Leafy vegetables: ఆకుకూరలు ఫ్రిజ్‌లో ఎక్కువకాలం తాజాగా నిల్వ ఉండాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి-store leafy vegetables like this to keep them fresh for longer in the fridge ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Leafy Vegetables: ఆకుకూరలు ఫ్రిజ్‌లో ఎక్కువకాలం తాజాగా నిల్వ ఉండాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి

Leafy vegetables: ఆకుకూరలు ఫ్రిజ్‌లో ఎక్కువకాలం తాజాగా నిల్వ ఉండాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి

Haritha Chappa HT Telugu
Nov 14, 2024 07:00 PM IST

Leafy vegetables: ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటిని తెస్తే రెండు రోజులకు మించి నిల్వ ఉండవని అనుకుంటారు. ఫ్రిజ్ లో పెట్టిన కొన్ని గంటల తరువాత అవి రంగు మారడం మొదలైపోతుంది. ఆకుకూరలను ఎలా స్టోర్ చేయాలో టిప్స్ తెలుసుకోండి.

ఆకుపచ్చని ఆకుకూరలు నిల్వచేయడం ఎలా?
ఆకుపచ్చని ఆకుకూరలు నిల్వచేయడం ఎలా? (shutterstock)

ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. వీటిని తినమని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తూనే ఉంటారు. అయితే ఆకుకూరలు ఒక్కసారిగా అధికంగా తెచ్చుకుంటే వాటిని నిల్వ చేయడం కష్టంగా మారిపోతుంది. తెచ్చిన ఒకట్రెండు రోజుల్లోనే వాటిని వండేయాలి.  లేకుంటే అవి ఫ్రిజ్ లో పెట్టిన కూడా త్వరగా పాడైపోతాయి. పాలకూర, తోటకూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా, బచ్చలికూర వంటివన్నీ తాజాగా మార్కెట్లో లభిస్తాయి. 

వీటిని తాజాగా వండితే ఆ కూరకు మంచి రుచి వస్తుంది. పోషకాలన్నీ పుష్కలంగా శరీరానికి అందుతాయి.  కానీ ఈ ఆకుకూరలను ఇంటికి తీసుకువస్తే నిల్వ చేయడం కష్టమని ఎంతోమంది కొనడమే మానేస్తారు. అవి ఒకరోజుకే రంగు మారిపోతాయి. ఆకుకూరల రుచి చెడిపోకుండా ఉండాలంటే వాటిని నిల్వ చేసే పద్ధతులను తెలుసుకోవాలి. 

రంగు మారకుండా…

ఆకుకూరలు తాజాగా ఉండాలంటే తడి కాటన్ క్లాత్ లో చుట్టి ఫ్రిజ్ లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆకులు రంగు మారకుండా తాజాగా ఉంటాయి. మెంతి కూర, బతువా ఆకులు తడిగా ఉండే పొడి కాటన్ గుడ్డలో చుట్టాలి. ఇలా చేయడం వల్ల వస్త్రంలోని తేమను గ్రహించి ఆకులు తాజాగా ఉంటాయి.

పచ్చి ఆకుల కాండం లేదా వేర్లను నీటిలో ముంచడం వల్ల ఆకులు తాజాగా ఉంటాయి. ఆకుకూర వేర్లను ఒక బాటిల్ ముంచి పైన ఆకులకు కవర్ లాంటివి కట్టేయాలి. ఇలా కట్టి ఫ్రిజ్ లో పెడితే అవి చాలా తాజాగా ఉంటాయి. కొత్తిమీరను ఇలా స్టోర్ చేశారంటే అవి తిరిగి జీవించి తాజాగా ఉంటాయి. 

పచ్చని ఆకుకూరలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే వేర్లను కోసి ఆకులను ఏరాలి. ఈ ఆకులను ఒక కవర్లో వేసి ముడి వేయాలి.  వేర్లకు ఉండే మట్టి, బ్యాక్టిరియాల వల్ల ఆకుకూరలు పాడయ్యే అవకాశం ఉంది. 

జనపనార

నార సంచులు మార్కెట్లో అధికంగానే లభిస్తాయి. ఆకుపచ్చ ఆకుకూరలను ఈ సంచుల్లో చుట్టి ఫ్రిజ్ లో పెట్టినా ఆకుపచ్చని  ఆకులు త్వరగా కుళ్లిపోకుండా తాజాగా ఉంటాయి. నాలుగు రోజులైనా ఈ ఆకుకూరలు ఫ్రెష్ గా ఉంటాయి. 

ప్లాస్టిక్ డబ్బాల్లో…

ఆకుకూరల ఆకులను ఏరి వాటిని ప్లాస్టిక్ కంటైనర్లో ఉంచండి. ఆ ప్లాస్టిక్ కంటైనర్ పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉంచితే దీంతో ఆకుపచ్చని ఆకుకూరలు మూడు, నాలుగు రోజుల పాటు సులువుగా చెడిపోకుండా తాజాగా ఉంటాయి.

ఇలా ఆకుకూరలను స్టోర్ చేస్తే ఫ్రిజ్ లో చాలా తాజాగా ఉంటాయి. ఇక్కడ చెప్పిన స్టోరీజీ టిప్స్ ను ఫాలో అయి చూడండి మీకు ఈ టిప్స్ చాలా ఉపయోగపడతాయి. 

ఆకుకూరలు నిల్వ చేయడం కష్టమని తినడం మానేయకండి, కచ్చితంగా తినాల్సిన పోషకాహారాల్లో ఇవీ ఒకటి. చలికాలంలో ఆకుకూరలు అధికంగా లభిస్తాయి. ఈ కాలంలో వీటిని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

 

 

 

Whats_app_banner