంగ్ ఉండాలంటే..

Strengthen Your Bone Health : యోగా ఆసనాలతో శారీరకంగా, మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చు అంటున్నారు యోగా నిపుణులు. అంతేకాదండోయ్.. మీ ఎముకల ఆరోగ్యాన్ని కూడా బలోపేతం చేసుకోవచ్చు అంటున్నారు. మీ ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకోవడంలో పలు ఆసనాలు.. మీకు ఉపయోగపడుతాయి అంటున్నారు.

మెరుస్తున్న చర్మం, బరువు తగ్గడం, మెరుగైన రోగనిరోధక శక్తి, వశ్యతతో పాటు.. యోగా అనేది వారి ఎముకలను బలోపేతం చేయడానికి, సంబంధిత వ్యాధులను అధిగమించడానికి కూడా సహాయం చేస్తుంది. మీ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మీరు ఎలాంటి ఆసనాలు వేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

వీరభద్రాసనం

మీ ఎడమ కాలు వెనుకకు వంచి.. దాని కాలి వేళ్లను బయటికి చూపిస్తూ నిలబడండి. మీ కుడి చేతిని ముందుకు, ఎడమ చేతిని వెనుకకు చాచండి. అవి సమాంతరంగా ఉన్నాయని నిర్ధారించుకోండి.

ఇప్పుడు మీ కుడి మోకాలిని నేరుగా మీ చీలమండలం పైకి వచ్చే వరకు వంచండి. మీ శరీరాన్ని బ్యాలెన్స్ చేయండి. మీ వెన్నెముకను స్ట్రెచ్ చేయండి. మీ ఛాతీని విస్తరించండి. మీ కుడి చేతి వేళ్లపై మీ దృష్టి పెట్టండి. ఈ భంగిమను ఒక నిమిషం పాటు ఉంచి.. ఆపై విశ్రాంతి తీసుకోండి.

త్రికోణాసనం

మీ పాదాలను వెడల్పుగా ఉంచి నిల్చొండి. మీ ఎడమ కాలి వేళ్లు 45 డిగ్రీల కోణంతో లోపలికి ఎదురుగా ఉండగా మీ కుడి కాలి వేళ్లను బయటికి తిప్పండి. మీ వీపును కుడి వైపునకు వంచి, మీ కుడి చేతిని నేలపైకి తీసుకురండి. కుడి చేతికి సమాంతరంగా ఎడమ చేతిని పైకప్పు వైపునకు విస్తరించండి.

పైకప్పు వైపు చూస్తూ ఒక నిమిషం పాటు అలాగే ఉండండి. మరోవైపు కూడా ఇలా రిపీట్ చేయండి.

వృక్షాసనం

నిటారుగా నిల్చొని.. ఆపై నెమ్మదిగా మీ కుడి పాదాన్ని పైకి లేపండి. మీ దిగువ ఎడమ కాలు లేదా తొడపై దానిని ఉంచండి. మీ రెండు చేతులను గాలిలోకి పైకి లేపి.. ఆపై మీ అరచేతులను కలపండి.

మీ చూపులను నేరుగా ముందుకు లేదా నేలపై కేంద్రీకరించండి. మీరు ఈ ఆసనంలో ఒక నిమిషం పాటు ఉండి.. మరొక కాలుతో పునరావృతం చేయవచ్చు.

సేతు బంధ సర్వంగాసనం

మీ వెనుకభాగంలో పడుకుని.. మీ మోకాళ్లను వంచండి. మీ కుడి చీలమండను కుడి చేతితో, ఎడమ కాలిని ఎడమ చేతితో పట్టుకోండి. మీ తల, భుజాలను నేలపై నొక్కుతూ.. మీ దిగువ శరీరాన్ని మీకు వీలైనంత వరకు గాలిలోకి ఎత్తండి.

మీ తుంటిని పైకి ఎత్తడానికి మీ కాలు కండరాలతో నిమగ్నం చేయండి. నాలుగు నుంచి ఎనిమిది శ్వాసల వరకు ఈ భంగిమలో ఉండండి.

మత్స్యేంద్రాసన

మీ వీపును నిటారుగా ఉంచి మీ కాళ్లను చాచి కూర్చోండి. మీ ఎడమ కాలును వంచి, దాని మడమను కుడి తుంటి పక్కన పెట్టండి. ఇప్పుడు మీ ఎడమ చేతిని ఎడమ మోకాళ్లపై ఉంచండి. మీ కుడి చేయి మీ వెనుక ఉంటుంది.

మీ నడుము, వీపు, భుజాన్ని కుడి వైపునకు తిప్పండి. కొద్దిసేపు సున్నితమైన లోతైన శ్వాసలతో ఈ భంగిమలో ఉండండి. ఇతర కాలుతో ఇదే పునరావృతం చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్